Current Affairs March 01 | తేజ మిరపకాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1. ఎక్స్ దస్త్లిక్ పేరుతో ఏ దేశంతో ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు? (2)
1) జపాన్ 2) ఉజ్బెకిస్థాన్
3) రష్యా 4) కజకిస్థాన్
వివరణ: మధ్య ఆసియా దేశం అయిన ఉజ్బెకిస్థాన్‌తో భారత్ ఎక్స్ దస్త్లిక్ అనే సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 20న ప్రారంభం అయింది. మార్చి 5 వరకు కొనసాగుతుంది. ఉత్తరాఖండ్‌లోని పితోర్ఘర్లో నిర్వహిస్తున్నారు. భారత్ తరఫున గర్వాల్ రైఫిల్స్ 14వ బెటాలియన్ ఈ విన్యాసాల్లో పాల్గొంటుంది. ఉజ్బెకిస్థాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వి భూపరివేష్టిత దేశం. గర్వాల్ రైఫిల్స్ అనేది పశ్చిమ కమాండ్‌లో భాగంగా ఉంటుంది. ఇరు దేశాలకు చెందిన సైన్యం అవసరమైన సమయంలో ఎలాంటి సహాయమైనా చేసేందుకు ఉద్దేశించింది.
2. యూఐబీసీయూసీ ఏ దేశంతో ముడిపడి ఉంది? (4)
1) యూఎస్ఏ 2) ఉక్రెయిన్
3) ఉజ్బెకిస్థాన్ 4) యూఏఈ
వివరణ: యూఐబీసీయూసీ అనేది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే.. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్- యూఏఈ చాప్టర్‌గా ఉంటుంది. భారత్, యూఏఈల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఫిబ్రవరి 18న స్థాపించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడంతో పాటు యూఏఈ నుంచి భారత్‌కు 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో యూఐబీసీయూసీ పనిచేస్తుంది. గతేడాది కూడా భారత్, యూఏఈల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ తరహా ఒప్పందం మధ్య ప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భారత్‌కు మొదటిది.
3. బార్లను రద్దు చేస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? (3)
1) గుజరాత్ 2) బీహార్
3) మధ్యప్రదేశ్ 4) నాగాలాండ్
వివరణ: మద్యపాన దుకాణాలకు అనుబంధంగా కూర్చుని తాగే వ్యవస్థలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముగింపు పలకనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్లను మూసివేయాలని నిర్ణయించింది. కేవలం మద్యం దుకాణాలు మాత్రమే ఇకనుంచి ఆ రాష్ట్రంలో పనిచేస్తాయి. దేశంలో పలు రాష్ర్టాల్లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. గుజరాత్, బీహార్, నాగాలాండ్ తదితర రాష్ర్టాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.
4. మొమెంటమ్ యాప్ దేనికి సంబంధించింది? (4)
1) వైద్యం
2) ఢిల్లీలో పాఠశాలల అంశం
3) ఢిల్లీలో వాహనాల వేగం
4) ఢిల్లీలో మెట్రో సేవలు
వివరణ: దేశంలో మెట్రోకు సంబంధించి మొదటి వర్చువల్ షాపింగ్ యాప్‌ను ఢిల్లీ మెట్రో ఆవిష్కరించింది. వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. చెల్లింపులు క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం చేసేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే మెట్రో స్టేషన్ నుంచి వాహన సౌకర్యాన్ని పొందే ఐచ్ఛికాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. మెట్రో స్టేషన్లలో డిజిలాకర్ల అందుబాటును తెలియజేస్తుంది. అలాగే మెట్రో స్టేషన్లో మౌలిక సదుపాయాలు, గేట్ల స్థితి, ఎస్కలేటర్లు, లిఫ్ట్, మెట్రోలో రద్దీ ఎలా ఉంది తదితర సమాచారం కూడా యాప్‌లో పొందవచ్చు.
5. మలబార్ విన్యాసం ఆగస్ట్‌లో ఏ దేశంలో జరుగనుంది? (2)
1) భారత్ 2) ఆస్ట్రేలియా
3) యూఎస్ఏ 4) జపాన్
వివరణ: కేరళ తీరానికే మరోపేరు మలబార్. ఈ ఏడాది ఆగస్ట్‌లో మలబార్ విన్యాసాన్ని ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించనున్నారు. ఆ దేశంలో ఈ విన్యాసం జరగడం ఇదే తొలిసారి. ఈ నావికా విన్యాసాలు 1992లో భారత్, అమెరికాల మధ్య ప్రారంభమయ్యాయి. 2007లో తొలిసారి బంగాళాఖాతంలో జరిగాయి. ఆ తర్వాత 2015లో జపాన్ కూడా ఇందులో చేరింది. 2020లో ఆస్ట్రేలియా కూడా జత కలిసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమ్మిళిత వాణిజ్య విధానాన్ని భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కోరుతున్నాయి. ఈ నాలుగు కలిసి ఏర్పాటు చేసిన కూటమికే క్వాడ్ అని పేరు.
6. అన్ని ఫార్మాట్లలో 25,000 పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాట్స్‌మెన్ ఎవరు? (3)
1) రోహిత్ శర్మ 2) శిఖర్ ధావన్
3) విరాట్ కోహ్లీ 4) కేఎల్ రాహుల్
వివరణ: అన్ని ఫార్మాట్లలో కలిపి 25,000 పరుగులు పూర్తి చేసిన ఆరో క్రీడాకారుడిగా విరాట్ కోహ్ల్లీ నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్, జాక్స్ కలిస్ ఈ ఘనత సాధించారు. కోహ్లీ 25,000 పరుగుల మైలు రాయిని 549వ ఇన్నింగ్స్‌లో పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ ఈ మైలురాయిని 577వ ఇన్నింగ్స్‌లో సాధించాడు. అలాగే 25,000 పరుగులు దాటిన బ్యాట్స్మెన్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతడి బ్యాటింగ్ సగటు 53+గా ఉంది. రెండో స్థానంలో కలిస్ నిలిచాడు. అతడి సగటు 49.10.
7. ‘ఎన్ఈవోఎం’ అనే నగరం ఏ దేశంలో రానుంది? (1)
1) సౌదీ అరేబియా 2) యూఏఈ
3) రష్యా 4) స్పెయిన్
వివరణ: ఎన్ఈవోఎం అనే పేరుతో ఒక నగరాన్ని సౌదీ అరేబియా దేశంలో నిర్మిస్తున్నారు. ఇందుకు 500 బిలియన్ అమెరికా డాలర్లను వెచ్చించనున్నారు. ఎన్ఈవోఎం అంటే ‘న్యూ’ అని అర్థం. గ్రీక్ భాషలో దీని అర్థం కొత్తది అని. ఎం అనే అక్షరం రెండు అంశాలను సూచిస్తుంది. అవి 1. ముస్తకబల్ 2. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్. న్యూయార్క్ కంటే 33 రెట్లు పెద్దదైన నగరంగా దీన్ని నిర్మించనున్నారు. కాలుష్యానికి దూరంగా ఉండేలా పూర్తిగా హరిత ఇంధన వాహనాలనే అనుమతిస్తారు. ఇది 2030 నాటికి పూర్తవుతుంది. 26,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇది విస్తరించి ఉంటుంది.
8. ఇటీవల జాదుయీ పిటార అనే పదం వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) కొత్త సాఫ్ట్వేర్
2) కొత్త విద్యా విధానం మెటీరియల్
3) పిల్లలకు ఉపయోగపడే కొత్త కంప్యూటర్
4) అంతరిక్ష పరిశోధనకు ఉద్దేశించిన యాప్
వివరణ: 10+2+3 స్థానంలో 5+3+3+4 విద్యా విధానాన్ని భారత్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రాథమిక దశలో చదివే విద్యార్థుల కోసం జాదుయీ పిటార పేరుతో కొత్త మెటీరియల్‌ను ఆవిష్కరించింది. మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండే చిన్నారులకు చదువు పట్ల ఆసక్తిని కలిగించేందుకు ఇది ఉద్దేశించింది. ఇందులో ప్లేబుక్స్, బొమ్మలు, పజిల్స్, ఫ్లాష్‌కార్డ్స్, స్టోరీ బుక్స్, వర్క్షీట్లు తదితరాలు ఉంటాయి. భాషలకు సంబంధించిన అంశాలతో పాటు స్థానిక సంస్కృతిని ప్రతిబింభించేలా తీర్చిదిద్దారు. ఇది 13 భాషల్లో అందుబాటులో ఉంది.
9. తేజ మిరపకాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? (3)
1) అలంపూర్-జోగులాంబ
2) వరంగల్
3) ఖమ్మం 4) కరీంనగర్
వివరణ: మిరపకాయలకు ఖమ్మం ప్రసిద్ధి. ఈ పంటను ఎస్17 అనే పేరుతో కూడా పిలుస్తారు. ఘాటు ఉండటంతో వంటల్లో అలాగే కొన్ని రకాల ఔషధాల్లో కూడా ఈ మిరపను వినియోగిస్తారు. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున ఇది ఎగుమతి అవుతుంది. ఈ పంటలకు ఇంకా భౌగోళిక గుర్తింపు దక్కలేదు. ఆసియాలోని వివిధ దేశాలకు ఇది ఎగుమతి అవుతుంది. ముదిగొండ కేంద్రంగా చైనాకు చెందిన ఒలియోరెసిన్ అనే సంస్థ ఈ రకం మిరప ఎగుమతిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ ఎగుమతి విలువ ఏటా రూ.2000 కోట్లు ఉండగా, వచ్చే ఏడాది నాటికి రూ.2500 కోట్లకు చేరనుంది.
10. ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి 62వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించనున్నారు? (4)
1) సబాకరోసి
2) ఆంటోనియో గుటెరస్
3) రబాబ్ ఫాతిమా
4) రుచిరా కాంబోజ్
వివరణ: ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి 62వ సమావేశానికి భారత్‌కు చెందిన రుచిరా కాంబోజ్ నేతృత్వం వహించనున్నారు. ఐక్య రాజ్య సమితిలో భారత తరఫున శాశ్వత ప్రతినిధిగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళ ఆమె. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రుచిరా కాంబోజ్. భూటాన్ దేశానికి రాయబారిగా విధులు నిర్వహించిన తొలి మహిళ కూడా ఆమె. అలాగే పారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కోకు కూడా శాశ్వత రాయబారిగా భారత్ తరఫున పనిచేశారు. 2016లో భారత్ నుంచి మూడు ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఒక ఏడాది ఒక దేశానికి సంబంధించి మూడు ప్రదేశాలు జాబితాలో చోటు సంపాదించడం ఇప్పటి వరకు ఈ ఒక్క సందర్భంలోనే జరిగింది.
11. యునిసెఫ్ తరఫున బాలల రక్షణకు భారత్ నుంచి నియమితులైన నటుడు? (1)
1) ఆయుష్మాన్ ఖురానా
2) అక్షయ్ కుమార్
3) రిషభ్ శెట్టి 4) అనుపమ్ ఖేర్
వివరణ: భారత్‌లో బాలల హక్కుల పరిరక్షణకు యునిసెఫ్ తరఫున రాయబారిగా ఆయుష్మాన్ ఖురానా నియమితులయ్యారు. న్యూయార్క్ కేంద్రంగా యునిసెఫ్ పనిచేస్తుంది. 1989లో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి తీర్మానాన్ని ఆమోదించారు. వాటిని నెరవేర్చడంలో ఖురానా కృషి చేయాలి. ఇదే సంస్థకు 2020లో ఆయన సెలబ్రెటీ అడ్వకేట్‌గా పనిచేశారు. ఇదే సంస్థ దక్షిణాసియా ప్రాంత రాయబారిగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి పనిచేశారు.
12. ఇటీవల నాసా ‘ఫైండర్’ను అభివృద్ధి చేసింది. దీని ప్రయోజనం ఏంటి? (3)
1) కక్ష్య నుంచి పక్కకు వెళ్లిన గ్రహాల గుర్తింపు
2) భూమిపైకి వచ్చే గ్రహ శకలాల గుర్తింపు
3) శిథిలాల్లో చిక్కుకున్న వారి గుర్తింపు
4) పైవేవీ కాదు
వివరణ: భూకంపాలు లేదా ఇతర విపత్తుల మూలంగా శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు నాసా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీనికి ఎఫ్ఐఎన్డీఈఆర్ (ఫైండర్) అని పేరు పెట్టారు. దీని పూర్తి రూపం- ఫైండింగ్ ఇండివిడ్యువల్స్ ఫర్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. సూక్ష్మ తరంగాల నుంచి వెలువడే రాడార్ సెన్సర్ల సాయంతో ఇది పనిచేస్తుంది. భూకంపంతో అతలాకుతలం అయిన తుర్కియే దేశానికి ప్రస్తుతం ఈ పరికరాన్ని అమెరికా అందించింది. శిథిలాల్లో ఉన్నది మనుషులా కాదా అన్న అంశాన్ని కూడా ఫైండర్ గుర్తించగలుగుతుంది.
13. ఏ రాష్ట్రంలో దెబ్రిఘర్ పులుల రిజర్వ్ రానుంది? (4)
1) హర్యానా 2) మధ్యప్రదేశ్
3) హిమాచల్ ప్రదేశ్ 4) ఒడిశా
వివరణ: దెబ్రిఘర్ను పులుల రిజర్వ్‌గా ప్రకటించేందుకు జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) అనుమతి ఇచ్చింది. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇది మూడో పులుల రిజర్వ్. ఇప్పటికే ఒడిశాలో సిమ్లిపాల్, సత్కొషియా పులుల రిజర్వ్‌లు ఉన్నాయి. దెబ్రిఘర్ను 1985లో అభయారణ్యంగా ప్రకటించారు. ఇది ఒడిశాలోని హిరాకుడ్ డ్యామ్‌కు సమీపంలో బర్ఘర్ జిల్లాలో ఉంది.
14. ఏ వ్యవస్థ ఆధారంగా వాయులింక్ పనిచేయనుంది? (2)
1) జీపీఎస్ 2) ఐఆర్ఎన్ఎస్ఎస్
3) బీడు 4) గ్లోనాస్
వివరణ: భారత వాయు దళం ఇటీవల వాయులింక్ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బేస్ స్టేషన్‌తో ఇది అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. ఇది భారత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)తో పనిచేస్తుంది.
15. నీతి ఆయోగ్ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు? (3)
1) రాజీవ్ కుమార్
2) పరమేశ్వరన్ అయ్యర్
3) బీవీఆర్ సుబ్రమణ్యం
4) అమితాబ్ కాంత్
వివరణ: నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో పరమేశ్వరన్ అయ్యర్ ఉన్నారు. ఆయన ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. బీఆర్ సుబ్రమణ్యం 1987 బ్యాచ్‌కు చెందిన ఛత్తీస్‌గఢ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. నీతి ఆయోగ్‌లో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియిమితులైన తొలి తెలుగు వాడు. 2018 నుంచి ఆయన జమ్ముకశ్మీర్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలోనే జమ్ముకశ్మీర్‌ను విడదీసి జమ్మును కేంద్ర పాలిత ప్రాంతంగా, లఢక్‌ను మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలకు సంబంధించిన ప్రధాన మంత్రి కార్యాలయంలో కూడా ఆయన విధులు నిర్వహించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?