Current Affairs March 27th | జాతీయం
ఐఎన్ఎస్ సుజాత
కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లోని ఐఎన్ఎస్ సుజాత నౌక విదేశీ విస్తరణలో భాగంగా మార్చి 19, 20 తేదీల్లో మొజాంబిక్‌లోని పోర్ట్ మపుటోను సందర్శించింది. మొజాంబికన్ నేవీ రియర్ అడ్మిరల్ యుజెనియో డయాస్ డా సిల్వా ముటుకా, మపుటో మేయర్ ఎనియాస్ డా కాన్సెకావో కొమిచే ఈ నౌక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరుదేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం మెరుగుపర్చుకోవడం ఈ సందర్శన ఉద్దేశం.
జపాన్‌తో బంధం
జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా 27 గంటల భారత పర్యటనలో భాగంగా మార్చి 20న ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోదీతో కలిసిన కిషిదా భారత్-జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడంపై చర్చించారు. భారత్ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుతో పాటు జపాన్ సారథ్యంలో నిర్వహించనున్న జీ7 సమావేశాల్లో ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని మోదీ, కిషిదా తీర్మానించుకున్నారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ నుంచి నాలుగో విడతగా 300 బిలియన్ల యెన్ల (రూ.18,800 కోట్లు) రుణానికి సంబంధించిన పత్రాలపై ఇరుదేశాల నాయకులు సంతకాలు చేశారు.
అతిపెద్ద టెలిస్కోప్
ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ (ఐఎల్ఎంటీ)ను మార్చి 21న ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ఆవిష్కరించారు. ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషనల్ సైన్స్ (ఏఈఆర్ఐఈఎస్) క్యాంపస్‌లో ఉన్న అబ్జర్వేటరీ వద్ద 2450 మీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారు.
ఐఎన్ఎస్ ఆండ్రోత్
భారత నౌకాదళం ఐఎన్ఎస్ ఆండ్రోత్ నౌకను కోల్‌కతాలో వెస్టర్న్ నేవల్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ డినేష్ కే త్రిపాఠి మార్చి 21న ప్రారంభించారు. యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూఎస్‌డబ్ల్యూసీ)లో భాగంగా నిర్మిస్తున్న ఎనిమిది నౌకల్లో ఇది రెండోది. వీటిని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) నిర్మిస్తుంది. ఇది 77.6 మీటర్ల పొడవు, 10.5 మీ. వెడల్పు ఉంది. దీని స్పీడ్ 25 నాట్స్. ఇది ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లు, తేలికైన టార్పెడోలు, క్లోజ్ ఇన్ వెపన్స్ సిస్టమ్ (30 ఎంఎం గన్), 16.7 ఎంఎం స్టెబిలైడ్జ్ రిమోట్ కంట్రోల్డ్ గన్లను మోయగలదు. తీరప్రాంత భద్రతను పర్యవేక్షిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?