ECONOMY | పుర నమూనాలో ఎన్ని గ్రామాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు?
1. కింది వాటిలో ప్రణాళిక లక్ష్యాల్లో లేనిది?
ఎ) ఆదాయ సంపద పంపిణీ అసమానతల తొలగింపు
బి) ప్రాంతీయ అసమానతల తొలగింపు
సి) ఆధునీకీకరణ
డి) పన్నుల విధింపు
2. భారతదేశంలో పేదరికం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) స్థిరంగా ఉంది డి) ఏదీకాదు
3. సంపద కొద్ది మంది చేతుల్లో ఉండటాన్ని ఏమంటారు?
ఎ) కేంద్రీకరణ బి) వికేంద్రీకరణ
సి) కుదింపు డి) విస్తరణ
4. దేశంలోని జనాభాను ఏమంటారు?
ఎ) సహజ మూలధనం
బి) భౌతిక మూలధనం
సి) మానవ మూలధనం
డి) ఆర్థిక మూలధనం
5. భూములు, భవనాలు, యంత్రాలు, యంత్రపరికరాలు ఏ రకమైన మూలధనం?
ఎ) సహజ మూలధనం
బి) భౌతిక మూలధనం
సి) మానవ మూలధనం డి) పైవన్నీ
6. సమాజంలో ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ కల్పించే బీమా సదుపాయాన్ని ఏమంటారు?
ఎ) సాంఘీక భద్రత
బి) సామాజిక భద్రత
సి) సాంఘిక సంక్షేమం డి) పైవన్నీ
7. దేశంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటాన్ని ఏమంటారు?
ఎ) అసమానతలు
బి) ప్రాంతీయ అసమానత
సి) మానవ అసమానత
డి) కేంద్రీకరణ
8. జాతీయాదాయాన్ని కొంత మందికి ఎక్కువ, మరికొంత మందికి తక్కువ ఆదాయం పంపిణీ చేసినట్లయితే దాన్ని ఏమంటారు?
ఎ) ఆదాయ అసమానతలు
బి) సంపద అసమానతలు
సి) పంపిణీ అసమానతలు
డి) పైవన్నీ
9. విత్త సంస్థలు / ఆర్థిక సంస్థలు అంటే?
ఎ) పొదుపును సేకరించేది
బి) పెట్టుబడిని అందించేవి
సి) ఎ, బి
డి) కరెన్సీని ముద్రించేవి
10. షెడ్యూల్డు బ్యాంకులు అంటే?
ఎ) ఆర్బీఐ-1934లో 2 షెడ్యూల్డ్‌లో నమోదు అయిన బ్యాంకులు
బి) ఆర్బీఐ -1934లో 2 షెడ్యూల్డ్‌లో నమోదు కాని బ్యాంకులు
సి) ఆర్బీఐ -1934లో 2 షెడ్యూల్లోని అన్ని బ్యాంకులు
డి) పైవేవీకావు
11. ఆర్బీఐ -1934లో రెండో షెడ్యూల్డ్‌లో నమోదు కాని బ్యాంకులను ఏమంటారు?
ఎ) షెడ్యూల్డ్ బ్యాంకులు
బి) నాన్‌షెడ్యూల్డ్ బ్యాంకులు
సి) ఎ,బి డి) పైవేవీకావు
12. అంబుడ్స్‌మన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1993 బి) 1994
సి) 1995 డి) 1996
13. వినియోగదారులు, ఖాతాదారులు బ్యాంకింగ్ సేవల పట్ల సంతృప్తి చెందని వారు ఎవరికి ఫిర్యాదు చేయవచ్చు?
ఎ) అంబుడ్స్‌మన్ బి) షెడ్యూల్డ్ బ్యాంకు
సి) నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్
డి) ఆర్బీఐ
14. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్ని అబుడ్స్మన్ ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి?
ఎ) 15 బి) 16 సి) 17 డి) 18
15. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకును ఎప్పుడు స్థాపించారు?
ఎ) క్రీ.శ. 1912 బి) క్రీ.శ. 1914
సి) క్రీ.శ. 1916 డి) క్రీ.శ. 1918
16. యూనిట్ బ్యాంకింగ్‌ను మొదట ఏ దేశంలో ప్రారంభించారు?
ఎ) అమెరికా బి) ఇంగ్లాండ్
సి) ఇటలీ డి) గ్రీక్
17. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రకానికి చెందినది?
ఎ) యూనిట్ బ్యాంకింగ్
బి) బ్రాంచ్ బ్యాంకింగ్
సి) కోర్ బ్యాంకింగ్
డి) యూనివర్సల్ బ్యాంకింగ్
18. భారతదేశంలో యూనివర్సల్ బ్యాంకింగ్ వ్యవస్థను సూచించిన కమిటీ ఏది?
ఎ) యం. నర్సింహం కమిటీ (1991)
బి) ఆర్.హెచ్. ఖాన్ కమిటీ
సి) కాల్ధార్ కమిటీ
డి) రంగరాజన్ కమిటీ
19. బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ వాణిజ్య బ్యాంకుగా ఏ సంవత్సరంలో రూపొందింది?
ఎ) 1880 బి) 1881
సి) 1882 డి) 1883
20. రుణాలను మంజూరు చేయడంలో కఠినమైన నియమ నిబంధనలు పాటించే బ్యాంకును ఏమంటారు?
ఎ) కాసినోబ్యాంకు
బి) న్యారో బ్యాంకు
సి) యూనివర్సల్ బ్యాంకు
డి) మిక్సిడ్ బ్యాంకు
21. రుణాలను మంజూరు చేయడంలో సులభమైన నియమ నిబంధనలు పాటించే బ్యాంకు?
ఎ) కాసినో బ్యాంకు
బి) యూనివర్సల్ బ్యాంకు
సి) మిక్స్డ్ బ్యాంకు
డి) కోర్ బ్యాంకు
22. పుర నమూనా రూపొందించినది ఎవరు?
ఎ) ఆచార్య లక్డావాఆ
బి) మొరార్జీ దేశాయ్
సి) అబ్దుల్ కలాం
డి) కె.ఆర్. నారాయణ
23. నాలుగు రంగాల నమూనాలో కె1 అంటే?
ఎ) పెట్టుబడి రంగం
బి) వ్యవసాయ రంగం
సి) పారిశ్రామిక రంగం
డి) సేవా రంగం
24. వేతన వస్తు వ్యూహంను రూపొందించినది ఎవరు?
ఎ) వకీలు బి) బ్రహ్మనందం
సి) ఎ, బి డి) అగర్వాల్
25. రావు- మన్మోహన్ నమూనాలో రావు అంటే ఎవరు?
ఎ) చంద్రశేఖర్ రావు
బి) నర్సింహారావు
సి) రామారావు డి) హరీష్‌రావు
26. పుర నమూనాను ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 2002 బి) 2003
సి) 2004 డి) 2005
27. పట్టణ ప్రాంతంలోని సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించే నమూనా ఏది?
ఎ) పుర నమూనా బి) రూర్బన్ మిషన్
సి) గాంధీ వ్యూహం డి)ఎ, బి
28. పుర నమూనాను అనుసరించిన ప్రణాళిక ఏది?
ఎ) 8 బి) 9 సి) 10 డి) 11
29 రూర్బన్ మిషన్ ఏ ప్రణాళిక స్వభావాన్ని కలిగింది?
ఎ) కేంద్రీకృత ప్రణాళిక
బి) వికేంద్రీకృత ప్రణాళిక
సి) సూచనాత్మక ప్రణాళిక డి) పైవన్నీ
జవాబులు
1-డి 2-ఎ 3-ఎ 4-సి
5-బి 6-డి 7-బి 8-డి
9-సి 10-ఎ 11-బి 12-సి
13-ఎ 14-సి 15-బి 16-ఎ
17-బి 18-బి 19-డి 20-బి
21-ఎ 22-సి 23-ఎ 24-సి
25-బి 26-సి 27-డి 28-సి
29-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు