Current Affairs – Groups Special | క్రీడలు
అంధుల క్రికెట్
ఐబీఎస్ఏ (ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) ప్రపంచ అంధుల క్రీడల్లో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలుచుకుంది. బర్మింగ్‌హామ్‌లో ఆగస్టు 26న జరిగిన ఫైనల్ పోటీల్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయి భారత జట్టు గెలిచింది. ఈ క్రీడల్లో తొలిసారి క్రికెట్‌ను చేర్చారు. ఈ జట్టులో ఏపీలోని విశాఖపట్నంలోని నేత్ర విద్యాలయానికి చెందిన సత్యవతి (వికెట్ కీపర్), రమణి (ఆల్‌రౌండర్), సంధ్య (బౌలర్) ఉన్నారు.
ప్రణయ్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు ప్రణయ్ కాంస్యం గెలుచుకున్నాడు. కొపెన్‌హెగెన్‌లో ఆగస్టు 26న జరిగిన సెమీ ఫైనల్ పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ మూడో ర్యాంకర్ కునవత్ వితిద్సర్న్ (థాయిలాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 2011 నుంచి ఈ మెగాటోర్నీలో భారత్ కనీసం ఒక పతకమైనా గెలుస్తుంది. పురుషుల సింగిల్స్‌లో పతకం సాధించిన ఐదో భారత ఆటగాడిగా ప్రణయ్ రికార్డుల్లోకెక్కాడు.
నీరజ్ చోప్రా
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఆగస్టు 27న జరిగిన పోటీలో నీరజ్ జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. ఈ పోటీలో పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజతం, చెక్ రిపబ్లిక్కు చెందిన వద్లెచ్ కాంస్యం గెలుచుకున్నారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






