Current Affairs – Groups Special | వార్తల్లో వ్యక్తులు
శరత్
తెలంగాణకు చెందిన వెన్నవెల్లి శరత్‌కు ‘అమెరికా యంగ్ ప్రొఫెషనల్’ అవార్డు-2023 లభించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఈ అవార్డును ఆగస్టు 28న ప్రకటించింది. శరత్ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దరిపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన హ్యూస్టన్‌తో పాటు అనేక నగరాల్లో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. హూస్టన్‌లో నిర్మించిన మెమోరియల్ పార్కుకు శరత్‌కు ఇటీవల నేషనల్ అవార్డు లభించింది. ఈ అవార్డును అక్టోబర్ 29న ప్రదానం చేయనున్నారు.
గీతిక శ్రీవాస్తవ
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారతదేశం తరఫున చార్జ్ డి అఫైర్స్ (సీడీఏ)గా గీతిక శ్రీవాస్తవను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 28న వెల్లడించింది. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ ఆమె. ఇప్పటి వరకు ఈ పదవిలో ఎం సురేష్ కుమార్ ఉన్నారు. గీతిక 2005 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్) ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో, హిందూ మహాసముద్ర ప్రాంత విభాగానికి డైరెక్టర్ పనిచేశారు.
శ్వేతా శారద
చండీగఢ్‌కు చెందిన శ్వేతా శారదా మిస్ దివా యూనివర్స్-2023 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టు 27న ముంబైలో ఈ పోటీలు నిర్వహించారు. రన్నరప్‌గా కర్ణాటకకు చెందిన త్రిష శెట్టి నిలిచారు. శ్వేతా శారద 72వ మిస్ యూనివర్స్ పోటీలకు భారత్ తరఫున పాల్గొననున్నారు.
క్లెయిర్ కౌటిన్హో
బ్రిటన్ క్యాబినెట్లో భారత సంతతి మహిళ క్లెయిర్ కౌటిన్హోను ప్రధాన మంత్రి రిషి సునాక్ ఆగస్టు 31న నియమించారు. గోవా మూలాలున్న ఆమెకు ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. బ్రిటన్‌లో జన్మించిన ఆమె ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మ్యాథ్స్, ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు.
జయవర్మ
రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా జయవర్మ సిన్హా సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. రైల్వే బోర్డు చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్)కు చెందిన ఆమె ఈ ఏడాది జనవరి 25న బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె బోర్డు సభ్యురాలిగా ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహరాలు చూస్తున్నారు. ఏకే లహోటీ పదవీకాలం ముగియడంతో జయవర్మను నియమించారు. సెప్టెంబర్ 30నే ఆమె పదవీ విరమణ చేయనున్నా పునర్నియామకంపై అక్టోబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?