Current Affairs – Groups Special | అంతర్జాతీయం
బ్రైట్ స్టార్-23
‘బ్రైట్ స్టార్-23’ అనే వైమానిక దళ ఎక్సర్సైజ్ ఈజిప్టు రాజధాని కైరో ఎయిర్ బేస్‌లో ఆగస్టు 27న ప్రారంభమయ్యింది. భారతదేశం, అమెరికా, సౌదీ అరేబియా, గ్రీస్, ఖతార్లకు చెందిన వైమానిక దళాలు ఈ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నాయి. భారత వైమానిక దళం ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇది ద్వైవార్షిక బహుపాక్షిక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. దీనిలో పాల్గొన్న దేశాల రాజకీయ, రక్షణ, భద్రత, ఇంధనం, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం.
భారత్-బంగ్లాదేశ్
భారతదేశం, బంగ్లాదేశ్‌ల 5వ వార్షిక డిఫెన్స్ డైలాగ్‌ను ఢాకాలో ఆగస్టు 27, 28 తేదీల్లో నిర్వహించారు. భారత రక్షణ కార్యదర్శి గిరిధర్ అరామానె బంగ్లాదేశ్ కౌంటర్పార్ట్ లెఫ్టినెంట్ జనరల్ వకర్ ఉజ్ జమాన్‌తో సమావేశామయ్యారు. రక్షణ సహకార కార్యకపాలాలపై, ఇరుదేశాల భవిష్యత్తు సంబంధాలపై చర్చించారు.
డ్రోన్లు
జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు తమ లక్ష్యాన్ని ఛేదించేలా చైనా పరిశోధకులు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. దీని గురించి అక్కడి ‘డిఫెన్స్ వన్’ మ్యాగజైన్లో కథనం ప్రచురించినట్లు మీడియా ఆగస్టు 27న వెల్లడించింది. దీని ప్రకారం కెమెరా డాటాను విశ్లేషించి ఏఐ ఆధారంగా రోబోలు టార్గెట్‌ను కచ్చితంగా గుర్తిస్తాయి. కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ డ్రోన్లకు జీపీఎస్ అవసరం లేదు. ఇమేజ్ బేస్డ్ విజువల్ సర్వోయింగ్ (ఐబీవీఎస్) టెక్నాలజీతో పనిచేసే ఈ డ్రోన్లు అల్గారిథమ్, సెన్సర్ల సాయంతో కదులుతున్న లక్ష్యాలను ఛేదిస్తాయి.
హిందూ వారసత్వ నెల
అక్టోబరును ‘హిందూ వారసత్వ నెల’గా అమెరికాలోని జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్ ఆగస్టు 31న ప్రకటించారు. అక్టోబర్‌లో మహాత్మాగాంధీ జయంతితో పాటు దేవీ శరన్నవరాత్రులు, దీపావళి వంటి ప్రముఖ పండుగలుండటంతో ప్రతిభావంతులైన హిందూ-అమెరికన్లకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఈ నెలలో హిందూ సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మిలిటరీ ఎక్సర్సైజ్
7 దేశాల సైనిక ఎక్సర్సైజ్ను ఆగస్టు 31న ఇండోనేషియాలోని జావాలో ప్రారంభించారు. ఈ ఎక్సర్సైజ్ను అమెరికా, ఇండోనేషియా 2009 నుంచి నిర్వహిస్తున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, ఈ సంవత్సరం యూకే, ఫ్రాన్స్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటున్నాయి. తూర్పు జావా ప్రావిన్స్‌లోని తీర ప్రాంత పట్టణం బలూరన్లో రెండు వారాలు ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించనున్నారు. ఈ విన్యాసాలకు భారత్, బ్రూనై, బ్రెజిల్, కెనడా, జర్మనీ, మలేషియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తూర్పు తైమూర్ దేశాలు తమ పరిశీలకులను పంపాయి. మొత్తం 19 దేశాల భాగస్వామ్యం ఉన్న ఈ వీక్షణ విన్యాసాలు ఇండో-పసిఫిక్ ప్రాంత రక్షణకు బహుపాక్షిక సంఘీభావ ప్రదర్శన అని అమెరికా సైన్యానికి చెందిన కమాండింగ్ జనరల్ చార్లెస్ ఫ్లిన్ పేర్కొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?