Current Affairs – Groups Special | జాతీయం
ఎన్టీఆర్ నాణెం
ప్రముఖ సినీ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ స్మారకంగా రూ.100 నాణేన్ని ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ విడుదల చేశారు. ఎన్టీఆర్ గౌరవార్థం శత జయంతిని పురస్కరించుకుని ఈ నాణేన్ని ముద్రించారు. 44 మి.మీ. చుట్టుకొలతతో ఉండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా, మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీలో రాసి ఉంది. ఇది హైదరాబాద్‌లో తయారు కాగా, తొలిసారి వ్యక్తి చిత్రంతో ముద్రించినట్టు మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. తొలి విడతలో 12 వేల నాణేలు ముద్రించారు. ఈ నాణెం ధర రూ.3,500 నుంచి రూ.4,850 వరకు ఉంది.
ఇథనాల్ కార్
టయోట మోటార్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌తో కూడిన పూర్తిగా ఇథనాల్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 29న ఆవిష్కరించారు. ఇది బీఎస్ 6 హైబ్రిడ్ ఇథనాల్ ఇన్నోవా కారు. ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్ ప్రత్యామ్నాయ ఇంధనంపై మాత్రమే కాకుండా దాని విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈవీ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. ఇథనాల్ రెన్యూవబుల్ ఇంధనం. దీన్ని చెరకు నుంచి తయారు చేస్తారు. ఇంకా మొక్కజొన్న, జొన్న, ఇతర మొక్కల నుంచి కూడా ఇథనాల్‌ను తయారు చేస్తారు. ఇంధనంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. 2025 నాటికల్లా పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం కలిపే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
నీలాచల్ ఫ్లైఓవర్
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గువాహటిలో నీలాచల్ ఫ్లైఓవర్‌ను ఆగస్టు 30న ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అసోం రాష్ట్రంలోనే పొడవైనది. ఇది 2.63 కి.మీ. పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్‌ను మాలిగావ్ చరియాలి నుంచి కామాఖ్య గేట్ వరకు నిర్మించారు. దీని నిర్మాణ వ్యయం రూ.420.75 కోట్లు.
ఆధార్ లింక్డ్
ఆధార్ లిక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ (ఏఎల్బీఆర్)ను నాగాలాండ్ ప్రభుత్వం ఆగస్టు 31న ప్రారంభించింది. దీంతో ఈశాన్య (నార్త్ ఈస్టర్న్) రాష్ర్టాల్లో ఈ వ్యవస్థను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఇది 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు జనన నమోదు ఆధారిత ఆధార్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఏఎల్బీఆర్ అనేది పుట్టిన సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నిర్వహించే ఒక వ్యవస్థ. ఇది జనన నమోదుకు లింక్ చేస్తుంది.
మహేంద్రగిరి
భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక సెప్టెంబర్ 1న చేరింది. దీన్ని ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ భార్య సుదేష్ ధన్‌ఖడ్ ప్రారంభించారు. దీని పొడవు 149.03 మీటర్లు, వెడల్పు 17.8 మీటర్లు, బరువు దాదాపు 6,670 కిలోలు. ఇది గంటకు 51.856 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. దీనిలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సర్లు, రెండు గ్యాస్ టర్బైన్లు, మరో రెండు డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ 17ఏ (శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్)లో భాగంగా నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేట్‌లో మహేంద్రగిరి ఏడోది. దీనికంటే ముందు నిర్మించిన ఆరో ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 17న ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?