Current Affairs – Groups Special | వార్తల్లో వ్యక్తులు
జాన్ వార్నాక్
అడోబ్ సహ వ్యవస్థాపకుడు జాన్ వార్నాక్ (82) ఆగస్టు 19న మరణించారు. వార్నాక్ 1982లో చార్లెస్ గెష్కేతో కలిసి శాన్‌జోస్ కేంద్రంగా అడోబ్ కంపెనీని స్థాపించారు. 2000 వరకు ఆ కంపెనీ సీఈవోగా, 2001లో పదవీ విమరణ పొందేవరకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతున్నారు. గెష్కే 2021లో 81 ఏండ్ల వయస్సులో మరణించారు. అడోబ్‌ని స్థాపించడానికి ముందు వార్నాక్ జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్లో ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేశారు.
స్రెట్టా థావిసిన్
థాయిలాండ్ కొత్త ప్రధానిగా రియల్ ఎస్టేట్ టైకూన్ స్రెట్టా థావిసిన్ ఆగస్టు 23న ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల నిర్వహించిన ఓటింగ్‌లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రకు చెందిన ఫ్యూథాయ్ పార్టీ నేతృత్వంలోని కూటమి గెలిచింది. మొత్తం 727 ఓట్లలో థాయ్ పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి. రెండు మిలిటరీ అనుకూల పార్టీలతో పాటు మొత్తం 11 పార్టీల సంకీర్ణ కూటమికి థావిసిన్ నేతృత్వం వహించనున్నారు.
హున్ మానెట్
కంబోడియా నూతన ప్రధానిగా దీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన హున్ సెన్ కుమారుడు హున్ మానెట్ ఆగస్టు 22న ఎన్నికయ్యారు. ఫోర్ స్టార్ జనరల్ అయిన మానెట్‌ను కంబోడియా పార్లమెంటులోని మొత్తం 123 మంది సభ్యులు ఆయనను ఎన్నుకున్నారు. మానెట్ తండ్రి సెన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. దీంతో హున్ సెన్ ఆసియాలోనే అత్యంత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న దేశాధినేతగా గుర్తింపు పొందారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?