Current Affairs – Groups Special | అంతర్జాతీయం

ఫొటోగ్రఫీ డే
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు 19న నిర్వహించారు. ఫొటోగ్రఫీ చరిత్ర, ప్రస్తుత ఫొటోగ్రఫిక్ ట్రెండ్లలో సాధించిన వృద్ధికి గుర్తుగా ఈ రోజును ఏటా నిర్వహిస్తున్నారు. 1837లో ఫ్రెంచ్కు చెందిన లూయిస్ డాగ్యూరే, జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్సే మొదటిసారి ఫొటోగ్రఫిక్ ప్రక్రియను కనుగొన్నారు. 1839, జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దీన్ని ప్రకటించింది. అదే సంవత్సరం ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ఆవిష్కరణకు పేటెంట్‌ను కొనుగోలు చేసి ప్రపంచానికి ఉచితంగా బహుమతిగా ఇచ్చింది. ఈ ఏడాది దీని థీమ్ ‘ల్యాండ్‌స్కేప్’.
మానవతా దినోత్సవం
ప్రపంచ మానవతా దినోత్సవం (వరల్డ్ హ్యుమానిటేరియన్ డే)ను ఆగస్టు 19న నిర్వహించారు. సంక్షోభ ప్రభావిత ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి, అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మానవతావాదుల అసాధరణ ప్రయత్నాలను గౌరవించడానికి ఈ రోజును నిర్వహిస్తున్నారు. 2003, ఆగస్టు 19న ఇరాక్, బాగ్దాద్‌లోని కెనాల్ హోటల్‌పై జరిగిన బాంబు దాడిలో 22 మంది మరణించారు. మరణించినవారిలో ఇరాక్‌లోని ప్రముఖ మానవతావాది సెర్గియో వియెరా డిమెల్లో కూడా ఉన్నారు. దీంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ 2009లో ఆగస్టు 19న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది. ఈ ఏడాది ఈ దినోత్సవ థీమ్ ‘నో మ్యాటర్ వాట్’.
ఆర్ఎస్వీ వ్యాక్సిన్
నవజాత శిశువుల్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ) వల్ల కలిగే వ్యాధిని నిరోధించే టీకాను ఫైజర్ కంపెనీ రూపొందించిన టీకాను అమెరికా ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆగస్టు 20న ఆమోదించింది. దీంతో ఈ టీకాను ఆమోదించిన మొదటి దేశంగా అమెరికా నిలిచింది. ఈ వ్యాక్సిన్‌ను గర్భం దాల్చిన 32 నుంచి 36 వారాలకు ఒక్కసారే ఇస్తారు. దీనివల్ల ఆరు నెలల వరకు పుట్టిన శిశువులను ఆర్ఎస్వీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
మలబార్ ఎక్సర్సైజ్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహిస్తున్న 27వ ఎడిషన్ మలబార్ నేవీ ఎక్సర్సైజ్ ఆగస్టు 21న ముగిసింది. దీనిలో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, యూఎస్ నావికాదళాలు పాల్గొన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నాలుగు దేశాల బలమైన సహకారం, భాగస్వామ్య విలువలు, సామూహిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఎక్సర్సైజ్ను చేపట్టారు. ఈ ఎక్సర్సైజ్ను రెండు దశలుగా.. హార్బర్ దశ ఆగస్టు 11 నుంచి 15 వరకు, సముద్ర దశ ఆగస్టు 16 నుంచి 21 వరకు నిర్వహించారు.
స్పేస్‌ఎక్స్‌పై కేసు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌పై ఆగస్టు 24న దావా వేసింది. స్పేస్ఎక్స్ శరణార్థులకు వ్యతిరేకంగా వివక్షతో కూడిన నియామక పద్ధతులను అనుసరిస్తుందని పేర్కొంది. అమెరికా పౌరులు కానివారిని నియమించుకోమనడంతో ఆశ్రయం కోరేవారిని దరఖాస్తు చేసుకోకుండా నిరుత్సాహపరిచిందని ఆరోపించింది. ఈ ప్రవర్తన ఫెడరల్, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించడమేనని డీవోజే పౌరహక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ వెల్లడించారు.
మొహజెర్-10
ఇజ్రాయెల్‌పై దాడిచేసే శత్రు డ్రోన్లను ఛేదించగల కొత్త డ్రోన్ మొహజెర్-10ను రక్షణ పరిశ్రమ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరాన్ మంత్రిత్వ శాఖ ఆగస్టు 22న ఆవిష్కరించింది. ఈ డ్రోన్ మొహజర్-6కు అప్డేట్ వెర్షన్. ఇది యూఎస్ తయారు చేసిన ఎంక్యూ-9 రీపర్‌ను పోలి ఉండి రాడార్లకు చిక్కకుండా 300 కేజీల వార్హెడ్లను మోసుకెళ్లగలదు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు