Current Affairs | ఆర్టికల్ 46 ఎవరి విద్యా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది?

1. మొదటి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి?
1) 51 2) 52 3) 53 4) 54
2. ప్రధాన మంత్రి రాష్ట్రపతిచేత నియమితులవుతారు అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో నిర్దేశించారు?
1) 73(1) 2) 74(1)
3) 75(1) 4) 61(1)
3. 17వ లోక్సభకు ఎంతమంది మహిళలు సభ్యులుగా ఎన్నికయ్యారు?
1) 61 2) 78 3) 75 4) 65
4. కింది వాటిలో ఓటర్ల సంఖ్య ఆధారంగా అత్యంత చిన్న లోక్సభ నియోజకవర్గం ఏది?
1) ఉన్నవ్(Unnao) 2) మల్కాజిగిరి
3) లక్షద్వీప్ 4. లడఖ్
5. కింది వాటిలో జనాభా ప్రాతిపదిక మీద ఏది ఇండియాలో అత్యంత చిన్న నియోజకవర్గం?
1) ఉన్నవ్ (Unnao) 2) మల్కాజిగిరి
3) బెంగళూరు ఉత్తరం 4) లడఖ్
6. లోక్సభకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి?
ఎ) లోక్సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25 – 1952 ఫిబ్రవరి 21 మధ్య నిర్వహించిన తరువాత, లోక్సభ మొదటి సమావేశం 1952 ఏప్రిల్ 17న జరిగింది
బి) ప్రథమ లోక్సభ పూర్తి పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 1957 మే 4న రద్దు అయింది
సి) ప్రథమ లోక్సభ మొదటి సమావేశం 1952 ఏప్రిల్ 13న ప్రారంభమైంది
1) ఎ 2) సి 3) ఎ, బి డి) బి, సి
7. కాపీ రైట్ యాక్ట్ భారతదేశంలో ఏ సంవత్సరంలో చట్టం చేశారు?
1) 1957 2) 1857
3) 1911 4) 1912
8. భారత పార్లమెంట్ ఎప్పుడు ‘సమాచార హక్కు చట్టం (Right to Information Act)ను ఆమోదించింది?
1) 15 జూలై, 2005
2) 15 జూన్ 2005
3) 12 అక్టోబర్ 2006
4) 12 సెప్టెంబర్ 2005
9. రహస్య సమాచారానికి సంబంధించిన గూఢచర్యం, తప్పుడు సమాచారం వ్యాప్తి ఏ చట్టం పరిధిలోకి వస్తుంది?
1) పోలీస్ యాక్ట్
2) ఇండియన్ ప్రెస్ యాక్ట్
3) అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్
4) యంగ్ పర్సన్స్ యాక్ట్
10. భారత ప్రభుత్వ రాజపత్రం ప్రచురణ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది?
1) కమ్యూనికేషన్
2) హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్
3) ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్
4) హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్
11. నోటాకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) భారతదేశంలో నోటాను మొదటిసారిగా 2009లో వాడారు. 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల నుంచి నోటా వాడకం ప్రారంభమైంది?
బి) నోటాకు ప్రత్యేక గుర్తు ఉంది. బ్యాలెట్ పత్రం మీద అడ్డంగా ఒక నల్లని ఇంటు గుర్తు
సి) నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికలైన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో మాత్రమే ఉంటుంది
డి) నోటా కింద ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ ఓట్లు వచ్చినా, మొత్తం చెల్లిన ఓట్లలో భాగంగా చూడరు
పై వాటిలో సరైనవి ఏవి?
1) ఎ, బి, సి 2) బి. సి, డి
3) ఎ, బి, సి, డి 4) పైవేవీకాదు
12. డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి?
ఎ) 1949 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగ రచన పూర్తికావడంతో పౌరసత్వం, ఎన్నికలు, పౌరసత్వ నిబంధనలు, తాత్కాలిక పార్లమెంట్ వంటి అంశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి రాజ్యాంగంలోని మిగిలిన అంశాలు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాయి
బి) జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 1929 జనవరి 26న ‘పూర్ణ స్వరాజ్యం’గా తీర్మానం చేసింది. అందువల్ల ఆ రోజును 1950లో గణతంత్ర దినంగా నిర్ణయించారు.
సి) రాజ్యాంగ పరిషత్తు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదు. అది మొదటగా ఎం.ఎన్.రాయ్ చేత 1934లో ప్రతిపాదించడమైంది
పై వాటిలో సరైనవి ఏవి?
1) ఎ 2) ఎ, సి
3) బి, సి 4) పైవేవీకావు
సమాధానాలు
1-3 2-3 3-2 4-3
5-4 6-1 7-1 8-2
9-3 10-2 11-3 12-4
1. హిందూ మైనారిటీ, దత్తత బిల్లు ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
1) 1986 2) 2016
3) 2009 4) 2015
2. దివ్యాంగుల హక్కుల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 2015 2) 2016
3) 2017 4) 2018
3. పోక్సో చట్టం -2012 దేనికి ఉద్దేశించినది?
1) పిల్లల మీద లైంగిక వేధింపులకు సంబంధించి
2) ప్రత్యేక అవసరాలున్న పిల్లల సౌకర్యాలు చూడటం కోసం
3) క్యాన్సర్ నివారించటం
4) పిల్లల్లోని ఆహార లోపం పర్యవేక్షించడం కోసం
4. బాల బాలికలకు ఉచిత, నిర్బంధ విద్యా చట్టం -2009 అనేది ఏ వయస్సు పిల్లల గ్రూపునకు వర్తిస్తుంది?
1) 0-18 సం.లు 2) 6-14 సం.లు
3) 6-18 సం.లు 4) 14-18 సం.లు
5. కింది వాటిలో ఏచట్టం 73వ రాజ్యాంగ సవరణను దేశంలో 5వ షెడ్యూల్ ఏరియాలకు విస్తరింపచేసింది?
1) గ్రామ న్యాయాలయాల చట్టం-2008
2) బొగ్గు గనుల (ప్రత్యేక విషయాలు) చట్టం-2015
3) పంచాయతీ(షెడ్యూల్డ్ ఏరియాలకు విస్తరణ) చట్టం-1966
4) అడవుల విస్తరణ నష్టపరిహార నిధి చట్టం -2016
6. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఎవరి విద్యా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది?
1) మతం, భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాలు
2) మహిళలు, బాలికలు
3) ఎస్సీ, ఎస్టీలు
4) ప్రత్యేక అవసరాలున్న పిల్లలు (Special Need Childrems)
7. ఎస్టీల సంక్షేమ పథకాల్లో ఈ-గవర్నెన్స్ మొదలు పెట్టిన కేంద్ర మంత్రి ఎవరు?
1) అర్జున్ ముండా
2) ప్రకాష్ జవదేకర్
3) రవి శంకర్ ప్రసాద్
4) ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
8. ఏదైనా రాష్ట్ర శాసన సభ విద్య అనే అంశంపై చట్టం చేస్తే దానిలోని కొన్ని నిబంధనలు ఆర్టీఐ యాక్ట్ -2009కి విరుద్ధంగా
ఉంటే ఏమవుతుంది?
1) రాష్ట్రం చేసిన చట్టం మొత్తం చెల్లకుండా పోతుంది. ఎందుకంటే పార్లమెంట్కు ఉమ్మడి జాబితాలోని అంశాల మీద చట్టం చేసే అధికారం ఉంటుంది.
2) రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కూడా అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి జాబితాలోని అంశం మీద రాష్ర్టానికి కూడా అధికారం ఉంటుంది.
3) రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని వ్యతిరేక అంశం ఒక్కటే చెల్లకుండా పోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి జాబితాలోని అంశాల మీద చట్టం చేసే అధికారం ఉండటం.
4) రెండు చట్టాలు అమల్లో ఉండి పార్లమెంట్ చేసిన చట్టం రాష్ట్రంలో అమల్లో ఉంది
9. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మీద స్థాపించిన జాతీయ మిషన్ అధిపతి ఎవరు?
1) ప్రధాన మంత్రి అధ్యక్షులుగాను, మానవ వనరుల శాఖ మంత్రి ఉపాధ్యక్షులుగాను ఉంటారు.
2) ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అధిపతిగా, మానవ వనరుల శాఖ మంత్రి ఉపాధ్యక్షులుగాను ఉంటారు
3) మానవ వనరుల శాఖ మంత్రి అధ్యక్షుడుగాపాఠశాల విద్య, అక్షరాస్యత డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉపాధ్యక్షులుగాను ఉంటారు
4) పైవాటిలో ఏవీకావు
10. కింది వాటిలో ఏది బాలల ఉచిత, నిర్బంధ విద్యాచట్టం 2009కి సంబంధించిన అంశం కానిది?
1) ఇప్పుడు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా చట్టం ప్రకారం అమలు చేయవలసిన
ఆవశ్యకత ఉంది
2) ఈ చట్టం 6-14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయమని రాష్ర్టాలను ఆదేశిస్తుంది
3) భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ను కొత్తగా చేర్చారు
డి) ఈ చట్టం 6 సం.రాలలోపు పిల్లల బాల్య సంరక్షణ విద్యను అందజేయాలని రాష్ర్టాలను ఆదేశిస్తుంది
సమాధానాలు
1-2 2-2 3-1 4-2
5-3 6-3 7-1 8-3
9-3 10-4
1. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనసూయ ఉయికేని ఏ రాష్ర్టానికి గవర్నర్గా నియమించారు?
1) మధ్యప్రదేశ్ 2) ఛత్తీస్గఢ్
3) బీహార్ 4) రాజస్థాన్
2. ఏ సంవత్సరంలో భారతీయ కాపీరైట్ చట్టం మొదటిసారి సవరించారు?
1) 1980 2) 1981
3) 1982 4) 1983
3. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కమ్యూనికేషన్స్ మాధ్యమంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడే, భావవ్యక్తీకరణ హక్కులను పరిరక్షిస్తుంది?
1) ఆర్టికల్ 19 2) ఆర్టికల్ 20
3) ఆర్టికల్ 21 4) ఆర్టికల్ 24
4. ప్రాథమిక హక్కుల తీర్మానం ఏ సమావేశంలో ఆమోదించారు?
1) భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశం
2) భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం
3) భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశం 4) పైవేవీకాదు
5. భారత యూనియన్ ‘కేంద్రీకృత, బలమైన సమాఖ్యగా ఎవరు అభివర్ణిస్తారు?
1) గ్రాన్ విల్లే ఆస్టిన్ 2) ఐవర్ జెన్నింగ్స్
3) మారిన్ జోన్స్ 4) బీఆర్ అంబేద్కర్
6. రాజ్యాంగ పరిషత్ మొదటి, చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?
1) 9 డిసెంబర్ 1946, 24 జనవరి 1950
2) 19 డిసెంబర్ 1946, 24 జనవరి 1950
3) 9 డిసెంబర్ 1946, 24 జనవరి 1951
4) 9 డిసెంబర్ 1947, 24 జనవరి 1951
7. నేషనల్ ఇ- గవర్నెన్స్ ప్రోగ్రాంలో భాగంగా కింది ఏ ప్రాజెక్ట్ను ఆవిష్కరించాడు?
1) ఇ-పంచాయత్ 2) ఇ- ప్రమాణ్
3) జీఐ క్లౌడ్ 4) శారాన్ష్
సమాధానాలు
1-2 2-4 3-1 4-1
5-2 6-1 7-1
1. 16వ లోక్సభ సమావేశ కాలంలో రద్దు చేసిన ఎన్ని వైద్య బిల్లులను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది?
1) 4 2) 5 3) 2 4) 3
2. లోక్సభ ప్రస్తుత స్పీకర్ ఎవరు?
1) నితిన్ గడ్కరి 2) ఓం బిర్లా
3) జితేంద్ర సింగ్ 4) వీరేంద్ర కుమార్
3. కేంద్రం నుంచి రాష్ర్టాలకు గ్రాంట్లరూపంలో లభించే వనరులకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
1) నీతి ఆయోగ్ సిఫారసు మేరకు రాష్ర్టాలకు చట్ట బద్ధమైన గ్రాంట్లు ఇవ్వబడ్డాయి
2) రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం చట్ట బద్ధ్దమైన గ్రాంట్ల కోసం నిబంధన నిర్దేశించింది
3) వివిధ రాష్ర్టాలకు మంజూరయ్యే గ్రాంట్ల విషయంలో తేడాలు ఉండవచ్చు పై వాటిలో సరైనవి ఏవి?
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
4. ప్రొటెం స్పీకర్గా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు?
1) వీరేంద్ర కుమార్ 2) జితేంద్ర సింగ్
3) అమిత్షా 4) నితిన్ గడ్కరి
5. 2019లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా కార్పొరేషన్లో ‘ఛలోయాప్ను ప్రారంభించారు?
1) అసోం 2) సిక్కిం
3) నాగాలాండ్ 4) మణిపూర్
6. భారతదేశంలో కాపీరైట్కు సంబంధించిన చట్టాన్ని సమర్థించడానికి, ఏకీకృతం చేయడానికి ప్రస్తుతం ఉన్న చట్టాన్ని
ఏమని పిలుస్తారు?
1) కాపీరైట్ యాక్ట్ -1914
2) కాపీరైట్ యాక్ట్-1957
3) కాపీరైట్ యాక్ట్ ఇన్ ఇండియా-1957
4) ఇండియన్ కాపీరైట్ యాక్ట్ -1957
7. భారతదేశంలో పరోక్ష ఎన్నిక విధానం ప్రారంభించిన సంవత్సరం?
1) 1861 2) 1892
3) 1909 4) 1919
8. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, బిశ్వభూషన్ హరిచంద్ను ఏ రాష్ర్టానికి గవర్నర్గా నియమించారు?
1) ఛత్తీస్గఢ్ 2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) హర్యానా
సమాధానాలు
1-3 2-2 3-1 4-1
5-1 6-2 7-2 8-2
RELATED ARTICLES
-
Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
-
Current Affairs | ఇటీవల భారత పౌరసత్వం పొందిన నటుడు ఎవరు?
-
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
-
Current Affairs | కరెంట్ అఫైర్స్
-
Current Affairs | ఏ సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి దక్కింది?
-
Current Affairs | ఆర్టికల్ 46 ఎవరి విద్యా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది?
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
IELTS Exam | Language Tests for Overseas Education