TET – Social Studies | భారతదేశంలో మొదట వ్యవసాయం చేసిన ప్రదేశం ఎక్కడుంది?
1. కింది వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది?
1. వంకర టింకర ఉండవచ్చు
2. దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు
3. రెండు రేఖలు ఖండించుకొంటాయి
4. భూ స్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది
2. ఒకే పొడవును కలిగిన రేఖలు?
1. భూమధ్య రేఖ, కర్కటరేఖ
2. భూమద్య రేఖ, గ్రీనిచ్ రేఖ
3. గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ
4. అంతర్జాతీయ దినరేఖ, కర్కటరేఖ
3. నదులు “డెల్టాలు” అనే భూ స్వరూపాలను ఎక్కడ ఏర్పరుస్తున్నాయి?
1. పర్వతాల్లో
2. మైదాన ప్రదేశంలో
3. ఉపనదులు కలిసే చోట
4. సముద్రంలో కలిసే ముందు
4. కృష్ణానదిపై విజయవాడ వద్ద బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీని నిర్మించారు?
1. 1852 2. 1853
3.1854 4. 1855
5. చౌటుప్పల్ ఏ జిల్లాల్లో ఉంది?
1. రంగారెడ్డి 2. యాదాద్రి
3. జగిత్యాల 4. మహబూబ్‌నగర్
6. భారతదేశంలో పగలు 12 గంటలు అయితే ఇంగ్లండ్‌లో ఎంత సయయం అవుతుంది?
1. ఉ॥ 5 1/2 2. ఉ॥ 6 1/2
3. సా॥ 5 1/2 4. సా॥ 6 1/2
7. లక్ష దీవులు ఏ విధంగా ఏర్పడ్డాయి?
1. ప్రవాళ భిత్తికల ద్వారా
2. అగ్ని పర్వత చర్యల ద్వారా
3. సంపీడన శక్తుల ద్వారా
4. అవక్షేప చర్యల ద్వారా
8. కింది వాటిలో సరైనది?
1. నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు
2. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు
3. వాతావరణంలో అదృశ్యమైన నీటి ఆవిరినే ఆర్ధ్రత అంటారు
4. పైవన్నీ
9. పోచంపల్లి చేనేత కార్మికుల గురించి సరికానిది?
1. యాదాద్రి జిల్లాలో కలదు
2. ఇక్కడ 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయి
3. ఇక్కడ చీరలకు పేటెంట్ హక్కు కలదు
4. ఇక్కత్ డిజైన్‌ను ఇక్కడ బాగా వాడుతారు
10. భారతదేశంలోని ప్రయాణికుల్లో ఎన్నో వంతు రైలులో ప్రయాణిస్తున్నారు?
1. 1/3 2. 1/4
3. 1/5 4. 2/5
11. “అక్టోబర్ వేడి” అనే ఉక్కపోతకాలం మన దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది?
1. వేసవికాలం 2. శీతాకాలం
3. నైరుతి రుత పవనకాలం
4. ఈశాన్య రుతుపవన కాలం
12. యూరప్ ఖండంలోని పవనాల గురించి సరికాని వాక్యం?
1. ఇక్కడ సముద్రాలు ఎప్పుడు నిశ్చలంగా ఉంటాయి
2. ఇక్కడ కవోష్ణ పర్వతాలు ఎక్కువగా ఉంటాయి
3. ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో డ్రిప్ట్ ప్రవాహాలు ఉంటాయి
4. ఐరోపా పశ్చిమ ప్రాంతంలో సంవత్సరమంతా చిరుజల్లులు కురుస్తాయి?
13. భారతదేశానికి పశ్చిమ భాగాన ఉండే పెద్ద ఎడారులు, దట్టమైన అడవులు అతి వెడల్పయిన నదులు, లెక్కలేనన్ని సరస్సులు, పచ్చికబయళ్లతో విస్తరించిన ఖండం ఏది?
1. ఆసియా 2. ఐరోపా
3. ఆఫ్రికా 4. ఆస్ట్రేలియా
14. యూరప్‌లో పారిశ్రామిక విప్లవ కాలం?
1. 1740-1840 2. 1750-1850
3. 1760-1860 4. 1770-1870
15. జాన్ లెడివన్ మిక్డయ్ కంకర రాళ్లతో రోడ్లను నిర్మించే పద్ధతిని కనుగొన్న సంవత్సరం?
1. 1830 2. 1840
3. 1850 4. 1860
16. అల్ ఇద్రిసి ఏ సంవత్సరంలో ప్రపంచ పటాలను తయారు చేశాడు?
1. 1151 2. 1152
3. 1153 4. 1154
17. అంటార్కిటికాలోని వోస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో నమోదైన ఉష్ణోగ్రత ఎంత?
1. -89.30 2.- 89.20
3. -5.20 4. -8.20
18. కాలాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి?
1. భూమి ఉపరితలం వంపుగా ఉండటం
2. భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం
3. 1, 2 4. ఏదీ కాదు
19. ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలో పెరిగే అడవులు?
1. సతత హరిత అరణ్యాలు
2. ఆకురాల్చు అడవులు
3.ముళ్ల జాతి అడవులు
4. చిత్తడి అడవులు
20. తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి?
1. 26,980 చ.కి.మీ
2. 26. 904 చ.కి.మీ
3. 26.890 చ.కి.మీ
4. 26.996 చ.కి.మీ
21. కింది వాటిలో ఏ ఖనిజం విద్యుత్తు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విస్తృతంగా వాడుతారు?
1. మైకా 2. సున్నపురాయి
3. గ్రానైట్ 4. మాంగనీస్
22. కింది ఏ ఆవరణంలో గాలి, నీరు, ప్రభావితం చెందుతాయి?
1. జలావరణం 2. శిలావరణం
3. వాతావరణం 4. జీవావరణం
23. మంచినీటిలో ఎంత శాతం అంటార్కిటికా సముద్రంలో శాశ్వత మంచుగా ఉంది?
1. 0.34% 2. 30.1%
3. 69.56% 4. 4.0%
24. 80 కి.మీ వరకు విస్తరించిన ఆవరణం?
1. స్ట్రాటో 2. మీసో
3. ట్రోపో 4. థర్మో
25. ఏ సంవత్సరం నాటికి హరిత గృహ వాయువుల ప్రభావాన్ని 5 శాతానికి తగ్గించాలని 1997లో UNO నిర్ణయించింది?
1. 2008-2012 2. 2009-2011
3. 2011-2018 4. 2012-2019
26. భారతదేశంలో మొదట వ్యవసాయం చేసిన ప్రదేశం ఎక్కడ ఉంది?
1. కశ్మీర్ 2. బెలుచిస్థాన్
3. బీహార్ 4. తెలంగాణ
27. మహా జనపదాలు ఏ కాలానికి చెందినవి?
1. 2500 సం॥ల క్రితం
2. 1500 సం॥ల క్రితం
3.1000 సం॥ల క్రితం
4. 800 సం॥ల క్రితం
28. భారతదేశంలో ఓడించిన రాజులనే రాజులుగా కొనసాగించే సంప్రదాయాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
1. గుప్తులు 2. మౌర్యులు
3. శాతవాహనులు 4. కుషాణులు
29. మోటుపల్లి అభయ శాసనం ఎవరు జారీ చేశారు?
1. రుద్రదేవుడు 2. గణపతిదేవుడు
3. రుద్రమదేవి 4. ప్రతాపరుద్రుడు
30. బహమనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన కాలం ఏది?
1. క్రీ.శ.1480-1520
2. క్రీ.శ.1500-1530
3. క్రీ.శ.1489-1520
4. క్రీ.శ.1490-1520
31. మల్కీభరాముడుగా పేరు గాంచిన వారు?
1. కులీకుతుబ్‌షా
2. ఇబ్రహీంకుతుబ్షా
3. మహ్మద్ కులీకుతుబ్‌షా
4. అబుల్ హసన్ తానీషా
32. దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంథిక భాష హోదా పొందింది?
1. ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2. అబుల్ హసన్ తానీషా
3. మహ్మద్ కులీ కుతుబ్‌షా
4. మహ్మద్ కుతుబ్‌షా
33. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొగల్ యువరాజులు?
1. జహంగీర్ 2. అక్బర్
3. షాజహాన్ 4. 1, 2
34. సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్య దివాన్‌గా పనిచేసిన కాలం?
1. 1843-1873 2. 1853-1883
3. 1863-1903 4. 1855-1895
35. తెలంగాణ అమరవీరుల స్థూపం హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది?
1. చార్మినార్ ఎదురుగా
2. ఉస్మానియా విశ్వవిద్యాలయం
3. అసెంబ్లీ హాలు ఎదురుగా
4. రవీంద్ర భారతి ఎదురుగా
36. మొహెంజోదారోలో బయల్పడిన మహాస్నాన ఘట్టం కొలతలు?
1. 8.8 మీ x 5 మీ॥
2. 9.8 మీ x 6 మీ॥
3. 10.8 x 6.4 మీ॥
4. 11.8 x 7 మీ॥
37. సొరంగాల పై కప్పులుగా గుమ్మటాల పై కప్పులు నిర్మించే విధానం?
1. ట్రాబిట్ 2. ఆర్కుయేట్
3. తాపీ పద్ధతి 4. పర్షియన్ పద్ధతి
38. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు?
1. కులీ కుతుబ్‌షా
2. సాలార్జంగ్ -1
3. సర్ వికార్ ఉల్ ఉమ్రా
4. రేమండ్ పీటర్
39. భ్రమరాంబికా సంవాదం రచయిత?
1. శనముల వెంకట సుబ్బయ్య శాస్త్రి
2. కడుకూట్ల పాపశాస్త్రి
3. పావురం రంగాచార్యులు
4. బహిరి గోపాలరావు
40. వీర శైవం బోధించిన అంశం?
1. స్త్రీల పట్ల వివక్ష చూపరాదు
2. విగ్రహారాధన వ్యతిరేకించాలి
3. అన్ని క్రతువులు వ్యతిరేకించాలి
4. కుల వ్యవస్థ పాటించాలి
41. 1857 తిరుగుబాటులో పీష్వా నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరు?
1. తాంతియా తోపే 2. కున్వర్సింగ్
3. లక్ష్మీబాయి 4. మంగళ్ పాండే
42. హైదరాబాద్ రాజ్యంలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది?
1. తుర్రెబాజ్‌ఖాన్ 2. పీర్ సాహెబ్
3. సాలార్జంగ్ 4. తాంతియా తోపే
43. జల్-జంగల్-జమీన్ ఎవరి నినాదం?
1. అల్లూరి సీతారామరాజు
2. బిర్సాముండా
3. కుమ్రం భీం 4. ఎవరూ కాదు
44. గాంధీజీ ఏ రోజును ప్రార్థనా గౌరవ భంగ దినంగా ప్రకటించారు?
1. 1905, అక్టోబర్ 16
2. 1919 ఏప్రిల్ 06
3. 1919 ఏప్రిల్ 13
4. 1919 అక్టోబర్ 16
45. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు?
1. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2. కొండా వెంకటప్పయ్య
3. పర్వతనేని వీరయ్య చౌదరి
4. ప్రగఢ కోటయ్య
46. ప్రత్యక్ష చర్యదినంగా ఏ రోజును ముస్లింలీగ్ ప్రకటించింది?
1. 1946 జూలై 06 2. 1946 ఆగస్టు 16
3. 1947, ఆగస్టు 15
4. 1945, జూలై 04
47. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగిన కేంద్ర శాసన సభ ఎన్నికల్లో ఎంత శాతం ప్రజలు ఓటు హక్కు కలిగి ఉన్నారు?
1. 1% 2. 5%
3. 10% 4. 13%
48. 1942లో గాంధీజీతో చర్చలు జరపడానికి ఇంగ్లండ్ నుంచి వచ్చిన మంత్రి?
1. స్టాఫర్డ్ క్రిప్స్ 2. వేవెల్
3. మౌంట్ బాటెన్ 4. అట్లీ
49. జపాన్ సహాయంతో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలని కృషి చేసిన వారు?
1. వల్లభాయ్ పటేల్ 2. భగత్‌సింగ్
3. గాంధీ 4. సుభాష్‌చంద్రబోస్
50. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
1. 1914 2. 1915
3. 1916 4. 1917
51. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎవరు స్థాపించారు?
1. కొమర్రాజు లక్ష్మణరావు
2. నాయిని వెంకట రంగారావు
3. రావిచెట్టు రంగారావు
4. పైవారందరూ
52. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, జహీరాబాద్ ప్రాంతం ఎటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు?
1. జీవనాధార వ్యవసాయం
2. సేంద్రియ వ్యవసాయం
3. జీవ వైవిధ్య వ్యవసాయం
4. ఆధునిక వ్యవసాయం
53. మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థ సైనిక దళం?
1. రెడ్‌షర్ట్స్ 2. రజాకార్లు
3. శాంతిసేన 4. నిజాంఫౌజ్
54. కింది రాతి కట్టడాలను వాటి ప్రాంతాలతో జతపరచండి.
1. రేగొండ ఎ. సిద్దిపేట
2. జూపల్లె బి. నల్లగొండ
3. కోకపేట సి. వికారాబాద్
4. దుర్గం డి. నాగర్‌కర్నూల్
1. 1-ఎ 2-బి 3-సి 4-డి
2. 1-డి 2-సి 3-బి 4-ఎ
3. 1-ఎ 2-బి 3-డి 4-సి
4. 1-డి 2-సి 3-ఎ 4-బి
55. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఎక్కడ బయల్పడ్డాయి?
1. నల్లగొండ 2. కరీంనగర్
3. ఆదిలాబాద్ 4. నాగర్‌కర్నూల్
56. గంగానదీ లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసిన చోళరాజు?
1. విజయాలయుడు
2. మొదటి రాజరాజు
3. రాజేంద్ర చోళుడు
4. కులోత్తుంగ చోళుడు
సమాధానాలు
1-3 2-3 3-4 4-2
5-2 6-2 7-1 8-4
9-4 10-3 11-4 12-1
13-3 14-2 15-2 16-4
17-2 18-3 19-1 20-2
21-1 22-2 23-3 24-2
25-1 26-2 27-1 28-1
29-2 30-3 31-2 32-3
33-4 34-2 35-3 36-4
37-2 38-3 39-2 40-4
41-1 42-1 43-3 44-2
45-1 46-2 47-1 48-1
49-4 50-2 51-4 52-4
53-2 54-1 55-4 56-3
ఎస్.కె. మస్తాన్
విషయనిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?