Biology | ఆకురాల్చే మొక్కలు పత్రాలను వేసవిలో రాల్చడానికి కారణం?
1. హరితరేణువుల్లో ఉండే ఏ వర్ణ ద్రవ్యం కాంతిని గ్రహించుకుంటుంది, వినియోగించుకుంటుంది?
1) కెరోటినాయిడ్లు 2) ఫైకోబిలిన్లు
3) ఫైకోసయనిన్ 4) పత్రహరితం
2. లైకోపిన్ అనే వర్ణ ద్రవ్యం కింది ఏ ఫలంలో ఉంటుంది?
1) మామిడి 2) బొప్పాయి
3) టమాటా 4) నారింజ
3. సైటోకైనిన్స్కు సంబంధించి సరైన వాక్యాలు ఏవి?
ఎ. కణ విభజనను ప్రేరేపిస్తుంది
బి. పుష్పాలను తాజాగా ఉంచుతుంది
సి. ఫలాల పక్వతకు తోడ్పడుతుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
4. కింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.
ఎ. పత్రాలు ఆకుపచ్చ కాంతిని శోషించక దాన్ని పరావర్తనం చేస్తాయి. కాబట్టి అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి
బి. అంతకు పూర్వం అడవులు ఉండే అంతరించిన ప్రాంతాల్లో అడవుల అభివృద్ధిని అటవీ వర్ధకం అంటారు?
సి. ఓజోన్ను హరించే పదార్థం కార్బన్ టెట్రా క్లోరైడ్
1) ఎ, సి సరైనవి. బి సరైనది కాదు
2) బి, సి సరైనవి. ఎ సరైనది కాదు
3) ఎ, బి, సి సరైనవి
4) ఎ సరైనది. బి, సి సరైనవి కాదు
5. మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం?
1) ఆకుపచ్చ కాంతిని పరివర్తింపజేస్తాయి
2) ఆకుపచ్చ కాంతిని పీల్చుకుంటాయి
3) ఆకుపచ్చ కాంతిని వక్రీభవింపజేస్తాయి
4) అల్ట్రావైలెట్ కాంతిని పీల్చుకుంటాయి
6. కిరణజన్య సంయోగక్రియలో కర్బన క్షయకరణాన్ని వివరించిన ఏ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ప్రదానం చేశారు?
1) జాన్సన్ 2) మెండల్
3) కాల్విన్ 4) వాట్సన్
7. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ రెండింట్లో పాల్గొనే ఎంజైమ్‌లు?
ఎ. ఆల్టేజ్
బి. ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్
సి. హెక్సోకైనేజ్
డి. మాలిక్ డీ హైడ్రోజినేజ్
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
8. సరైన కలయికలను కింది వాటి నుంచి ఎన్నుకోండి.
ఎ. ఆక్సిన్ – వేర్లు, కాండాల విభేదనం
బి. జిబ్బరెల్లిన్లు- పత్ర రంధ్రాలు తెరుచుకోవడం
సి. పత్రం ఆకారం- పత్రాల్లో వార్థక్యాన్ని ఆలస్యం చేయడం
డి. అబ్సిసిక్ ఆమ్లం- విత్తన సుప్తావస్థ
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
9. కిరణజన్య సంయోగక్రియలో నేరుగా ఏర్పడే ఆహార పదార్థాలు?
1) కొవ్వు పదార్థం 2) మాంసకృత్తులు
3) గ్లూకోజ్ 4) అమైనో ఆమ్లాలు
10. మొక్కల పత్రాల్లోని హరితరేణువుల్లో ఉండే వర్ణ ద్రవ్యాల ముఖ్యమైన విధి?
1) నీటిని గ్రహించడం
2) ఆక్సిజన్‌ను గ్రహించడం
3) కాంతిని గ్రహించడం
4) గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేయడం
11. కింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.
ఎ. పత్రాల్లో సంశ్లేషితమయ్యే కార్బోహైడ్రేట్లు మొక్క ఇతర భాగాలకు దారువు ద్వారా స్థానాంతరణం చెందుతాయి
బి. పునఃసంయోజక DNA ను కైమరిక్ DNA అని కూడా అంటారు
సి. ప్రణాళికాబద్ధంగా కణాలు చనిపోవడాన్ని అపోటోసిస్ అంటారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ 4) ఎ, బి, సి
12. ఫలాల అధ్యయన శాస్త్రం?
1) పామోలజీ 2) ఫిలాలజీ
3) పిసికల్చర్ 4) కాలోలజీ
13. నేలలోని నత్రజని స్థాపక జీవులు వేటికి చెందినవి?
1) మాస్ మొక్కలు
2) హరిత శైవలాలు
3) మృత్తికా శిలీంధ్రాలు
4) బ్యాక్టీరియా
14. కిరణజన్య సంయోగక్రియలో ఏ వాయువు క్షయకరణం చెంది చివరకు గ్లూకోజ్ ఏర్పడుతుంది?
1) కార్బన్ మోనాక్సైడ్
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) ఆక్సిజన్
4) కార్బన్ డై ఆక్సైడ్
15. కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరికానిది ఏది?
1) ఇది ఒక కాంతి రసాయన చర్య
2) ఇది హరిత రేణువులో జరుగుతుంది
3) దీనిలో ఆక్సిజన్ వెలువడుతుంది
4) ఇది ఒక విచ్ఛిన్న క్రియ
16. కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఆక్సీకరణకు దోహదపడే ప్రత్యేక హరిత వర్ణద్రవ్యాల సముదాయాన్ని ఏ విధంగా సూచిస్తారు?
1) PS-I(P700), PS-II(P680)
2) PS-I(P700), PS-II(P640)
3) PS-I(P680), PS-II(P640)
4) PS-I(P700), PS-II(P720)
17. కింది వాటిలో దేన్ని కణం పవర్ హౌస్ అని పిలుస్తారు?
1) హరితరేణువు 2) మైటోకాండ్రియా
3) గాల్జి దేహాలు 4) కేంద్రకం
18. కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఏవిధంగా ఉపయోగపడుతుంది?
1) నీటిని సంశ్లేషించడానికి
2) పత్రహరిత సంశ్లేషణకు
3) పిండి పదార్థాల తయారీకి
4) నీటి ఉత్పత్తికి
19. కిరణజన్య సంయోగక్రియ జరిగే సమయం?
1) రాత్రి పూట
2) రాత్రి, పగటి పూటలు
3) రాత్రి లేదా పగటి పూట
4) పగటి పూట
21. కింది వాటిలో కిరణ జన్య సంయోగక్రియలో మొక్క ఏ వాయువును తీసుకుంటుంది?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) నైట్రోజన్
22. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. ఫలం గురించి అధ్యయనం స్పెర్మాలజీ
బి. విత్తనాల గురించి అధ్యయనం గురించి తెలిపేది పోమాలజీ
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కాదు
23. కిరణజన్య సంయోగక్రియలో దేన్ని పీల్చుకోవడం క్లోరోఫిల్ పని?
1) నైట్రోజన్ 2) నీరు
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) సూర్యకాంతి
24. కింది వాటిని సరైనవి గుర్తించండి.
ఎ. కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక శక్తి గ్రాహక చర్య
బి. కాంతి దశ అనేది హరితరేణువులోని గ్రానాలో జరుగుతుంది
సి. నిష్కాంతి దశ అనేది హరితరేణువులోని స్ట్రోమాలో జరుగుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
25. కింది వాటిలో కాంతి రసాయన చర్యకు ఉదాహరణ?
1) కిరణజన్య సంయోగక్రియ
2) శ్వాసక్రియ
3) ప్రొటీన్ సంశ్లేషణ
4) ఎంజైమ్ సంశ్లేషణ
26. కిరణజన్య సంయోగక్రియ పద్ధతి జరిగే ప్రాంతం?
1) మొక్క మొత్తం 2) ఆకు
3) ఆకు కణజాలం 4) క్లోరోప్లాస్ట్
28. ప్రతిపాదన (ఎ): లిట్టోరల్, లిమ్నాటిక్ మండలాలు కాంతివంతంగా ఉంటాయి
కారణం (ఆర్): సరస్సులోని ఈ మండలాల్లో కిరణజన్య సంయోగక్రియ తక్కువగా జరుగుతుంది
1) ఎ, ఆర్ నిజం. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ నిజం. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ నిజం కానీ ఆర్ నిజం కాదు
4) ఎ నిజం కాదు ఆర్ నిజం
29. కిరణజన్య సంయోగక్రియ పూర్తిగా లోపించి సంవత్సరమంతా చల్లగా, చీకటిగా ఉండే లోతైన సముద్ర మండలం?
1) బెథియల్ మండలం
2) అబైసల్ మండలం
3) వేలాంచల మండలం
4) లిమ్నాటిక్ మండలం
30. ప్రతిపాదన(ఎ): తక్కువ గాఢత నుంచి అణువులు ఎక్కువ గాఢతకు వెళ్లడం ద్రవాభిసరణం
కారణం (ఆర్): వేర్లు నీటిని పీల్చుకునే ప్రక్రియ ద్రవాభిసరణను తెలుపుతుంది
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది 4) ఆర్ సరైనది
31. ఏ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరుగుతుంది?
1) అరుణ కాంతి 2) ఆకుపచ్చ కాంతి
3) నీలి కాంతి
4) పసుపుపచ్చ కాంతి
32. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది?
1) సుక్రోజ్ 2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్ 4) హెక్సోజ్
33. కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాంగం?
1) రైబోజోమ్ 2) మైటోకాండ్రియా
3) హరితరేణువు 4) కేంద్రకం
34. మొక్కల్లో జరిగే ఏ ప్రక్రియను తప్పనిసరైన చెడు అని పిలుస్తారు?
1) శ్వాసక్రియ
2) ప్రొటీన్ల సంశ్లేషణ
3) కిరణజన్య సంయోగక్రియ
4) బాష్పోత్సేకం
35. బాష్పోత్సేకం వల్ల మొక్కలకు జరిగే హాని?
1) నీటి కొరత ఏర్పడుతుంది
2) హార్మోన్లు తయారు కావు
3) మొక్క పెరగదు
4) పిండి పదార్థాలు ఏర్పడవు
36. మొక్కలు నీటిని నీటి ఆవిరి రూపంలో వాయుగత భాగాల నుంచి కోల్పోవడాన్ని ఏమంటారు?
1) బాష్పోత్సేకం 2) ద్రవోద్గమం
3) బిందుస్రావం 4) బాష్పస్రావం
37. మొక్కల్లో బాష్పోత్సేకం ఏ భాగాల ద్వారా ఎక్కువగా జరుగుతుంది?
1) కాండం 2) వేర్లు
3) పత్రాలు 4) ఫలాలు
38. ఆకురాల్చే మొక్కలు తమ పత్రాలను వేసవిలో రాల్చడానికి గల కారణం?
1) పుష్పాలను ఉత్పత్తి చేయడానికి
2) బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి
3) శ్వాసక్రియను నిలుపుకోవడానికి
4) కిరణజన్య సంయోగక్రియను పెంచుకోవడానికి
39. బాష్పోత్సేకం జరగడం వల్ల మొక్కకు కలిగే ఉపయోగం?
1) ఆహార పదార్థాలు తయారవుతాయి
2) శ్వాసక్రియ జరుగుతుంది
3) ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది
4) నీటిని నిలుపుకొంటుంది
40. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుంచి వెలువడుతుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) నీరు
3) గ్లూకోజ్ 4) పిండి పదార్థం
41. బాష్పోత్సేకం అత్యధికంగా ఎప్పుడు జరుగుతుంది?
1) ఎక్కువ ఆర్ధ్రతలో
2) తక్కువ ఉష్ణోగ్రతలో
3) తక్కువ గాలి వేగంలో
4) ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ధ్రతలో
42. ఎండాకాలంలో చెట్టు నీడకు వెళితే చల్లగా ఉంటుంది. దీనికి కారణమైన ప్రక్రియ ఏది?
1) ద్రవాభిసరణం 2) నిపానం
3) బాష్పోత్సేకం 4) బిందుస్రావం
43. క్లోరోఫిల్‌లో ఉండే మూలకం ఏది?
1) బెరీలియం 2) కాల్షియం
3) మెగ్నీషియం 4) స్ట్రాన్షియం
44. మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే?
1) ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి
2) ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి
3) ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి
4) అతినీలలోహిత కాంతిని శోషించవు
45. వేర్లు గ్రహించిన నీరు, ఖనిజ మూలకాలు వేటి ద్వారా పత్రాలకు రవాణా అవుతాయి?
1) దారువు 2) పోషక కణజాలం
3) చాలనీ నాళాలు 4) ఏదీ కాదు
46. పొడి విత్తనాలను నీటిలో ఉంచినప్పుడు ఉబ్బడానికి కారణమైన ప్రక్రియ ఏది?
1) శోషణ 2) విసరణ
3) నిపానం 4) అధిశోషణ
47. ఆకుపచ్చని మొక్కలు వేటిని తయారు చేస్తాయి?
1) చక్కెరలు, కొవ్వులు, ప్రొటీన్లు
2) చక్కెరలు
3) చక్కెరలు, పిండి పదార్థాలు
4) చక్కెరలు, కొవ్వులు
48. పచ్చళ్లు దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి (బ్యాక్టీరియా నశించడానికి) కారణమైన ప్రక్రియ?
1) కోశిక ద్రవ్య సంకోచం (బాహ్య ద్రవాబిసరణం)
2) విసరణ 3) నిపానం
4) బిందుస్రావం
49. టమాటా పండ్లకు కింది వాటిలో వేటి వల్ల రంగు వస్తుంది?
1) ఆంథోసయనిన్స్ 2) ప్లావనాల్స్
3) కెరోటినాయిడ్స్ 4) క్లోరోఫిల్స్
50. మొక్కల ఆరోగ్యమైన పెరుగుదలకు అవసరమైన నేల ఏది?
1) లోమ్ నేల 2) ఇసుక నేల
3) రేగడి నేల 4) బురద నేల
20. జతపరచండి.
ఎ. వేరు నుంచి కాండానికి నీటి ప్రసరణ 1. స్థానాంతరణ
బి. పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోవడం 2. ద్రవాభిసరణ
సి. పదార్థాల సమూహ ప్రవాహం 3. ద్రవోద్గమం
డి. అర్థ పారగమ్యత్వచం ద్వారా నీటి వ్యాపనం 4. బాష్పోత్సేకం
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-2, బి-3, సి-4, డి-1
సమాధానాలు
1.4 2. 3 3. 1 4.3
5.1 6. 3 7.1 8.2
9.3 10. 3 11.2 12.1
13.4 14.4 15.4 16.1
17.2 18.1 19.4 20.2
21.3 22.4 23.4 24.3
25.1 26.4 27.1 28.3
29.2 30.1 31.1 32.3
33.3 34.4 35.1 36.1
37.3 38.2 39.3 40.2
41.4 42.3 43.3 44.2
45.1 46.3 47.1 48.1
49.3 50.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు