Current Affairs | ఏ సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి దక్కింది?
1. బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం ఇచ్చే వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డ్ ఎవరికి దక్కింది? (3)
1) అజిత్ ధోవల్ 2) రాకేశ్ శర్మ
3) శాంతా థౌటం 4) ఎవరూ కాదు
వివరణ: తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శాంతా థౌటం ప్రతిష్ఠ్ఠాత్మక అవార్డును పొందారు. బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం అవార్డును రష్యాలోని మాస్కోలో అందుకున్నారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు బ్రిక్స్ సృజనాత్మక సదస్సును నిర్వహించారు. ఈ అవార్డుకు బ్రెజిల్ దేశంలోని సావో పౌలోలో మంత్రిగా విధులు నిర్వహిస్తున్న పాడులా నోవెస్, ఒమన్ దేశానికి చెందిన అండర్ సెక్రటరీ సైఫ్ అల్-హిదాబి పొటీ పడ్డారు. తెలంగాణకు చెందిన శాంతా థౌటంను అవార్డు వరించింది.
3. ఏషియన్-ఇండియా సమావేశం ఏ నగరంలో సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించారు? (3)
1) సెమరంగ్ 2) నామ్‌ఫెన్
3) జకర్తా 4) మనీలా
వివరణ: ఏషియన్-భారత్ సమావేశాన్ని ఇండోనేషియాలోని జకర్తాలో నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ సమావేశాల ఇతివృత్తం ‘వృద్ధికి కేంద్రం: ఏషియన్ ప్రభావం (ఏషియన్ మ్యాటర్స్: ఎపిసెంటర్ ఆఫ్ గ్రోత్). ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి కృషి జరగాలని భారత ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చారు. భారత్, ఏషియన్ దేశాల మధ్య వాణిజ్యం మరింతగా పెంపొందాలని ఆకాంక్షించారు.
4. రాయగడ శాలువా ఏ రాష్ర్టానికి చెందినది? (4)
1) జమ్మూకశ్మీర్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) ఒడిశా
వివరణ: చేతితో తయారు చేసే శాలువాలకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఒడిశాలోని రాయగడ జిల్లాలో వీటిని తయారు చేస్తారు. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్‌లో భాగం అయిన డోంగ్రియా కోండ్లు వీటిని తయారు చేస్తారు. వీరి కళకు గుర్తింపు లభించింది. అలాగే ఇదే రాష్ర్టానికి చెందిన కొరాపూట్ కలజీర బియ్యానికి కూడా భౌగోళిక గుర్తింపు దక్కింది. ప్రస్తుతం జీఐ ట్యాగ్ పొందిన రాయగడ శాలువాలను కప్డగండ అనే పేరుతో కూడా పిలుస్తారు.
5. భారత దేశపు తొలి సౌర నగరం ఏది? (1)
1) సాంచీ 2) ఇండోర్
3) ఈటానగర్ 4) గువాహటి
వివరణ: భారతదేశపు తొలి సౌరనగరం సాంచీ. దీన్ని సెప్టెంబర్ 6న ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఉంది. అతి త్వరలో ఈ నగరం శూన్య కర్బన ఉద్గారాల నగరంగా మారతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ రాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. అలాగే ప్రజలు కూడా చెట్లను పెంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని కోరారు. సాంచీ లో రైల్వేస్టేషన్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసుల్లో పూర్తిగా సౌర ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఏటా 13,747 కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో తొలి సౌర గ్రామం గుజరాత్‌లోని మొథేరా గ్రామం.
6. గుజరాత్ ప్రకటన దేనికి సంబంధించింది? (3)
1) కంప్యూటర్స్ 2) పరిశ్రమల వృద్ధి
3) సంప్రదాయ ఔషధాలు
4) కర్బన ఉద్గారాలు
వివరణ: సంప్రదాయ ఔషధాల ప్రపంచ సమావేశాన్ని ఇటీవల గుజరాత్లో నిర్వహించారు. సమావేశాల అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్ ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ ఔషధాలను వ్యాప్తి చేయాలని, అలాగే వీటిపై మరింత పరిశోధనలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. శాస్త్రీయత ఉన్న ఔషధాలనే ప్రజలు వినియోగించేలా అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. సంప్రదాయ ఔషధాల ప్రపంచ తొలి కేంద్రాన్ని గుజరాత్‌లోని జాం నగర్లో ఏర్పాటు చేశారు.
7. ప్రాజెక్ట్ నమన్ దేనికి సంబంధించింది? (2)
1) క్రీడాకారులు 2) సైనికులు
3) మహిళలు 4) ఎవరూ కాదు
వివరణ: ప్రాజెక్ట్ నమన్ అనేది భారత సైనికులకు సంబంధించింది. సైన్యంలో ఉంటూ, ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబసభ్యుల ఇబ్బందులకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ తరహా కేంద్రాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. తొలి కేంద్రం ఢిల్లీ కంటోన్మెంట్లో రానుంది. ఇది కామన్ సర్వీస్ సెంటర్‌లాగా కూడా పనిచేస్తుంది. స్పర్శ్ పోర్టల్ ద్వారా సేవలను అందిస్తుంది. పింఛను చెల్లింపుతో పాటు ఇతర అవసరాలను కూడా పరిశీలిస్తుంది. మాజీ సైనిక ఉద్యోగుల పింఛను పూర్తిగా ఈ పోర్టల్ ద్వారానే ఉండనుంది.
8. మాలవీయ మిషన్ దేనికి సంబంధించింది? (1)
1) విద్య 2) సుపరిపాలన
3) క్రీడలు 4) అంతరిక్ష పరిశోధన
వివరణ: ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిందే మాలవీయ మిషన్. దీన్ని కేంద్ర విద్యా శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన పథకం ఇది. దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సమగ్రంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో బోధిస్తున్న 15 లక్షల ఉపాధ్యాయులకు సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా పెంపొందించనున్నారు.
9. ఏ సంస్థ నవరత్న హోదా పొందింది? (3)
1) ఎలక్ట్రిక్ లిమిటెడ్
2) పవర్ కార్పొరేషన్
3) రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్
4) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
వివరణ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ సంస్థ నవరత్న హోదాను పొందింది. దీంతో ఆ సంస్థ స్వతంత్రంగా రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టుకొనే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ సంస్థకు మినీరత్న హోదా మాత్రమే ఉంది.
10. డ్రిస్ ఎల్ హదాని ఏ సంస్థకు సలహాదారుగా నియమితులయ్యారు? (1)
1) యూఎన్వోవోఎస్ఏ 2) డబ్ల్యూటీవో
3) డబ్ల్యూహెచ్‌వో 4) ఐపీసీసీ
వివరణ: మొరాకో దేశానికి చెందిన డ్రిస్ ఎల్ హదాని యూఎన్వోవోఎస్ఏ అనే సంస్థకు ముఖ్య సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. యూఎన్వోవోఎస్ఏ పూర్తి రూపం- యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ ఔటర్ అఫైర్స్. ఇది వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఈ సంస్థ వివిధ అంశాలను పరిశీలిస్తుంది.
11. ఈ ఏడాది మెగసెసె అవార్డును పొందిన వారిలో భారత వ్యక్తి ఎవరు? (4)
1) రాజేశ్ మల్హోత్ర 2) రక్షంద
3) లెమోస్ 4) రవి కన్నన్
వివరణ: ఆసియా నోబెల్‌గా పేర్కొనే రామన్ మెగసెసె అవార్డును ఈ ఏడాది నలుగురికి ప్రకటించారు. ఇందులో భారత్‌కు చెందిన రవి కన్నన్ కూడా ఉన్నారు. వైద్య రంగానికి చెందిన వ్యక్తి ఆయన. ప్రజలకు మేలు చేసే ఔషధాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆ దిశగా పరిశోధన సాగిస్తున్నారు. అలాగే ఈ ఏడాది అవార్డు పొందిన మరో ముగ్గురు
కొర్వి రక్షంద బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
యూజినో లెమోస్ తైమూర్-లెస్తె దేశానికి చెందిన వ్యక్తి. ప్రకృతికి సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు దాని మెరుగుకు కృషి చేస్తున్నారు. మిరియం కొరొనెల్ ఫెర్రర్ శాంతి స్థాపనలో అహింస వ్యూహాలను రచిస్తున్నారు.
12. జమిలి ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (3)
1) ప్రతిభా పాటిల్ 2) అమిత్ షా
3) రామ్‌నాథ్ కోవింద్
4) గులాంనబీ ఆజాద్
వివరణ: ఒక దేశం ఒక ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యులుగా హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధరీ, గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సంజయ్ కొఠారి ఉన్నారు. ఈ కమిటీ నుంచి అధిర్ రంజన్ చౌధరీ వైదొలిగారు. ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉండనున్నారు. కమిటీ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రను నియమించారు.
13. ఏ సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి దక్కింది? (1)
1) ఎన్సీఈఆర్టీ 2) ఎన్జీటీ
3) ఎన్బీటీ 4) సీబీఎస్ఈ
వివరణ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్‌కు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి దక్కింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన చేశారు. ఎన్సీఈఆర్టీ సంస్థను 1961లో ఏర్పాటు చేశారు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఇది ఏర్పాటయ్యింది. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. దీనికి ప్రస్తుతం దినేశ్ ప్రసాద్ సక్లాని నేతృత్వం వహిస్తున్నారు.
14. భారతదేశపు తొలి కృత్రిమ మేధ పాఠశాల ఏ రాష్ట్రంలో రానుంది? (2)
1) మహారాష్ట్ర 2) కేరళ
3) కర్ణాటక 4) ఒడిశా
వివరణ: భారతదేశపు తొలి కృత్రిమ మేధ పాఠశాల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ఇందులో బోధన ఉంటుంది. మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనాలసిస్ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ తరగతులుంటాయి. ప్రాథమిక అంశాల నుంచి ఇతర అంశాలను తరగతిని బట్టి పెంచుతూ వెళతారు.
2. 78వ యూఎన్జీఏ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? (2)
1) ఆర్తి హోల్లా మోయినీ 2) డెన్నిస్ ఫ్రాన్సిస్
3) ఆంటోనియో గుటెరస్ 4) షాహిద్
వివరణ: ఐక్యరాజ్య సమితి 78వ సమావేశాలకు డెన్నిస్ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినవారు. ఆ దేశం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే. సెప్టెంబర్‌లోనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే వేదికగా సర్వ ప్రతినిధి సభను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వివరించారు. ఆర్తి హోల్లా మోయినీ అనే మహిళ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. వియన్నా కేంద్రంగా పనిచేసే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ఔటర్ స్పేస్ అఫైర్స్‌కు నేతృత్వం వహించనున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతం సెక్రటరీ జనరల్‌గా పోర్చుగీస్‌కు చెందిన ఆంటోనియో గుటెరస్ ఉన్నారు. ఆయన పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి.
15. షణ్ముగరత్నం ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? (3)
1) కాంబోడియా 2) ఇండోనేషియా
3) సింగపూర్ 4) ఫిజీ
వివరణ: సింగపూర్‌కు కొత్త అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 70% ఓట్లు ఆయనకు మద్దతుగా వచ్చాయి. 2011 తర్వాత ఇంత మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి ఆయన. షణ్ముగరత్నం గతంలో సింగపూర్ దేశ ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. 2001లో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో ఆ దేశంలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు అధ్యక్షులుగా పనిచేశారు. వారు రామనాథన్, దేవన్ నాయర్.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?