TET- Child Development Pedagogy | సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన ఎవరితో జరుగుతుంది?
పేజీ II తరువాయి
90. విద్యార్థి ఒక శాస్త్రవేత్తలాగా భావించి సమస్యకు అతనే పరిష్కారం కనుగొనేలా చేసే బోధనా పద్ధతి?
1. సర్వే పద్ధతి 2. అన్వేషణా పద్ధతి
3. ప్రకల్పన పద్ధతి 4. కృత్యాధార పద్ధతి
91. భారం లేని చదువు దేని శీర్షిక?
1. కొఠారి కమిటీ నివేదిక
2. రామమూర్తి కమిటీ నివేదిక
3. యశ్పాల్ కమిటీ నివేదిక
4. కస్తూరి రంగన్ నివేదిక
92. RTE-2009 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస్ ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలి?
1. 1km 2. 2km
3. 3km 4. 4km
93. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-2005 ప్రాధాన్యత అంశం?
1. సిలబస్ పూర్తి చేయడం
2. కంఠస్తం చేయించటం
3. సమాచార బదిలీ 4. జ్ఞాన నిర్మాణం
94. సహకార అభ్యసనంలో?
1. విద్యార్థులు స్తబ్దంగా ఉంటారు
2. విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యం లేదు
3. జట్టు సభ్యులందరికీ ప్రాధాన్యం ఉంటుంది
4. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల ఆధారంగా బోధన ఉంటుంది
95. కింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది?
1. ప్రతిస్పందించటం 2. సంశ్లేషణ
3. విలువకట్టడం 4. గ్రహించటం
96. శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించే పిల్లలు?
1. సంపూర్ణ బుద్ధి మాంద్యులు
2. మిత బుద్ధిమాంద్యులు
3. స్వల్ప బుద్ధి మాంద్యులు
4. తీవ్ర బుద్ధి మాంద్యులు
97. ప్రతిభావంతులైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర?
1. డాక్టర్‌ను సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం
2. విద్యార్థిని తరగతి గదిలో దండించడం
3. తల్లిదండ్రులను అడిగి కారణం తెలుసుకోవడం
4. విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం
98. ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం?
1. బ్రూనర్ బోధనా సిద్ధాంతం
2. స్కిన్నర్ కార్యసాధక నిబంధనం
3. థారన్‌డైక్ యత్నదోష అభ్యసనం
4. వైగాట్స్కీ సిద్ధాంతం
99. బోధనా దశల్లో అసలైన ఆచరణాత్మక దశ అని దేన్ని అంటారు?
1. మూల్యాంకన దశ
2. పూర్వ చర్యా దశ
3. ప్రణాళిక అమలు చేసే దశ
4. బోధన అనంతర దశ
100. కింది వాటిలో విద్యార్థి కేంద్రిత పరిసరాలకి చెందిన అంశం?
1. ఉపాధ్యాయ నిర్ధారిత అభ్యసన లక్ష్యాలు
2. విద్యార్థుల అభ్యసనానికి ఉపాధ్యాయులు బాధ్యులు
3. విద్యార్థులతో జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం
4. పరీక్షలు జ్ఞాన రంగానికి పరిమితం అవ్వడం
101. NCF-2005 ప్రకారం 3, 4, 5 తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం?
1.వారానికి రెండు గంటలు
2. వారానికి 6 గంటలు
3. రోజుకు రెండు గంటలు
4. రోజుకు ఒక గంట
102. RTE-2009 ప్రకారం విద్యా ప్రణాళిక, మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ?
1. జాతీయ విద్యా పరిశోధన రక్షణ సంస్థ
2. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ
3. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ
4. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి
103. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం?
1. 10 శాతం 2. 20 శాతం
3. 30 శాతం 4. 40 శాతం
104. NCPCR ప్రస్తుత చైర్మన్ ఎవరు?
1. శృతి నారాయణ్ కక్కర్
2. ప్రియాంక కానుంగో
3. ప్రొ. శాంతాసిన్హా 4. ప్రొ.యశ్పాల్
105. నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యం?
1. బట్టీ పద్ధతులను ప్రోత్సహించటం
2. విద్యార్థుల ప్రగతి గురించి నిరంతర పరిపుష్టి
3. బోధనాభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయ కేంద్రంగా మార్చడం
4. బోధనను జ్ఞానాత్మక నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయడం
106. ప్రత్యేక సామర్థ్యాల వల్ల ఇతరులను తన వైపునకు తిప్పుకుని, అనుసరించేలా చేసే నాయకత్వం
1. సహభాగి నాయకత్వం
2. సంస్థాగత నాయకత్వం
3. నిపుణులు
4. ప్రభావితం చేసే నాయకత్వం
107. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొన్న అంశం?
1. ప్రేరణ 2. విశ్లేషణ
3. బోధనా క్రమం 4. అంతర్బుద్ధి చింతన
108. ముడిపదార్థం ఉపయోగించి కొత్త వస్తువులు తయారు చేయడం అనేది?
1. ప్రజ్ఞా ప్రకల్పన
2. నిర్మాణాత్మక ప్రకల్పన
3. వినియోగదారుని ప్రకల్పన
4. జీవితోపయోగ ప్రకల్పన
109. విషమ యోజనానికి కారణం కానిది?
1. పాఠ్య ప్రణాళిక 2. ఆత్మవిశ్వాసం
3. మానసిక అలజడి
4. కుటుంబ కలహాలు
110. అభ్యసన వైకల్యం కల వారి చికిత్సలో ‘VAKT ’ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందినది. ఇక్కడ ‘T’ అటే?
1. స్పర్శ సంబంధ
2. రుచికి సంబంధించిన
3. శ్రవణ సంబంధ
4. దృష్టి సంబంధమైన
111. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం సరికాని వాక్యం?
1. 14 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్య పొందే హక్కు విద్యార్థికి కలదు
2. పాఠశాలలో చేరడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి
3. ఇది 6-14 సంవత్సరాల విద్యార్థులకు సంబంధించినది
4. పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి
112. NCF-2005 ప్రకారం 3R సామర్థ్యాలు ఏర్పడే దశ ?
1. ప్రాథమిక దశ
2. పూర్వ ప్రాథమిక దశ
3. సెకండరీ దశ 4. మాధ్యమిక దశ
113. కింది వాటిలో కౌన్సిలింగ్ సాధనం కానిది?
1. పరిపృచ్ఛ
2. నిర్ధారణ మాపనులు
3. మనో వైజ్ఞానిక పరీక్షలు
4. మూర్తిమత్వ పరీక్షలు
114. అలెక్సియా అనేది?
1. పఠన సంబంధ వైకల్యం
2. గణిత సంబంధ వైకల్యం
3. రాత సంబంధ వైకల్యం
4. భాషణ సంబంధ వైకల్యం
115. సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన ఎవరితో జరుగుతుంది?
1. రెగ్యులర్+ సంచార ఉపాధ్యాయుడు
2. ప్రత్యేక శిక్షణ పొందిన రెగ్యులర్ ఉపాధ్యాయుడు
3. రెగ్యులర్ ఉపాధ్యాయుడు + శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు
4. రెగ్యులర్ + ప్రత్యేక శిక్షణ పొందిన రెగ్యులర్ ఉపాధ్యాయుడు
116. జీవనం ద్వారా, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఏ బోధనా పద్ధతి సూత్రం?
1. ప్రకల్పనా పద్ధతి 2. అన్వేషణ పద్ధతి
3. కృత్యాధార పద్ధతి
4. ప్రయోగశాల పద్ధతి
117. NCF-2005లో 2వ అధ్యాయం దేని గురించి చర్చిస్తుంది ?
1. మూల్యాంకనం
2. అభ్యసనం, జ్ఞానం
3. తరగతి గది వాతావరణం
4. విద్యా దృక్పథం
118. ప్రస్తుతం పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి నిర్వహిస్తున్న నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షల సంఖ్య?
1. 3 2. 2 3. 1 4. 4
119. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులు ఏ వర్గానికి చెందుతాయి?
1. జీవించే హక్కు 2. పాల్గొనే హక్కు
3. రక్షణ పొందే హక్కు
4. అభివృద్ధి చెందే హక్కు
120. తరగతి గదిలోని విద్యార్థులు అందరూ ఇష్టపడే నాయకత్వం?
1. ప్రజాస్వామ్య నాయకత్వం
2. సహభాగి నాయకత్వం
3. భాగస్వామ్య నాయకత్వం
4. అన్నీ సరైనవే
సమాధానాలు
90-2 91-3 92-3 93-4
94-3 95-2 96-4 97-3
98-1 99-3 100-3 101-1
102-3 103-2 104-2 105-2
106-4 107-2 108-2 109-2
110-1 111-1 112-1 113-4
114-1 115-3 116-2 117-2
118-4 119-4 120-2
1. జతపరచండి
1) చౌహానుల రాజధాని ఎ) భిమ్మల్, కనోజ్
2) గూర్జర ‘ప్రతీహారుల రాజధాని బి) శాకాంబరి
3) పరమారుల రాజధాని సి) అనైల్ పాటిక
4) సోలంకీల రాజధాని డి) థార్
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. హర్షుని మరణానంతరం ఉత్తరదేశాన్ని పాలించినదెవరు?
1) రాజపుత్రులు 2) యవనులు
3) హూణులు 4) పహల్వలు
3. అరబ్ యాత్రికుడు సులేమాన్ ఏ రాజు ఆస్థానాన్ని సందర్శించాడు?
1) 1వ నాగభట్టు 2) మిహిర భోజుడు
3) మహేంద్రపాల 4) ఎవరూ కాదు
4. కింది వాటిని జతపరచండి.
1) పద్మగుప్తుడు ఎ) యుక్తికల్పతరువు
2) భోజరాజు బి) నవ సాహసాంక చరిత్ర
3) హేమచంద్రుడు సి) స్మృతికల్పతరువు
4) లక్ష్మీధరుడు డి) పరిశిష్ట పర్వన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
5. ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్పహిందూ చక్రవర్తి అని ఎవరిని అంటారు?
1) సముద్రగుప్తుడు 2) హర్షవర్ధనుడు
3) రెండో చంద్రగుప్తుడు 4) యశోధర్ముడు
6. వజ్రాయాన బౌద్ధానికి ఎవరి నుంచి మద్దతు లభించింది?
1) పాలరాజులు 2) సేవరాజులు
3) గుప్తరాజులు 4) హర్షవర్ధనుడు
7. 1194లో మహమ్మద్ ఘోరి “చాంద్వార్ యుద్ధం”లో ఎవరిని హతమార్చాడు?
1) పృథ్వీరాజ్ చౌహాన్
2) జయచంద్రడు 3) భీమరాజు
4) జయసింహ సిద్దిరాజు
8. జతపరచండి.
1) కాలాచూరీలు (ఛేది) ఎ) ఖజరహో
2) చందేళులు బి) త్రిపురి
3) గహద్వాలులు సి) జోధ్‌పూర్
4) రాథోడ్‌లు డి) కనోజ్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
9. మౌంట్ అబూలోని ప్రసిద్ధ దిల్వారా ఆలయాన్ని ఏ రాజు కాలంలో విమల సైన్యాధిపతి నిర్మించాడు?
1) 1-భీమరాజు 2) 2-భీమరాజు
3) మూలరాజు-1 4) మూలరాజు-2
10. ఉత్తర భారతదేశంలో అరబ్బులకు వ్యతిరేకంగా దృఢంగా నిలిచింది ఎవరు?
1) చౌహానులు 2) సోలంకీలు
3) ప్రతీహారులు 4) పాల, సేనవంశాలు
11. జతపరచండి.
1) చాంద్ బర్దాయ్ ఎ) కావ్యమీమాంస
2) రాజశేఖరుడు బి) పృథ్వీరాజ్ రాసో
3) భోగరాజు సి) ప్రబంధ చింతామణి
4) మెరటుంగా డి) చంపూరామాయణం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
12. ‘హరికేళి’ అనే నాటకాన్ని రచించింది ఎవరు?
1) విశాలదేవుడు 2) దేవరాజు
3) వత్సరాజు 4) భోజరాజు
13. అజ్మీర్ పట్టణ నిర్మాణాన్ని చేపట్టినది ఎవరు?
1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) విశాలదేవుడు
3) అజయరాజు 4) ఎవరూ కాదు
14. కింది వాటిని జతపరచండి.
1) శ్రీహర్షుడు ఎ) గీత గోవిందం
2) జయదేవువు బి) నైషధ చరిత్ర
3) బిల్హణుడు సి) చౌరపంచశిఖ
4) భోజరాజు డి) సరస్వతి
కంఠాభరణ, తత్వప్రకాశ
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
15. బెంగాల్‌ను పాలించిన రాజవంశాలు ఏవి?
1) కర్కోటక, ఉత్పల, లోహర వంశాలు
2) బ్రాహ్మణ, షాహీలు
3) పల్లవులు, చోళులు
4) పాల, సేనవంశాలు
16. గూర్జర ప్రతీహారుల రాజైన మహేంద్రపాల (మహిపాలుడు) ఆస్థానంలోని రాజశేఖరుడు రచించిన పుస్తకం ఏది?
1) కర్పూర మంజరి
2) బాల రామాయణం, బాల భారతం
3) విద్యాశాల భంజిక 4) పైవన్నీ
17. ధర్మపాలుడు అనుసరించిన మతం ఏది?
1) జైనమతం 2) బౌద్ధమతం
3) శైవమతం 4) వైష్ణవమతం
18. జతపరచండి.
1) కల్పణుడు ఎ) రాజతరంగిణి
2) సంద్యాకరనందిని బి) రామపాల చరిత్ర
3) ఆనందవర్ధనుడు సి) ధ్వన్యాలోకం
4) బిల్హణుడు డి) విక్రమాంకదేవ చరిత్ర
1) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సమాధానాలు
1-2 2-1 3-2 4-3
5-4 6-1 7-2 8-2
9-1 10-3 11-3 12-1
13-3 14-1 15-4 16-4
17-2 18-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?