Current Affairs | జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్
1. 53వ WEF వార్షిక శిఖరాగ్ర సదస్సు 2023 థీమ్?
1) విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం
2) ప్రపంచ గతిని మార్చే గమనం
3) ఉగ్రవాద రహిత సమాజ స్థాపన
4) కొవిడ్-19పై ప్రపంచ ఉమ్మడి పోరాటం
2. అంధుల టీ20 టోర్నీకి సంబంధించి సరైన జతను గుర్తించండి.
1) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్-మహ్మద్ రషీద్
2) మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ (బి2 కేటగిరి)- అజయ్‌కుమార్ రెడ్డి
3) మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ (బి1 కేటగిరి)- సునీల్ రమేష్
4) అంధుల టీ20 ప్రపంచకప్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్-గౌతమ్ గంభీర్
3. పోల్రైట్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ 2021-22 ఏడాదికి సంబంధించి ఎలక్టోరల్ ట్రస్టు విరాళాలను జతపరచండి.
1. BJP-ఎ. రూ.18.44కోట్లు
2. TRS- బి. రూ.21.12 కోట్లు
3. AAP- సి. రూ.351.50 కోట్లు
4. INC-డి. రూ.40 కోట్లు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4. గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి కింది వాటిని గుర్తించండి.
ఎ. ఇండియాలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ హెచ్2 మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్రం ఇందుకోసం 2023కి సంబంధించి రూ.19,744 కోట్లు కేటాయించింది.
బి. 2030 నాటికి ఏడాదికి 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హెచ్2 ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.
సి. గ్రీన్ హెచ్2 పథకం కింద తొలుత ఎలక్ట్రోలైజర్ తయారీదారులకు 10 ఏళ్ల వరకు ప్రోత్సాహకాలు అందించనున్నారు
డి. గ్రీన్ హెచ్2 మిషన్‌ను నడిపించడానికి పునరుత్పాదక ఇంధన శాఖలో మిషన్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయనున్నారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి 4) ఎ, బి, డి
5. కింది వాటిలో సరికానిది ఏది?
1) దేశంలో తొలి గ్రీన్ స్టీల్ బ్రాండ్‌గా కల్యాణి ఫెరెస్టా నిలిచింది
2) పొడవాటి తోకతో ఉండే గాట్‌విట్ అనే పక్షి 13,000 కి.మీ. 11 రోజుల పాటు ప్రయాణించి సరికొత్త రికార్డుతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది
3) పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే పసిఫిక్ ఓషన్డైపోల్ అనే పోకడ గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెలుగులోకి తెచ్చారు
4) దక్షిణ మధ్య అమెరికాలో ఎక్కువగా కనిపించే గాజు కప్పు పారదర్శకత గుట్టును అమెరికా శాస్త్రవేత్తలు తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు
6. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. భారత్ ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు 2023 జనవరి 12, 13 తేదీల్లో వర్చువల్ విధానంలో జరిగింది
బి. ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్నారు
సి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాలను గ్లోబల్ సౌత్‌గా వ్యవహరిస్తారు
డి. 2023 ఏడాది జీ20 సదస్సు భారత్ అధ్యక్షత వహిస్తున్నందున గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించడమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు
1) ఎ, బి, సి 2) ఎ, డి
3) ఎ, బి 4) ఎ, బి, డి
7. కిందివాటిలో సరికాని వాక్యమేది?
ఎ. భారత్‌లో మొత్తం 4235 అసెంబ్లీ స్థానాలుంటే ఎమ్మెల్యేల్లో కేవలం 11 శాతమే మహిళలున్నారు
బి. దేశంలో 15-24 ఏళ్ల వయస్సు వారిలో అత్యధికంగా కేరళలో 99 శాతం వంతు యువతీయువకులు అక్షరాస్యతను సాధించారు
సి. కేంద్ర మంత్రుల్లో మహిళలు 1995లో 11.54% ఉండగా 2020 నాటికి ఆ సంఖ్య 9.26% తగ్గింది
డి. జాతీయ స్థాయిలో 2017 నాటికి అక్షరాస్యత మహిళల్లో 80.3% కాగా పురుషుల్లో 85.7%
1) ఎ 2) బి, సి
3) డి 4) పైవన్నీ
8. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. దేశంలో అంధత్వ నియంత్రణ కోసం ఒక నూతన విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది
బి. దేశంలో అర్హత కలిగి ఉన్న ఖాతాల్లో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది
సి. ప్రపంచంలోనే మొదటి తాళపత్ర మాన్యుస్క్రిప్ట్ మ్యూజియం కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించారు
డి. భీమా కోరెగావ్ యుద్ధానికి 205 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జనవరి 1న పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు
1) ఎ 2) ఎ, బి
3) సి 4) డి
9. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ.హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీ లో నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్‌ని ఏర్పాటు చేశారు
బి. దీన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డిసెంబర్ 17న ప్రారంభించారు
సి. స్వచ్ఛ సర్వేక్షణ్ 3 స్టార్ రేటింగ్ కేటగిరీలో తొలి స్థానం సిద్దిపేటకు దక్కగా రెండో స్థానంలో జగిత్యాల నిలిచింది
1) ఎ, బి 2) బి, సి
3) అన్ని 4) ఎ, సి
10. కింది వాటిలో సరికాని వాక్యం?
ఎ. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఒక్కోదానికి రూ.1,962 చొప్పున ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేస్తుంది
బి. ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించటం ఈ కిట్ల లక్ష్యం
సి. గర్భిణికి 12-25 వారాల మధ్య జరిగే చెకప్‌లో ఒకసారి, 26-32 వారాల మధ్య జరిగే రెండో చెకప్‌లో ఇంకోసారి ఇస్తారు
డి. ఈ కిట్‌లో అరకిలో నెయ్యి, కిలో ఖర్జుర, రెండు హార్లిక్స్ బాటిళ్లు ఇతర పోషక పదార్థాలు ఉన్నాయి
1) అన్ని 2) ఎ, బి
3) సి 4) డి
11. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ప్రతిష్టాత్మక యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్‌కు ఎంపికైన భారతీయ బయాలజీ నిపుణురాలు మహిమా స్వామి
బి. నాసాకు చీఫ్ టెక్నాలజిస్టుగా భారత సంతతికి చెందిన ఏరోస్పేస్ నిపుణుడు ఎ.సి.చారణియ నియమితులయ్యారు
సి. ఐఏఎఫ్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ పంకజ్ అద్వాని నియమితులయ్యారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) పైవన్నీ
12. కింది వాటిలో సరికాని వాక్యమేది?
ఎ. భూసార పరీక్షలు చేసే రైతులకు ఇచ్చిన భూసార ఫలితాల కార్డులు 2019-20లో ఏపీలో 2.26 లక్షలు ఉంటే తెలంగాణలో 1.20 లక్షలు ఉన్నాయి
బి. వ్యవసాయ గణాంకాలు 2021 నివేదిక ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్య కాలంలో 17 రాష్ర్టాలకు 187.85 M$ విదేశీ పెట్టుబడులు వచ్చాయి
సి. దేశవ్యాప్తంగా అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాల్లో ఏపీ వాటా 6.3%
డి. ఆహార ధాన్యాలపై కేంద్రం ఇస్తున్న రాయితీ 2021-22లో రూ.1,94,100 కోట్లుగా ఉంది
1) ఎ 2) ఎ, బి 3) బి 4) డి
13. ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న సమీద్శిఖర్జి ప్రార్థనా మందిరం గురించి సరికానిది ఏది?
ఎ. ఇది జార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలోని పార్శనాథ్ హిల్స్ వద్ద ఉంది
బి. ఇది జైనుల పవిత్ర మందిరం
సి. 2019 ఆగస్టులో పార్శనాథ్ కొండను పర్యావరణ సున్నిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది
డి. ఇది బౌద్ధమతస్థుల ప్రార్థనా పర్యాటక ప్రాంతం
1) అన్ని సరైనవే 2) ఎ, బి
3) సి 4) డి
14. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. 2023, జనవరి 1 నాటికి డీఆర్డీవోని స్థాపించి 65 సంవత్సరాలు పూర్తయింది
బి. డీఆర్డీవో ప్రస్తుత చైర్మన్ సమీద్ వి. కామత్
సి. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి పేరు గిరిధర్ అరమానే
డి. SIPRI నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతి దారు- ఇండియా
ఇ. ప్రస్తుత సీడీఎస్ పేరు – అనీల్ చౌహాన్
1) అన్ని 2) ఎ, బి
3) బి, సి 4) డి, ఇ
15. సరైన వాక్యమేది?
ఎ. దేశంలో మొదటి జాతీయ బాలికల దినోత్సవాన్ని 2009లో ప్రారంభించారు
బి. 2023 నినాదం: డిజిటల్ జనరేషన్-మన జనరేషన్
సి. జాతీయ బాలబాలికల కమిషన్ చైర్మన్- ప్రియాంకా కాంగో
డి. దేశంలో శిశుమరణాల రేటు అధికంగా ఉండే రాష్ట్రం- అసోం
1) ఎ 2) ఎ, బి 3) సి 4) అన్ని
16. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. దేశంలో మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011లో ప్రారంభించారు
బి. ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్- రాజీవ్‌కుమార్
సి. 2023లో దేశంలో మొత్తం 10 రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి
డి. ఇప్పటివరకు దేశంలో 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి
1) అన్ని 2) సి
3) సి, డి 4) బి
17. కింది వాటిలో సరికాని వాక్యం?
ఎ. దేశంలో మొదటి జాతీయ యువజన దినోత్సవాన్ని 1985లో ప్రారంభించారు
బి. 2023 నినాదం VIKSIT YUVA VIKSIT BHARATH
సి. ప్రపంచంలో యువ జనాభా తగ్గుతున్న దేశం – జపాన్
డి. దేశంలో జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం- సిక్కిం
1) అన్ని సరైనవే 2) ఎ 3) డి 4) బి, సి
18. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. దేశంలో మొదటి NRI డేని 2003లో ప్రారంభించారు
బి. గాంధీజీ 1915, జనవరి 9న ఇండియాకు తిరిగి వచ్చారు
సి. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభ ప్రదేశం పేరు కాంతి మైదాన్ (ముంబై)
డి. ప్రపంచంలో ప్రవాసులు అధికంగా ఉండే దేశం ఇండియా
ఇ. ప్రపంచంలో భారత్ తర్వాత ప్రవాస భారతీయులు అధికంగా ఉండే దేశాలు మెక్సికో, రష్యా
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) అన్ని
19. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. మొదటి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 1975లో ప్రారంభించారు (జనవరి 10)
బి. 2023లో ప్రపంచ హిందీ సదస్సు ఫిజీలో జరిగింది
సి. ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాష-మాండరిన్ (చైనా)
డి. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో మొత్తం అధికార భాషల సంఖ్య- 22
ఇ. ప్రపంచంలో మాండరిన్ తర్వాత అధికంగా మాట్లాడే భాష -హిందీ
1) ఇ 2) డి, ఇ 3) ఎ 4) బి
20. సరైన వాక్యమేది?
ఎ. ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవాన్ని జనవరి 29న నిర్వహిస్తారు
బి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని మే 3న నిర్వహిస్తారు
సి. 2022 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దేశాల సూచీలో భారత్ ర్యాంకు-150 (180 దేశాల్లో)
డి. PIB ప్రస్తుత చైర్మన్‌గా సత్యేంద్ర ప్రకాశ్, PCI ప్రస్తుత చైర్మన్‌గా రంజన్ ప్రకాశ్ దేశాయ్ ఉన్నారు
1) అన్నీ సరైనవే 2) ఎ
3) బి 4) సి, డి
21. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. ప్రపంచ అవినీతి సూచీలో భారత్ ర్యాంకు-85
బి. ప్రపంచ ఆకలి దేశాల సూచీలో భారత్ ర్యాంకు-107
సి. ప్రపంచ లింగ సమానత్వ దేశాల సూచీలో భారత్ ర్యాంకు-135
డి. ప్రపంచ సంతోషకరమైన దేశాల సూచీలో భారత్ ర్యాంకు-126
1) అన్ని సరైనవే 2) ఎ
3) బి 4) సి, డి
22. సరికాని వాక్యాన్ని గుర్తించడి.
ఎ. ఏ దేశంలో బాంబ్ సైక్లోన్ సంభవించింది-అమెరికా
బి. అమెరికాలోని 13 రాష్ర్టాలు ప్రభావితమయ్యాయి
సి. ఈ తుఫాను వల్ల అమెరికాలోని 25 కోట్ల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు
డి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రస్తుత సెక్రటరీ జనరల్ – పెట్టేరి థాలస్
ఇ. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్‌కి అధికంగా కారణమయ్యే దేశాల్లో భారత్ ఐదో ర్యాంకులో నిలిచింది
1) ఎ, బి 2) డి, ఇ
3) అన్ని సరైనవే 4) బి, సి
23. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమబెంగాల్లో సిద్ధమవుతుంది
బి. కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ.120 కోట్లోతో హుగ్లీనది దిగువన నిర్మిస్తున్నారు
సి. ఈ సొరంగ మార్గం పొడవు 520 మీ.
డి. ఈ సొరంగ మార్గం నదీ గర్భానికి 13 మీ. దిగువన, భూ మట్టానికి 33 మీ. దిగువన ఉంటుంది. ఈ నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు
1) అన్ని సరైనవే 2) ఎ
3) డి 4) బి, సి
24. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఇటీవల భారత రాష్ట్రపతి రాజ్యాంగ పార్క్‌ను జైపూర్‌లో ప్రారంభించారు
బి. ఈ పార్కును రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించారు
సి. భారత రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26న నిర్వహిస్తారు
డి. ఏ రాష్ట్రంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం తయారవుతుంది-మధ్యప్రదేశ్
ఇ. ప్రపంచంలో అతి పురాతన రాజ్యాంగం కలిగిన దేశం-అమెరికా
1) అన్ని సరైనవే 2) డి, ఇ
3) ఎ, బి, సి, ఇ 4) బి, సి
సమాధానాలు
1. 1 2. 2 3. 2 4. 4
5. 3 6. 4 7. 3 8. 1
9. 3 10. 3 11. 1 12. 1
13. 4 14. 1 15. 4 16. 2
17. 1 18. 4 19. 1 20. 1
21. 1 22. 3 23. 1 24. 3
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ
ఏమర్స్ విల్
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?