Telangana Socio Economic Outlook | దేశంలో మొదటి ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం-2023
1. కింది వాటిలో సరికాని అంశాల్ని గుర్తించండి?
ఎ. 2014-15 నుంచి 2022-23 జనవరి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా 22,110 యూనిట్లకు అనుమతులు మంజూరు చేసింది
బి. 2014-15 నుంచి 2022-23 జనవరి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా ఆమోదం పొందిన యూనిట్ల మొత్తం పెట్టుబడి విలువ 2,53,575 కోట్లుగా నమోదైంది
సి. తెలంగాణలో టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 17.26 లక్షల మందికి ఉపాధి లభించింది
డి. తెలంగాణలో టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి నేటి వరకు 96 శాతం ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా, 4 శాతం భారీ, మెగా పరిశ్రమలు ఉన్నాయి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఏదీకాదు
2. కింది వాటిలో సరైనవి.
ఎ. 2015 నుంచి 2023 జనవరి మధ్య కాలంలో టీఎస్ ఐపాస్ ద్వారా అత్యధిక అనుమతులు పొందిన జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
బి. 2015 నుంచి 2023 జనవరి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా అత్యధిక పెట్టుబడులు పొందిన జిల్లాలుగా రంగారెడ్డి, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం నమోదయ్యాయి
సి. 2015 నుంచి 2023 జనవరి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా ఉపాధి కల్పనలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా రంగారెడ్డి
డి. టీఎస్ ఐపాస్‌ను 2016 నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు నిర్వహిస్తున్నారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
3. 2015 నుంచి 2023 జనవరి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా ఆమోదం పొందిన పరిశ్రమల్లో ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన ఉత్పత్తి రంగం ఏది?
1) ఐటీ 2) ఫార్మా
3) ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తి
4) సిమెంట్, సిమెంట్ ఉత్పత్తులు
4. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) స్కైరూట్ ఏరోస్పేస్
2) స్కైవే ఏరోస్పేస్
3) స్కైవే 4) ప్రారంభ్
5. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ దేశంతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకుంది?
1) జపాన్ 2) థాయిలాండ్
3) తైవాన్ 4) సింగపూర్
6. తెలంగాణ నుంచి యూనికార్న్ క్లబ్లో చేరిన మొదటి స్టార్టప్?
1) ప్రారంభ్ 2) స్పీసెస్ బాక్స్
3) డార్విన్ బాక్స్ 4) బైజూస్
7. 2023 తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలోని అత్యధిక ఉపాధి అందించే ఉప విభాగం?
ఎ. నిర్మాణం బి. ఉత్పత్తి
సి. విద్యుత్ డి. మైనింగ్ క్వారీయింగ్
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి 4) ఎ, డి
8. కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ. టీ-ఐడియా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు
బి. టీ-ప్రైడ్ అనేది ఎస్సీ, ఎస్టీ మహిళలు, ప్రత్యేక సామర్థ్యం కలిగిన వ్యక్తుల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది
సి. టీ-ఐడియా ప్రారంభించిన నాటి నుంచి 2023 జనవరి వరకు దాదాపు 3457 కోట్ల క్లెయిమ్స్ మంజూరు చేసింది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
9. 2014-15 నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ఉప రంగాలకు సంబంధించి నామమాత్రపు సీఏజీఆర్ వృద్ధిలో ఏ ఉప రంగం జాతీయ సగటు కంటే తక్కువ అభివృద్ధిని నమోదు చేసింది?
ఎ. తయారీ
బి. మైనింగ్, క్వారీయింగ్
సి. నిర్మాణం
డి. విద్యుత్, ఇతర సేవలు
1) బి, సి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి
10. టీఎస్ ఐపాస్ 2023 ఆధారంగా కింది ఏ సంవత్సరంలో అత్యధిక అప్రూవల్స్ ఇవ్వబడినవి?
1) 2021-22 2) 2020-21
3) 2019-20 4) 2017-18
11. కింది వాటిలో సరికానివి గుర్తించండి.
ఎ. రాష్ట్ర అభివృద్ధి వ్యయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగించడం ద్వారా ఆ రాష్ట్ర తలసరి అభివృద్ధి వ్యయాన్ని పొందవచ్చు
బి. 2018-21 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర తలసరి అభివృద్ధి వ్యయం అత్యధికంగా 26,897గా నమోదైంది
సి. జాతీయ సగటు తలసరి అభివృద్ధి వ్యయం 20,233గా నమోదైంది
డి. తలసరి అభివృద్ధి వ్యయం దేశంలో అత్యధికంగా కలిగి ఉన్న రాష్ట్రం గోవా రూ.59,770
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఏదీకాదు
12. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఎ. 2018-21 గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం జాతీయ రెవెన్యూ వ్యయం కంటే ఎక్కువగా నమోదైంది
బి. జాతీయ సగటు మూలధన వ్యయం వాటాతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర మూలధన వ్యయం వాటా తక్కువగా నమోదైంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
13. కింది వాటిలో ఏ అంశాలు నిశ్చయ వ్యయం (కమిటెడ్ ఎక్స్పెండిచర్)లోకి వస్తాయి?
ఎ. జీతాలు బి. వేతనాలు
సి. పెన్షన్లు డి. వడ్డీ చెల్లింపులు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, డి
14. రెవెన్యూ వసూళ్లలో అత్యధిక నిశ్చయ వ్యయం కేటాయిస్తున్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) కేరళ
3) బీహార్ 4) పంజాబ్
15. కింది వాటిని పరిశీలిచండి.
ఎ. 2018-21 మధ్య కాలానికి రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ రాష్ట్ర నిశ్చయ వ్యయం జాతీయ సగటు నిశ్చయ వ్యయం కంటే ఎక్కువ
బి. నిశ్చయ వ్యయం అత్యల్పంగా వనరులు కేటాయిస్తున్న రాష్ట్రం బీహార్
సి. తలసరి అభివృద్ధి వ్యయంలో అత్యల్పంగా నమోదైన రాష్ట్రం బీహార్ పై వాటిలో సరైనవి?
1) రెండు 2) మూడు
3) ఒకటి 4) పైవన్నీ
16. 2015 నుంచి 2023 జనవరి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా ఆమోదం పొందిన పరిశ్రమల్లో అత్యధిక ఉపాధి కల్పించిన రంగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. రియల్ ఎస్టేట్, ఐటీ భవనాలు
బి. ఇంజినీరింగ్ సి. టెక్స్టైల్
డి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇ. ఫార్మా
1) ఎ, బి, డి, సి, ఇ
2) ఎ, ఇ, బి, డి, సి
3) ఇ, డి, సి, బి, ఎ
4) ఎ, సి, ఇ, డి, బి
17. కింది వాటిలో ఎన్ని అంశాలు సరికానివి?
ఎ. టీఎస్ ఐపాస్ ప్రకారం 2015 నుంచి 2023 జనవరి మధ్య కాలంలో 19,139 ఎంఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభించబడ్డాయి. 3.53 లక్షల మందికి ఉపాధి కల్పించారు
బి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎంఎస్ఎంఈలు కేంద్రీకృతమై ఉన్నాయి
సి. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన కొత్త యూనిట్లలో 95 శాతం రూ.5 కోట్ల కంటే టర్నోవర్ కలిగినవి, రూ.కోటి కంటే తక్కువ పెట్టుబడి కలిగిన మైక్రో యూనిట్స్ ఉన్నాయి
1) ఒకటి 2) రెండు
3) మూడు 4) ఏదీకాదు
18. ఉద్యమ్ పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?
1) స్త్రీ, శిశు 2) భారీ పరిశ్రమలు
3) ఎంఎస్ఎంఈ 4) గృహ
19. 2022-23 బడ్జెట్ అంచనాలో ద్రవ్యలోటు ఎంత శాతంగా నమోదైంది?
1) 20 2) 18 3) 30 4) 25
20. 2022-23 బడ్జెట్లో మొత్తం వసూళ్లలో రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు ఎంత శాతం?
1) 25 2) 24 3) 20 4) 74
21. 2022-23 బడ్జెట్లో రెవెన్యూ మిగులు ఎంత శాతం?
1) 1.4 2) 2 3) 2.45 4) 3.5
22. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఎన్ని అంశాలు సరైనవి?
ఎ. మొత్తం వసూళ్లలో మూలధన వసూళ్లు- 24 శాతం
బి. మొత్తం వసూళ్లలో రెవెన్యూ వసూళ్లు- 74 శాతం
సి. 2021-22 బడ్జెట్‌తో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్ 22.3 శాతం అధికం
డి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ రూ.2,56,859 కోట్లు
1) ఒకటి సరైనది
2) మూడు సరైనవి
3) రెండు సరైనవి
4) నాలుగూ సరైనవి
23. కింది అంశాల్లో ఎన్ని సరైనవో గుర్తించండి?
ఎ. 2018-21 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సగటు రెవెన్యూ వసూళ్లు జాతీయ సగటు తలసరి రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువ
బి. 2018-21 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు అన్నిరాష్ర్టాల కంటే ఎక్కువగా నమోదైంది
సి. 2018-21 సంవత్సరాల్లో గోవా తలసరి రెవెన్యూ వసూళ్ల కంటే తెలంగాణ రెవెన్యూ వసూళ్లు అధికం కాదు
1) ఒకటి 2) రెండు
3) మూడు 4) ఏదీకాదు
24. 2018-21 మధ్య కాలంలో అఖిల భారత జీఎస్ సగటు వృద్ధి రేటు కంటే కింది రాష్ట్ర ఆదాయ వనరుల్లో ఏది ఎక్కువగా ఉంది?
ఎ. స్టాంపులు రిజిస్ట్రేషన్ బి. ఎక్సైజ్
సి. ఎస్జీఎస్టీ డి. మోటార్ వాహన పన్ను
1) బి, సి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
25. 2018-21 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర పన్ను రాబడిలో వనరులను ఆరోహణ క్రమంలో అమర్చండి?
ఎ. ఎస్జీఎస్టీ
బి. అమ్మకపు పన్ను
సి. మోటార్ వాహన పన్ను
డి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్
ఇ. ఎక్సైజ్
1) ఎ, బి, ఇ, డి, సి
2) ఎ, బి, డి, ఇ, సి
3) బి, ఎ, ఇ, డి, సి
4) బి, ఎ, ఇ, సి, డి
26. 2018-21 కాలంలోని ద్రవ్యలోటును పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కింది వాటిలో ఏ ఆధాయాన్ని ప్రధానంగా వినియోగించిందో ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. కేంద్రం నుంచి లోను
బి. పబ్లిక్ అకౌంట్స్
సి. మార్కెట్ రుణాలు డి. ఇతరాలు
1) సి, ఎ, బి, డి 2) బి, సి, డి, ఎ
3) ఎ, బి, డి, సి 4) డి, ఎ, బి, సి
27. కింది వాటిలో రెవెన్యూ వ్యయం పరిధిలోకి వచ్చే వ్యయాల్ని గుర్తించండి?
ఎ. జీతాలు బి. గ్రాంట్లు
సి. వేతనాలు
డి. రైతుబంధు ఇ. నిర్వహణ వ్యయం
ఎఫ్. ఆసరా పెన్షన్లు
జి. అవస్థాపనా సౌకర్యాలు
1) ఎ, బి, సి, జి, ఇ, ఎఫ్
2) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి
3) ఎ, బి, సి, డి, జి
4) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్
28. తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆన్లైన్ బిజినెస్ పెంచుకోవడం కోసం 2022 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఎంవోయూపై సంతకం చేసింది?
1) ఎన్ఎస్ఈ 2) సిడ్బీ
3) జస్ట్ డయల్ 4) అమెజాన్
29. ఎ. 2019లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ గ్లోబల్ లింకర్ అనే ఒక డిజిటల్ నెట్వర్కింగ్ వేదికను ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో ఎంఎస్ఎంఈల అమ్మకం కొనుగోలుదారులకు ఒక కామన్ వేదికగా వ్యవహరిస్తుంది
బి. టీఎస్ గ్లోబల్ లింకర్లో ప్రపంచ వ్యాప్తంగా 3.5 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తెలంగాణ నుంచి 17000లకు పైగా ఎంఎస్ఎంఈలు ఈ వేదికపై నమోదు చేసుకున్నాయి
సి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎన్ఎస్ఈ, సిడ్బీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది
పై అంశాల్లో ఎన్ని సరైనవి?
1) రెండు 2) ఒకటి
3) మూడు 4) ఏవీకాదు
30. తెలంగాణ రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల వ్యవస్థాపకులకు కమీషన్ రహిత సేవలు అందించడం, మార్కెట్ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2021 నవంబర్‌లో ఒక ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. దాని పేరు?
1) మేడిన్ తెలంగాణ
2) మేకిన్ తెలంగాణ
3) తెలంగాణ బ్రాండ్
4) మేడిన్ హైదరాబాద్
31. 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ రాబడులను ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. రుణాలు
బి. జీఎస్టీ
సి. ఆదాయ పన్ను
డి. కేంద్ర ఎక్సైజ్
ఇ. కార్పొరేషన్ పన్ను
ఎఫ్. పన్నేతర రాబడి
జి. రుణేతర మూలధన రాబడి
1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి
2) ఎ, బి, ఇ, సి, డి, ఎఫ్, జి
3) ఎ, బి, డి, ఇ, ఎఫ్, జి, సి
4) బి, సి, ఇ, ఎ, డి, ఎఫ్, జి
32. 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రకారం ఎన్ని అంశాలు సరికానివో గుర్తించండి?
ఎ. వడ్డీ చెల్లింపులు- 20 శాతం
బి. పన్నుల్లో రాష్ర్టాల వాటా- 18 శాతం
సి. కేంద్ర పథకాలు- 17 శాతం
డి. కేంద్రంపై మోపిత పథకాలు- 9 శాతం
ఇ. రక్షణ- 8 శాతం
ఎఫ్. పెన్షన్లు- 4 శాతం
జి. ఆర్థిక సంఘం ఇతర బదిలీలు- 9 శాతం
1) 5 2) 6 3) 3 4) ఏదీకాదు
సమాధానాలు
1-4, 2-2, 3-3, 4-1, 5-2, 6-3, 7-3, 8-1, 9-1, 10-1, 11-4, 12-4, 13-3, 14-4, 15-3, 16-4, 17-4, 18-3, 19-1, 20-4, 21-1, 22-4, 23-2, 24-2, 25-1, 26-1, 27-4, 28-3, 29-3, 30-1, 31-2, 32-4.
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు