BIOLOGY | జీవ, నిర్జీవాల అనుఘటకాలు, అంతఃచర్యలే పర్యావరణం
పర్యావరణం
- 1935లో ఏజీ టాన్స్లే అనే బ్రిటిష్ వృక్ష, ఆవరణ శాస్త్రవేత్త ‘ఆవరణ వ్యవస్థ’ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించారు.
- ప్రకృతి మూలప్రమాణాన్ని ‘ఆవరణ వ్యవస్థ’గా వర్ణించాడు.
- ఈయన ‘పర్యావరణ వ్యవస్థ’ను కుదించి ‘ఆవరణ వ్యవస్థ’ అని నామకరణం చేశాడు.
- టాన్స్లే ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులోని జీవులు వాటి జాతి సమూహాలు, అనేక వాతావరణ కారకాలు ఒకదానికొకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయి.
- ఆవరణ వ్యవస్థ అనేక సజీవ, నిర్జీవ సమూహాలు వాటి పరిసరాలతో కూడి ఉంటాయి.
- ఆవరణ వ్యవస్థలో జీవ అంశాల్లో పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా వ్యవస్థలో అంశాలు, నిర్జీవ అంశాలైన గాలి, నీరు, మృత్తికలు కూడా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.
- ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు అనే పదాన్ని ఉపయోగించారు.
- ఉత్పత్తిదారులు -> వినియోగదారులు-> విచ్ఛిన్నకారులు
- చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారుచేస్తాయి. వీటిని ఉత్పత్తిదారులు అంటారు.
- వీటిని తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అని అంటారు.
- చివరి స్థాయిలో ఉండే విచ్ఛిన్నకారులు మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుంచి ఆహార పదార్థాలను సేకరిస్తాయి. వాటిని కుళ్లింపజేయడం ద్వారా పోషకాలను మొక్కలు తిరిగి
వినియోగిస్తాయి కాబట్టి విచ్ఛిన్నకారులను పునరుత్పత్తిదారులు అంటారు.
ఆవరణ వ్యవస్థ – రకాలు - మానవ ప్రమేయం, ప్రభావం ఆధారంగా ఆవరణ వ్యవస్థలను వర్గీకరించవచ్చు.

- నీటి ఆవరణ వ్యవస్థలో రకాలు
- జలావరణ వ్యవస్థను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
- 1. మంచినీటి ఆవరణ వ్యవస్థ
- 2. ఉప్పునీరు/ సముద్ర వ్యవస్థ
- 1. మంచినీటి ఆవరణ వ్యవస్థ : ఇందులో నిశ్చలమైనది, ప్రవహించేది అని రెండు ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి.
- హైదరాబాద్‌లోని, ఉస్మాన్‌సాగర్, దుర్గం చెరువు, రంగారెడ్డి జిల్లాలోని షామిర్‌పేట చెరువు, వరంగల్‌లోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు కొన్ని మంచినీటి జలాశయాలు, ఆవరణ వ్యవస్థలు. సముద్ర ఆవరణ వ్యవస్థ మాదిరిగానే సరస్సులోని పర్యావరణ పరిస్థితులు అధ్యయనం చేయడానికి వీలుగా కాంతి ప్రసారాన్ని అనుసరించి మూడు మండలాలుగా విభజించారు.
ఎ. లిట్టోరల్ మండలం – సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగాన్ని లిట్టోరల్ మండలం అంటారు. ఈ మండలం సమీపంలో నీరు మట్టితో కలిసి మడ్డిగా ఉంటుంది. - నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు లార్వాలకు నిలయంగా ఉంటుంది. అనేక శైవల జాతులు, బురద తామరలు, వాలిసై నేరియా, హైడ్రిల్లా వంటి మొక్కలు ఇందులో ఉంటాయి.
బి. లిమ్నోటిక్ మండలం – సరస్సులో నీటిపై భాగంలో బయటకు కనిపించే భాగాన్ని లిమ్నోటిక్ మండలం అంటారు. - ఈ భాగం ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరుగుతుంది.
సి. ఫ్రోఫండల్ మండలం – ఈ మండలం తక్కువ వెలుతురు కలిగి మసకగా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా వరకు డెట్రివోరస్, సాప్రోఫైట్స్ ఉంటాయి. ఈ భాగంలోని జంతువులు ఆహార సేకరణ కోసం దృష్టి కంటే వాసన, వినికిడి జ్ఞానంపైనే ఎక్కువగా ఆధారపడతాయి.
2. సముద్ర ఆవరణ వ్యవస్థ – కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ప్రాంతాన్ని కూడా 3 మండలాలుగా విభజించవచ్చు. - 1. యూఫోటిక్ మండలం
- 2. బెథియల్ మండలం
- 3. అబైసల్ మండలం
మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ – కోరింగ - వెనుకకు తన్నిన సముద్ర నీటితో నిండిన (బ్యాక్ వాటర్) లోతు తక్కువ ప్రాంతాల్లో నదులు, సముద్ర జలాలు కలిసే చోట ‘మడ అడవులు’ విస్తారంగా పెరుగుతాయి.
- వీటిని మంచి ఉత్పాదక ఆవరణవ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ అడవులు తనకు కావాల్సిన పోషకాలను భూమిపై పొరల్లో ఉన్న మంచి నీటి నుంచి, సముద్ర అలల ఉప్పునీటి నుంచి గ్రహిస్తాయి.
- సముద్రజీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజననస్థలంగా, కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడుతాయి.
- కొరింగ మాంగ్రూవ్స్ (మడ అడవులు) కాకినాడ దక్షిణ సముద్రతీరంలో విశాఖ పట్టణ దక్షిణ ప్రాంతం నుంచి దాదాపు 150 కి.మీ. దూరం విస్తరించి ఉన్నాయి.
మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో – సజీవాంశాలు – నిర్జీవాంశాలు
సజీవాంశాలు – జీవ అంశాల్లో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి.
ఉత్పత్తిదారులు – మడ చెట్లు, స్పైరోగైరా, యుగ్లీనా, ఆసిల్లటోరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, యూలోథ్రిక్స్ మొదలైనవి.
వినియోగదారులు – పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్లు డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవి.
విచ్ఛిన్నకారులు – డెట్రిటస్ బ్యాక్టీరియా
నిర్జీవాంశాలు – ఉప్పునీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, మృత్తిక
అనుకూలనాలు
- ఆవరణ వ్యవస్థలో జరిగే ప్రస్ఫుటమైన, వైవిధ్యమైన మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలు ప్రదర్శిస్తాయి.
- మడ అడవుల్లోని సైప్రస్లాంటి కొన్ని వృక్షాలు, మొక్కలు, తడి, ఉప్పు నీటి సమస్యలను ఎదుర్కోవడానికి విభిన్నమైన మార్గాలను అవలంబిస్తాయి. వీటి వేర్ల నుంచి ‘శ్వాసవేళ్లు’ అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందుతాయి.
- ఇవి నీటిలో పెరిగే మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరగటానికి తోడ్పడతాయి.
- ఈ విధంగా వివిధ పరిస్థితుల్లో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారుతాయి. లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవుల్లోని ‘అనుకూలనాలు’ అంటారు.
- అనుకూలనాలు ఒక జనాభాలో కనబడే సాధారణ లక్షణాలు. ఎందుకంటే ఇవి జీవులు మనుగడ సాధించడంలో సహకరిస్తాయి.
- ఎలక్ట్రిక్ ఈల్ చేపలు దాదాపు 600 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి.
- ఇవి శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి.
- వీటి పేరు ఈల్. అంటే ‘సర్పం’. అయినప్పటికి ఇది పాము కాదు. ఒక రకమైన కత్తిచేప.
- పాక్షికంగా మునిగే మొక్కల కాండాలు, ఆకులు, వేళ్లు గాలితో నిండి ఉంటాయి. ఇవి నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. ఉదా : గుర్రపుడెక్క
- సముద్రంలోని జీవుల శరీరాల్లో లవణాల స్థాయిని క్రమపరిచే అవయవాలు – మూత్రపిండాలు, మొప్పలు
- సముద్ర ఆవరణ వ్యవస్థలో కూడా జీవులు సహజీవనం, రక్షించుకునే ప్రవర్తన, దాక్కోవడం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలు మొదలైన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను కలిగి ఉంటాయి.
- తాబేళ్లు, చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి.
- కొన్ని చేపలు, డాల్ఫిన్స్ వంటి జలచరాల శరీరాల్లో ‘ఫ్లోటర్స్’ అనే గాలితిత్తులు ఉండటం వల్ల నీటిలో వివిధ స్థాయిల్లో నివసించగలుగుతున్నాయి.
- సీల్ చేపలు కుచించుకుపోయే ఊపిరితిత్తుల వల్ల నీటిలో సులభంగా మునుగుతాయి.
ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ సౌజన్యంతో
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

