కరెంట్ అఫైర్స్ 21/05/2022
# అందుబాటులోని వనరులు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి, ఇతర రంగాల్లో వృద్ధి పథంలో సాగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. వివిధ పథకాలు, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్న తీరు, రాష్ట్రాలపని తీరు ఆధారంగా పబ్లిక్ అఫైర్స్ సంస్థ 2021 సంవత్సరానికి గాను ‘పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడించింది.
#మానవ జాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే నోబెల్ బమతికి ఎంపికయ్యారు. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్కు చెందిన డేవిడ్ మెక్‌మిలన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
# వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ఏటా రోటరీ క్లబ్ ఆఫ్ విజయ సాఫల్య పురస్కారం 2021 సంవత్సరానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేశారు.
#వివిధ రకాల టీకాల అభివృద్ధికి విశిష్ట కృషిచేసిన అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పిరల్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డ్రూ వైస్మాన్ జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారం-2022కు ఎంపికయ్యారు.
#ప్రముఖ వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్ జీ కి 2021 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక డాక్టర్ ఇడా ఎస్. స్కడ్డర్ ఒరేషన్ అవార్డు లభించింది.
# బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ)లో శక్తిమంతమైన ‘పరమ్ ప్రవేగ’ అనే సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం)లో భాగంగా రూపొందించిన ఈ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవి.
#టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ర్పీత్ బుమ్రా 2022కి గాను విజ్డెన్ ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని విజ్డెన్ అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది. ఇందులో రోహిత్, బుమ్రాతో పాటు డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), పేసర్ రాబిన్సన్ (ఇంగ్లండ్) మహిళా క్రికెటర్ వాన్ నీకెర్క్ ( దక్షిణాఫ్రికా) ఉన్నారు.
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?