పబ్లిక్ సర్వీస్ కమిషన్లు – స్వతంత్ర ప్రతిపత్తి పోటీ పరీక్షల ప్రత్యేకం

భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో 315 నుంచి 323 వరకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్మాణం, నియామకం, అధికార విధుల గురించి ఉంటుంది.
# ఇది రాజ్యాంగపరమైన సంస్థ.
# దేశంలోనే అత్యున్నతమైన నియామక సంస్థ.
# 1919లో మొదటిసారి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలన్న ప్రస్తావన వచ్చింది.
# 1926లో ‘లీ’ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు.
నిర్మాణం, అర్హతలు, పదవీ కాలం
# ప్రకరణ 316(1) ప్రకారం యూపీఎస్సీలో ఒక చైర్మన్, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు.
# వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
# చైర్మన్, సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు. వీరి పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
#ప్రకరణ 318 ప్రకారం, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సర్వీస్ విషయాలు, సంఖ్యకు సంబంధించి రాష్ట్రపతి ఆదేశం ద్వారా నిర్ణయిస్తారు.
#చైర్మన్, సభ్యులను నియమించడానికి ప్రత్యేక అర్హతలు రాజ్యాంగంలో సూచించలేదు.
# మొత్తం సభ్యుల్లో సగం సభ్యులను కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సర్వీసుల్లో అనుభవం ఉన్నవారిని తీసుకోవాలి. మిగిలిన సగం సభ్యులను ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నియమిస్తుంది.
#ప్రస్తుతం యూపీఎస్సీలో ఒక చైర్మన్, 10 మంది సభ్యులున్నారు.
పదవీ విరమణ తరువాత నిబంధనలు
#చైర్మన్ పదవీ విరమణ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి పదవులకూ అర్హు కాదు.
#సభ్యులు మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్లలోని ఉన్నత పదవులకు అర్హులు. అంటే యూపీఎస్సీ చైర్మన్ గా లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు నియమితులు కావచ్చు. ఇతర ప్రభుత్వ పదవులకు అర్హు కాదు.
# రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను యూపీఎస్సీ చైర్మన్ గా లేదా సభ్యుడిగానియమించవచ్చు.
జీతభత్యాలు
# చైర్మన్, సభ్యుల జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
# జీతభత్యాలు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. సాధారణ పరిస్థితుల్లో తగ్గించడానికి వీలులేదు.
#జీతభత్యాలు సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి.
తొలగింపు (ప్రకరణ 317)
# యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను అవినీతి, అక్రమ ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ చేయించి రాష్ట్రపతి తొలగిస్తారు.
# లాభదాయక పదవులు చేపట్టడం, మతి స్థిమితం కోల్పోవడం వంటి ఇతర కారణాలపై కూడా రాష్ట్రపతి వీరిని తొలగించవచ్చు.
# ఏ కారణంగా తొలగించినప్పటికీ సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలి.
# వీరిపై విచారణ వూర్తయ్యేవరకు సస్పెండ్ చేయవచ్చు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు – స్వతంత్ర ప్రతిపత్తి
# రాజ్యాంగంలో సర్వీస్ కమిషన్ల స్వతంత్ర ప్రతిపత్తిని పరిరక్షించడానికి అనేక ఏర్పాట్లున్నాయి.
# పదవీకాల భద్రత తొలగింపు విషయంలో రాజ్యాంగపరమైన ప్రక్రియనే ప్రారంభించాలి.
#జీతభత్యాలు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. సాధారణంగా తగ్గించడానికి వీలులేదు.
#ప్రభుత్వం తన విచక్షణ మేరకు తొలగించడానికి వీల్లేదు.
# పదవిలో ఉండగా వీరి సర్వీసులకు భంగం కలిగించేలా మార్పు చేయరాదు.
#పదవీ విరమణ తర్వాత ఇతర ప్రభుత్వ పదవులకు అర్హులు కారు.
విధులు (ప్రకరణ 320)
# అఖిల భారత సర్వీసులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్), అలాగే కేంద్ర సర్వీసులకు, కేంద్రపాలిత ప్రాంతాల సర్వీసులకు పోటీ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
# అఖిల భారత సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు సంబంధించి నియామకాలను, ప్రమోషన్లు, బదిలీలు, క్రమశిక్షణ చర్యల్లో రాష్ట్రపతికి సలహాలిస్తుంది.
# రాష్ట్రాల గవర్నర్లు కోరితే, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులను కూడా నిర్వర్తిస్తుంది.
#కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, సర్వీసులో ఉన్నప్పు వారికి జరిగిన నష్టాలకు సంబంధించి కేంద్రానికి సలహాలిస్తుంది.
#ప్రకరణ 321 ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టం మేరకు యూపీఎస్సీ విధులను విస్తరించి ఇతర విధులను కూడా నిర్వర్తించమని కోరవచ్చు.
#ప్రస్తుతం సాయుధ బలగాల నియామకాలను, ముఖ్యంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నియామకాలను కూడా చేపడుతుంది.
నివేదికలు
#ప్రకరణ 323 ప్రకారం యూపీఎస్సీ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్ పరిశీలనకు పంపిస్తారు.
#యూపీఎస్సీని దేశంలో ప్రతిభను పరిరక్షించే కాపలాదారుగా (Watchdog of Merit System) పేర్కొంటారు.
# మొట్టమొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ హెచ్కే కృపలానీ (1947-49)
#ప్రస్తుత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అరవింద్ సక్సేనా (2018 నుంచి)

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
(State Public Service Commission)
#రాజ్యాంగంలోని XIVవ భాగంలో ప్రకరణ 315 నుంచి 323 వరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్మాణం విధుల గురించి ప్రస్తావించారు.
#కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లాగా ఇది కూడా రాజ్యాంగపరమైన సంస్థ. ప్రకరణ 315 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది.
నిర్మాణం, అర్హతలు
# ప్రకరణ 316 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్, గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులుంటారు.
#సభ్యుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు.
# చైర్మన్, ఇతర సభ్యులను గవర్నర్ నియమిస్తారు.
తొలగింపు
# యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను ఏ విధం గా తొలగిస్తారో అదే పద్ధతిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను కూడా తొలగిస్తారు. అవినీతి అసమర్థత, దివాళా తీయడం మొదలైన కారణాల పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ చేయించి రాష్ట్రపతి తొలగిస్తారు. వీరిపై వచ్చిన అభియోగాలు నిర్ధారణ అయ్యే వరకు సస్పెండ్ చేసే అధికారం గవర్నర్కు ఉంది. అయితే తొలగించే (Remove) అధికారం లేదు.
#కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా వీరికి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాజ్యాంగపరంగా వారికి ఉన్న అన్ని రక్షణలు వీరికి వర్తిస్తాయి. చైర్మన్, సభ్యులు తమ రాజీనామా పత్రాలు గవర్నర్కు సమర్పిస్తారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికార విధులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింది విధులను నిర్వర్తిస్తుంది.
# రాష్ట్ర సర్వీసుల్లో (గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4) వివిధ ఉద్యోగాల నియామకాలకు పోటీపరీక్షలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అలాగే వివిధ సాంకేతిక శాఖల్లో ఇంజినీర్ల నియామకాలు, ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తుంది.
# ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన నియామకాలు పదోన్నతులు, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైన వాటి పై ప్రభుత్వాలకు సలహాలిస్తుంది.
#రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ప్రకారం నిర్ణయించిన ఇతర విధులను నిర్వర్తిస్తుంది. ప్రకరణ 323 ప్రకారం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను గవర్నర్కు సమర్పిస్తుంది.
# గవర్నర్ ఈ నివేదికను రాష్ట్ర శాసనసభ పరిశీలనకు పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియజేయాలి.

ఎన్బీ చారి
ఎంఏ (పీహెచ్డీ)
పోటీ పరీక్షల నిపుణులు
9063131999
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?