History – Groups Special | అశోక చక్రవర్తి శాసనాలను తొలిసారిగా చదివినవారు?
1. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ ప్రగతికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ) క్రీ.శ. 1వ శతాబ్దం నాటికే వివిధ రకాల శాస్త్రచికిత్స పరికరాలు వాడుకలో ఉండేవి
బి) క్రీ.శ. 3వ శతాబ్దం నాటికే వివిధ రకాల శాస్త్రచికిత్స పరికరాలు వాడుకలో ఉండేవి
సి) క్రీ.శ. 5వ శతాబ్దంలో కోణం సైన్ భావన ప్రసిద్ధమైంది
డి) క్రీ.శ. 7వ శతాబ్దంలోనే సైక్లిక్ క్వాడ్రిలేటరమ్ భావన ప్రచారంలోకి వచ్చింది.
కింది సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
2. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి కింది వాటిలో బౌద్ధ జైన మతాలకు సాధారణమైన అంశాలు ఏవి?
ఎ) తపస్సుకు, ఆనందానికి సంబంధించిన తీవ్రమైన అంశాల నివారణ
బి) వేదాల సాధికారత పట్ల ఉదాసీనత
సి) మత సంస్కారాలను విస్మరించడం
కింది సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి.
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. బుద్ధ భగవానుడి ప్రతిమను కొన్ని సందర్భాల్లో ‘భూమి స్పర్శముద్ర’ అనే హస్త భంగిమతో చూపుతారు. ఆ ముద్ర దేన్ని సూచిస్తుంది?
1) బుద్ధుడు మార (MARA)ను పర్యవేక్షించమని భూమికి పిలుపు నివ్వడం తన ధ్యానానికి భంగం కలగకుండా మారను నివారించడం
2) మార మనోభావాలున్నప్పటికీ స్వచ్ఛత పవిత్రతలకు సాక్షీభూతంగా ఉండమని బుద్ధుడు, భూమిని కోరడం
3) అందరూ మట్టిలోంచే పుట్టారనీ చివరకు మట్టిలోనే కలిసి పోతారనీ తన అనుయాయులకు బుద్ధుడు జ్ఞాపకం చేస్తున్నాడు
4. ఈ సందర్భంలో 1, 2 రెండూ సరైనవే
4. తొలి వేద యుగం ఆర్యుల మతం ప్రధానం గా దేనికి చెందింది?
1) భక్తి
2) విగ్రహారాధన, యజ్ఞాలు
3) ప్రకృతి ఆరాధన యజ్ఞాలు
4) ప్రకృతి ఆరాధన, భక్తి
5. జైన తత్వం ప్రకారం ప్రపంచాన్ని సృష్టించి పోషించేది?
1) సార్వత్రిక శాసనం
2) సార్వత్రిక సత్యం
3) సార్వత్రిక విశ్వాసం
4) సార్వత్రిక ఆత్మ
6. సింధూ నాగరికతకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) ఇది ప్రధానంగా లౌకిక నాగరికతకు మత పరమైన అంశం ఉన్నప్పటికీ అది ప్రాబల్యం వహించేది
బి) ఈ కాలంలో భారతదేశంలో నూలు వస్ర్తాల తయారీ కోసం పత్తిని ఉపయోగించారు
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
7. కింది వాటిలో ఏ వ్యక్తిని ఉద్దేశించి మహామస్తకాభిషేకం అనే గొప్ప మతపరమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు?
1) బాహుబలి 2) గౌతమ బుద్ధుడు
3) మహావీరుడు 4) నటరాజు
8. ప్రాచీన తక్షశిల పట్టణం ఏ రెండు నదుల మధ్య ఉంది?
1) సింధూ-జీలం 2) జీలం- చీనాబ్
3) చీనాబ్-రావి 4) రావి-బియాస్
9. ప్రాచీన భారతదేశంపై దాడి చేసిన వారికి సంబంధించి సరైన చారిత్రక క్రమం ఏది?
1) గ్రీకులు శకులు- కుషాణులు
2) గ్రీకులు-కుషాణులు-శకులు
3) శకులు-గ్రీకులు- కుషాణులు
4) శకులు-కుషాణులు- గ్రీకులు
10. కింది వాటిలోమిగిలిన ముగ్గురికీ సమకాలీకుడు కానివారెవరు?
1) బింబిసారుడు 2) గౌతమ బుద్ధుడు
3) మిళిందుడు 4) ప్రసేనజిత్తు
11. ప్రాచీన జైనమతానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1) స్థూల బాహు నాయకత్వంలో జైనమతం, దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందింది
2) పాటలీపుత్రంలో జరిగిన పరిషత్తు తర్వాత భద్రబాహు నాయకత్వంలో మిగిలిన జైనులను శ్వేతాంబరులన్నారు
3) క్రీ.పూ.ప్రథమ శతాబ్దంలో జైన మతం కళింగరాజు ఖారవేలుడి ఆదరణ పొందింది
4) జైన మతం ప్రాథమిక దశలో, బౌద్ధుల మాదిరి కాకుండా జైనులు విగ్రహాలను ఆరాధించారు
12. నాలుగు వేదాల్లో మంత్రతంత్రాలున్న వేదం ఏది?
1) రుగ్వేదం 2) యజుర్వేదం
3) అధర్వణ వుదం 4) సామవేదం
13. శూద్రకునిచే రచించిన భారత ప్రాచీన పుస్తకమైన మచ్ఛకటికం దేని గురించి ప్రస్తావిస్తుంది?
1) ధనిక వ్యాపారికి, వేశ్య కుమార్తెకు మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి
2) పశ్చిమ భారతదేశంలోని శక క్షాత్రపులపై చంద్రగుప్త-2 సాధించిన విజయాన్ని
3) సముద్రగుప్తుని సైనిక దాడులు, విజయాల గురించి
4) గుప్తరాజుకు కాపరూప రాణికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి
14. కింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
ఎ) లిచ్ఛలి రాజైన చేతక కుమార్తె
మహావీరుడి తల్లి
బి) కోసల రాజ్యరాణి గౌతమబుద్ధుని తల్లి
సి) బెనారస్కు చెందిన పార్శనాథుడు 23వ తీర్థాంకరుడు
1) ఎ 2) బి
3) బి, సి 4) ఎ, బి, సి
15. కిందివాటిలో ఇచ్చిన చారిత్రక ప్రదేశం, ఆ ప్రదేశంలో దొరికిన వస్తువులను గుర్తించండి.
నగరం బయటపడిన అంశం
ఎ) లోథాల్ 1) దున్నిన ప్రదేశం
బి) కాలిబంగన్ 2) నౌకాశ్రయం
సి) దొలవీర 3) మట్టితో చేసిన నాగలిని పోలిన వస్తువు
డి) బన్వాలీ 4) పది పెద్ద గుర్తులతో ఉన్న హరప్పా రాత
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
16. ప్రాచీన బౌద్ధ సంఘాల్లో ‘పవరానా’ అనే ఉత్స వం జరిగేది అది దేనికి సంబంధించినది?
1) సంఘపరి నాయకుడిని ఎన్నుకోవటానికి, ధర్మ వినయపై మాట్లాడే ఇద్దరు వ్యక్తులను ఎన్నుకోవటం
2) వర్షరుతువులతో విహారాల్లో బౌద్ధ సన్యాసులు తాము చేసిన తప్పులను ఒప్పుకునే ఉత్సవం
3) కొత్తవ్యక్తిని బౌద్ధ సంఘాల్లో చేర్చుకునేటప్పుడు చేసే ఉత్సవం
4) ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత బౌద్ధ సన్యాసులు వర్ష రుతువులో తాము చేసే కార్యకలాపాలను నిర్ణయించుకోవటం
17. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వర విగ్రహం జైనుల్లోని చివరి తీర్థంకరుడిది
2) ఇండియాలోని అతి పెద్దదైన బౌద్ధ ఆరామం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది
3) చందేల రాజుల కాలంలో ఖజురహో దేవాలయాలు నిర్మించారు
4) హొయసలేశ్వర దేవాలయం శివుడికి అంకితమిచ్చినది
18. విశాఖదత్తుని ముద్ర రాక్షసంలోని కథాంశం?
1) హిందు దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం
2) ఆర్యరాజుకు, గిరిజన యువతికి మధ్య జరిగిన ప్రేమగాథ
3) రెండు ఆర్యతెగల మధ్య అధికారం కోసం జరిగిన పోరు
4) చంద్రగుప్త మౌర్యుని కాలంలో కోర్టు రికార్డులు
19. హర్షుడు బౌద్ధ మత వ్యాప్తికి ఎక్కడ సమావేశం నిర్వహించాడు?
1) ప్రయాగ 2) తక్షశిల
3) పాటలీపుత్రం 4) పురుషపురం
20. కింది వాటిలో ఏ జంతువు హరప్పా కాలం నాటి ముద్రలు, టెర్రకోట బొమ్మల్లో లేదు?
1) ఆవు 2) ఏనుగు
3) ఖడ్గమృగం 4) పులి
21. ఆనంద్ తప్పనిసరిగా శాకాహారి ఎందుకంటే అతను బౌద్ధుడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఏ అంచనాలకు రావచ్చు?
1) ఎక్కువమంది బౌద్ధులు శాకాహారులు
2) బౌద్ధులందరూ శాకాహారులే
3) బౌద్ధులు మాత్రమే శాఖాహారులు
4) ఎక్కువ మంది శాఖాహరులు బౌద్ధులే
22. బౌద్ధ మతానికి సంబంధించిన శిలలను తొలిచి చేసిన కొన్ని గుహలను చైత్యాలంటారు. మరి కొన్నింటిని విహారాలంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
1) విహారం అనేది ప్రార్థన స్థలం కాగా చైత్యం బౌద్ధ సన్యాసుల నివాస స్థలం
2) చైత్యం ప్రార్థన స్థలం కాగా విహారం బౌద్ధ సన్యాసుల నివాస స్థలం
3) చైత్యం అనేది గుహ చివర దూరంగా ఉన్న స్థూపం అయితే విహారం దానికి అక్షేమంగా ఉన్న మందిరం
4) ఈ రెండింటి మధ్య చెప్పకోదగ్గ తేడా ఏమీ లేదు
23. కింది వాటిలో బౌద్ధ మతంలో నిర్వాణ భావనను ఉత్తమ రీతిలో నిర్వచించేది ఏది?
1) కోరిక అనే జ్వాలను ఆర్పి వేయడం
2) స్వార్థాన్ని పూర్తిగా తుడిచి పెట్టడం
3) పరమానంద ప్రశాంత స్థితి
4) గ్రహణ శక్తికి దూరంగా ఉండే మానసిక స్థితి
24. భారతదేశంలో తాత్విక చింతన చరిత్ర విషయంలో సాంఖ్య సంప్రదానికి సంబంధించిన కింది ప్రవచనాలను పరిశీలించండి?
ఎ) సాంఖ్య సంప్రదాయం, పునర్జన్మ లేదా ఆత్మ మరో శరీరాన్ని ఆశ్రయించడానికి సంబంధించిన సిద్ధాంతాన్ని అంగీకరించదు
బి) ముక్తికి మార్గం ఆత్మజ్ఞానమే కానీ మరే ఇతర బాహ్య ప్రభావం కాదని సాంఖ్య అభిప్రాయపడుతుంది
పై ప్రవచనాల్లో సరైనది ఏది?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
25. ఎవరి పరిపాలనా కాలంలో మెగస్తనీస్ ఇండియాను సందర్శించాడు?
1) హర్షుడు 2) కణ్వ
3) అశోక 4) చంద్రగుప్త మౌర్య
26. కింది ప్రవచనాన్ని ఎవరు ప్రతిపాదించారు?
‘భగవపి ఖత్రియో అహంపి ఖత్రియో’ (భగవంతుడు (బుద్ధుడు) క్షత్రియుడైతే నేను క్షత్రియుడినే)
1) బింబిసారుడు 2) అజాతశత్రు
3) ప్రసేనజిత్తు 4) శిశునాగ
27. శ్రీ హర్షుడు రచించిన నాటకం ఏది?
1) కుందమాల 2) ప్రియదర్శిక
3) కర్పూరమంజరి 4) మాలతి మాధం
28. పిండాకార అనేది మౌర్యుల కాలంలో విధించిన ఏ పన్ను?
1) కార్మిక 2) నీటిపారుదల
3) వ్యవసాయేతర
4) గ్రామస్థులందరి నుంచి సమష్టిగా సేకరణ
29. మహావీరుని మరణానంతరం జైన మతానికి ఆథ్యాత్మిక గురువు అయినవారు ఎవరు?
1) గౌతమ ఇంద్రభూతి
2) గోశాల
3) సుదర్శన్ 4) జంబుస్వామి
30. భారత సాంస్కృతిక చరిత్రను అనుసరించి ‘పంచాయతన్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) ఒక పెద్దల సమావేశం
2) ఒక మత వర్గం
3) దేవాలయ నిర్మాణ శైలి
4) పాలనా పరమైన అధికారి
31. కింద పేర్కొన్న జతల్లో భారతీయ తత్వశాస్ర్తానికి చెందిన ఆరు వ్యవస్థలతో సంబంధం లేనివి ఏవి?
1) మీమాంస, వేదాంత
2) న్యాయ, వైశేషిక
3) లోకాయత, కాపాలిక
4) సాంఖ్య, యోగ
32. భారత జాతీయ చిహ్నం కింద చెక్కి ఉన్న మన జాతీయ నినాదం ‘సత్యమేవ జయతే’ ను ఎక్కడి నుంచి స్వీకరించారు?
1) కఠోపనిషత్
2) చాందగ్యోపనిషత్
3) ఐతరేయ బ్రాహ్మణం
4) ముండకోపనిషత్
33. కింది వాక్యాల్లో ఏది సరైనది?
1) ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతంలో సిద్ధాంత సంప్రదాయాన్ని స్థాపించాడు
2) మైత్రేయ నాథుడు మహాయాన బౌద్ధమతంలో యోగచార సిద్ధాంత సంప్రదాయాన్ని స్థాపించాడు
3) ఆర్యదేవుడు, బుద్ధ పాలితుడు మహాయాన బౌద్ధంలోని మాధ్యమిక సిద్ధాంత సంప్రదాయాన్ని అవలంబించారు
4) శాంతిదేవుడు, చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగచార సిద్ధాంత సంప్రదాయాన్ని అవలంబించారు
34. కింది వాటిని జతపరచండి?
ఎ) బగోర్ 1) రాజస్థాన్
బి) లంగ్ంజ్ 2) గుజరాత్
సి) భీమ్ బట్కా 3) మధ్యప్రదేశ్
డి) సరాయి సహర్రాయ్ 4) ఉత్తరప్రదేశ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
35. కింద పేర్కొన్న వాటిల్లో శుంగవంశ స్థాపకుని కుమారుడి ప్రణయగాథను తెలియజేసే పుస్తకం ఏది?
1) స్వప్నవాసవదత్త
2) మాళవికాగ్నిమిత్ర
3) మేఘదూత 4) రత్నావళి
36. అశోక చక్రవర్తి శాసనాలను కిందివారిలో తొలిసారిగా చదివినవారు?
1)జార్జ్ బుహ్లర్ 2) జేమ్స్ ప్రిన్సెస్
3) మాక్స్ ముల్లర్
4) విలియం జోన్
సమాధానాలు
1-3 2-2 3-2 4-3
5-1 6-3 7-1 8=1
9-4 10-4 11-3 12-3
13-1 14-3 15-2 16-1
17-1 18-4 19-1 20-1
21-2 22-2 23-3 24-2
25-4 26-2 27-2 28-4
29-3 30-3 31-3 32-4
33-4 34-1 35-2 36-2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు