General Studies – Groups Special | ట్రాన్స్‌జెండర్స్‌కు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం?
సెప్టెంబర్ 23 తరువాయి
66. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. సైబర్ భద్రత సంఘటనలను పర్యవేక్షించి వాటిపై స్పందించడానికి రాష్ట్రస్థాయి సైబర్ భద్రతా సమన్వయ కేంద్రాన్ని (సీఎస్పీసీ) ఏర్పాటు చేయడం.
2. సైబర్ సంఘటనలపై వేగంగా ప్రతి స్పందించి వాటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయడం (సీఎస్ఐఎంఎస్)
3. దేశవ్యాప్తంగా సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఇతర రాష్ర్టాలు, జాతీయ సంస్థలతో సమన్వయం.
తెలంగాణ సైబర్ భద్రత విధానం, 2016 కు సంబంధించి పై వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
a. 1,2 b. 1, 2, 3
c. 2,3 d. 3 జవాబు : b
వివరణ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విధానం, 2016 కింద భద్రత సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన
నిబంధనలున్నాయి.
లక్ష్యాలు
1. సైబర్ భద్రత సంఘటనలను పర్యవేక్షించడానికి వాటిపై స్పందించడానికి రాష్ట్రస్థాయి సైబర్ భద్రతా సమన్వయ కేంద్రాన్ని (సిఎస్సీసీ) ఏర్పాటు చేయడం.
2. సైబర్ నేరాల పరిశోధన, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సాంకేతిక సహకారం అందించడానికి పూర్తిస్థాయి సైబర్ విచారణ విభాగాల (సీసీఐయూ) ఏర్పాటు.
3. సైబర్ సంఘటనలపై వేగంగా ప్రతిస్పందించేందుకు సైబర్ ఘటనల నిర్వహణ వ్యవస్థను (సీఎస్ఐఎంఎస్)
అమలు చేయడం.
4. సైబర్ భద్రత క్లస్టర్, ఇంక్యుబేషన్ సెంటర్ల స్థాపన ద్వారా సైబర్ భద్రత వ్యవస్థను అభివృద్ధి చేయడం.
5. దేశవ్యాప్తంగా సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఇతర రాష్ర్టాలు, జాతీయ సంస్థలతో సమన్వయం.
67. కింది వాటిలో ట్రాన్స్ జెండర్లు , LGBQIA+ (లెస్బియస్, గే, బైసెక్సువల్, క్వీర్, ఇంటర్‌సెక్స్ అసెక్సువల్) వ్యక్తులపై నేరాలను నిరోధించడంతో పాటు రక్షణ అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది?
a. ప్రైడ్ ప్లేస్ b. భరోసా ప్లేస్
c. పీస్ వరల్డ్ d. ఏన్ ఎక్స్ ట్రా మైల్
జవాబు : a
వివరణ: 2022 ఏప్రిల్ 12న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ప్రైడ్ ప్లేస్, ట్రాన్స్ జెండర్లు LGBQIA+(లెస్బియస్, గే, బైసెక్సువల్, క్వీర్, ఇంటర్‌సెక్స్ అసెక్సువన్) వ్యక్తులపై నేరాలను నిరోధించడంతో పాటు, భద్రత రక్షణను అందించడం లక్ష్యంగా ప్రారంభించారు. లింగం, లైంగికతతో సంబంధం లేకుండా వ్యక్తులందరికీ సురక్షితమైన సమ్మిళిత సమాజాన్ని అందించేలా ఆయా సమూహాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తోంది.
68. బాల నేరాలకు సామాజిక కారణం ఏది?
a. విచ్ఛిన్న గృహాలు b. పేదరికం
c. యాచన d. పైవన్నీ
జవాబు : d
వివరణ : పిల్లలు చట్టానికి వ్యతిరేకంగా వెళ్లడానికి అత్యంత ప్రధాన కారణాలు విద్య లేకపోవడం లేదా విచ్ఛిన్న గృహాలు, పేదరికం, యాచన వంటివి పెంపకంలో లోపాలు.
69. కింది అంశాలను పరిశీలించండి?
1. విద్యా మంత్రిత్వ శాఖ విదేశీ వ్యవహారాల శాఖలో కలిసి వీర గాథా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2. ఈ ప్రాజెక్టు లక్ష్యం – భారత శౌర్యపురస్కార గ్రహీతల గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం; వారు భారతదేశ ధీర హృదయాల త్యాగం, ధైర్య కృత్యాలను గౌరవించేలా చేయడం.
పై వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
a. 1 b. 2 c.1,2 d. ఏదీ కాదు
జవాబు : b
వివరణ : రక్షణ శాఖతో కలిసి విద్యా మంత్రిత్వ శాఖ కలిసి వీర గాథా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు శౌర్య పురస్కార విజేతల జీవితాలపై పద్యాలు, చిత్రాలు, వ్యాసాలు లేదా మలీ ్టమీడియా ప్రదర్శనల రూపంలో ప్రాజెక్టులను సిద్ధం చేస్తారు.
70. భారత్‌లో విద్యా స్థితి నివేదిక (SOER ఫర్ ఇండియా) ‘టీచర్లు లేరు, క్లాసు లేదు’ను ఎవరు విడుదల చేశారు?
a. UNESCO b. UNICEF
c. UNFCCC d. UDISE
జవాబు : a
వివరణ : ఐక్యరాజ్య విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఇటీవల తన ‘2021 భారత విద్యా స్థితి నివేదిక
‘నో టీచర్స్, నో క్లాస్’ను విడుదల చేసింది.
71. కింది అంశాలను పరిశీలించండి?
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 48 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
2. వారి అక్షరాస్యతా రేటు 56.1 శాతం ఉండగా, సాధారణ ప్రజానీకం అక్షరాసత్యత రేటు 74 శాతంగా ఉంది.
3. జాతీయ విద్యావిధానం 2020 ట్రాన్స్‌జెండర్ పిల్లలను విద్యాపరంగా వెనుకబడిన వారిగా గుర్తిస్తుంది.
4. స్కాట్లాండ్ 2021లో LGBTQ + వ్యక్తులకు పాఠ్యప్రణాళికలో చేర్చి ఆ దిశగా చర్యలు తీసుకున్న తొలి దేశం.
పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి?
a. 1, 2, 3 b. 2, 3, 4
c. 1, 2, 3, 4 d. 2, 4
జవాబు : c
వివరణ : 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 48 లక్షల మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. వారి అక్షరాస్యతా రేటు 56.1 శాతం ఉండగా, సాధారణ ప్రజానీకం అక్షరాస్యత రేటు 74 శాతంగా ఉంది. 2017లో జాతీయ మానవహక్కుల
కమిషన్ చేసిన ఒక అధ్యయనంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో పదో తరగతి పూర్తి కాకముందే మూడింట రెండు వంతుల మంది ట్రాన్స్ జెండర్ పిల్లలు మధ్యలో చదువు మానేసినట్లు తేలింది. జాతీయ విద్యావిధానం 2020 ట్రాన్స్‌జెండర్ పిల్లలను విద్యాపరంగా వెనుకబడి ఉన్న వారిగా గుర్తిస్తుంది. లింగ సమ్మిళిత నిధి ద్వారా వారికి విద్యా సదుపాయాల లభ్యతను విస్తృతం చేయాలని ఇది సిఫారసు చేసింది. 2021లో ఎల్జీబీటీక్యూఐలను సమ్మిళితం చేస్తూ పాఠ్య ప్రణాళికలను రూపొందించిన తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది.
72. DOT చికిత్సను దేనికి ఉపయోగిస్తారు?
a. మలేరియా b. డెంగ్యీ
c. టీబీ d. జపనీస్ ఎన్సెపాలిటిస్
జవాబు : c
వివరణ : డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ సంక్షిప్త రూపం డీవోఈ. దీన్ని టీబీ-డీవోటీస్ అని కూడా పిలుస్తారు. క్షయ వ్యాధి (టీబీ) నివారణ వ్యూహానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల మేరకు ఆ పేరును పెట్టారు.
73. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన కేంద్ర ప్రాయోజిత పథకం
2. ఈ పథకాన్ని 2003లో ఆరోగ్య
కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
3. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల సమీకరణ/ దశల వారీగా వ్యవస్థాపన ఈ పథకంలోని భాగాల్లో ఒకటి
పై వ్యాఖ్యల్లో సరికానివి ఏవి?
a.1, 2 b. 1, 2, 3
c. 3 d. 1 జవాబు : d
వివరణ : ప్రధానమంత్రి స్వాస్త్య సురక్షయోజన (పీఎంఎస్ఎస్వై) కేంద్ర ప్రభుత్వ పథకం (ప్రాయోజిత పథకం కాదు). ఈ పథకాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2003లో ప్రకటించింది.
లక్ష్యం : అందుబాటు ధరల్లో/విశ్వసనీయమైన ఆరోగ్య రక్షణ సేవలను అందించడంలో ప్రాంతీయ అసమతౌల్యాన్ని సరిచేయడం, ఇంకా ఇది దేశంలో నాణ్యమైన వైద్య విద్యా సదుపాయాలను కూడా పెంచుతుంది. ఈ పథకంలో రెండు భాగాలున్నాయి.
1. ఏఐఐఎంల వంటి కొత్త సంస్థల ఏర్పాటు
2. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్యకళాశాలల నవీకరణ/ దశలవారీగా వ్యవస్థాపన.
74. ప్రపంచ ఉగ్యోగ, సామాజిక స్థితిగతుల నివేదిక (వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్ లుక్ రిపోర్ట్)ను ఎవరు విడుదల చేస్తారు?
a. ILO b. కార్మిక మంత్రిత్వ శాఖ
c. UN FAO d. WTO
జవాబు : a
వివరణ : ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) ‘వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్ లుక్ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది.
75. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. కోవిడ్-19 విపత్తు సమయంలో సహాయ ప్యాకేజీలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ప్రకటించారు.
2. వినియోగదారీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దీనికి మంత్రిత్వశాఖ
a. 1 b. 2
c. 1, 2 d. ఏదీకాదు
జవాబు : c
వివరణ : కోవిడ్ -19 విపత్తు సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ఉపశమన చర్యల్లో భాగంగా ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు, అవసరమైన ప్రజలకు తగినంత ఆహార కల్పనకు ఇది భరోసా ఇస్తుంది. వినియోగదారీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధీనంలోని ఆహార, ప్రజాపంపిణీ విభాగం నోడల్ సంస్థగా ఉంది. ఆహారం, ప్రజాపంపిణీ ఈ పథకం లక్షణాలు. దాదాపు 80 కోట్ల జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులు అదనపుకోటా ఉచిత ఆహార ధాన్యాలు పొందేందుకు అర్హులు. (బియ్యం/గోధుమ). ఇది నెలకు ఒక వ్యక్తికి ఐదు కేజీల వరకూ వారి నెలవారీ కోటాను అదనంగా అందించింది.
76. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. ఎస్సీ/ఎస్టీ (అకృత్యాల నిరోధక) చట్టం 1989 అట్టడుగు సమూహాలపై వివక్షకు వ్యతిరేకంగా అమలు చేయబడింది.
2. ఈ నేరానికి కనీసం
10 సంవత్సరాల శిక్ష.
3. ఒక వ్యక్తి ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయిన కారణంగా ఏదైనా ఘటన జరిగితే మాత్రమే ఇది ఇస్తుంది.
పై అంశాల్లో ఏవి సరైనవి కావు?
a. 1, 2 b. 3
c. 2, 3 d. 2 జవాబు : b
వివరణ : ఎస్సీ/ఎస్టీ (అకృత్యాల నిరోధక చట్టం 1989- వివక్ష, అకృత్యాల నుంచి అట్టడుగు వర్గాల రక్షణకు ఈ చట్టం అమలు చేశారు. 2015లో దీనిని సవరించి దళిత, ఆదివాసీ మహిళలపై లైంగిక వేధింపులు, దేవదాసీలుగా అర్పణ చేయడం మొదలైన వాటితో సహా మరిన్ని అకృత్యాలను ప్రత్యేకంగా గుర్తించారు. సెక్షన్ 3(2) (V) ఎస్సీ/ఎస్టీలపై నేరాలకు పాల్పడిన ఎస్సీ/ఎస్టీయేతర వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తుంది. అయితే నేరానికి కనీస శిక్ష పదేళ్ల వరకూ వుండాలి. ఒక ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయిన కారణంగా ఏదైనా ఘటన జరిగితే ఇది వర్తిస్తుంది.
77. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. యూనిసెఫ్ ప్రకారం భారతదేశంలో 2018 నుంచి 29.6 మిలియన్ల మంది అనాథలు, విడిచిపెట్టిన పిల్లలు ఉన్నారు.
2. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రు లిద్దరినీ కోల్పోయిన పిల్లలకు పీఎం-కేర్స్ పథకం చేయూతనిస్తుంది.
పై వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : a
వివరణ : యూనిసెఫ్ ప్రకారం, భారతదేశంలో 2018 నాటికి 29.6 మిలియన్ల మంది అనాథ, విడిచిపెట్టిన బాలలు ఉన్నారు. ఇది శ్రీలంక జనాభా కన్నా ఎక్కువ. పిల్లల కోసం పీఎం-కేర్స్ పథకం కొవిడ్ -19 కారణంగా తల్లిదండ్రులను లేదా చట్టపరమైన సంరక్షకులు/దత్తత తీసుకున్న తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లలకు
చేయూతనిస్తుంది.
78. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) 2014లో అమలైంది.
2. ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
3. ప్రాణాలతో బయటపడిన బాలలు, వయోజన నేరస్థులకు మాత్రమే పోక్సో చట్టం వర్తిస్తుంది.
పై వ్యాఖ్యల్లో సరైన వాటిని గుర్తించండి.
a. 1, 2 b. 1, 2, 3
c. 2, 3 d. 1, 3 జవాబు : c
వివరణ : లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) 2012లో అమలైంది. పిల్లలపై లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీ, అశ్లీలతను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.
2019లో ఈ చట్టాన్ని సవరించారు. ఈ సవరణలో వివిధ నేరాలకు శిక్షల పెంపునకు సంబంధించిన నిబంధనలున్నాయి. పిల్లలకు భద్రత, గౌరవప్రదమైన బాల్యాన్ని అందిస్తుంది. ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టం గరిష్ఠంగా జీవిత ఖైదు లేదా మరణశిక్షను నిర్దేశిస్తుంది. పోక్సో చట్టం ప్రాణాలతో బయటపడిన బాలలు, వయోజన నేరస్థులకు మాత్రమే వర్తిస్తుంది.
79. బాల్య న్యాయ (బాలల రక్షణ, భద్రత) చట్టం, 2015 ఎవరిని జువైనల్/ బాలలుగా పరిగణిపస్తుంది?
a. 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు
b. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు
c. 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు
d. 21 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు
జవాబు : b
వివరణ :జువైనల్ జస్టిస్ (బాలల రక్షణ, భద్రత) చట్టం, 2015- 18 ఏళ్ల వయస్సు నిండని వారిని జువైనల్ లేదా బాలుడిగా నిర్వచిస్తుంది.
80. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. విశాఖ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది.
2. ప్రభుత్వ రంగంలోని యజమానులు మాత్రమే లైంగిక వేధింపుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.
3. ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేయాలి.
పై అంశాల్లో ఏవి సరైనవి కావు?
a. 1, 3 b. 2, 3
c. 2 d. 3 జవాబు : c
వివరణ : 1997లో విశాఖ తీర్పులో భాగంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాల్లో ముఖ్యమైన అంశాలు
1. లైంగిక వేధింపులను నిరోధించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని యజమానులందరూ తగిన చర్యలు తీసుకోవాలి.
2. ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 2013లో చట్టం చేసింది. 10 లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్న ఉద్యోగులు ఉన్న ప్రతి కార్యాలయంలో లేదా శాఖలో ఐసీసీ తప్పనిసరి.
ఎం. క్రాంతి కుమార్ రెడ్డి
ఫ్యాకల్టీ
విష్ణు ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు