సెంటర్ కోర్టు ప్రారంభమై వందేండ్లు ( క్రీడలు)
కార్లోస్ సైన్జ్
ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సైన్జ్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి-2022ను గెలుచుకున్నాడు. జూలై 3న జరిగిన పోటీలో సెర్గియో పెరెజ్, లూయీస్ హామిల్టన్‌లను వెనక్కు నెట్టి ఈ పోటీలో నెగ్గాడు. దీంతో తన తొలి ఫార్ములా వన్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
వందేండ్ల సెంటర్ కోర్టు
వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సెంటర్ కోర్టు ప్రారంభమై వందేండ్లు పూర్తయిన సందర్భంగా జూలై 3న శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం వింబుల్డన్ మధ్యలో వచ్చే ఆదివారం మ్యాచ్‌లు జరగవు. కానీ ఆ కోర్టు వందేండ్ల సందర్భంగా తొలిసారి ఆ రోజు కూడా ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించారు.
గీతిక, అల్ఫియా పఠాన్
ఎల్డోరా కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్ (81 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. కజకిస్థాన్‌లో నిర్వహించిన ఈ టోర్నీ జూలై 4న ముగిసింది. ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, పది కాంస్యా లు మొత్తం 14 పతకాలు లభించాయి.
యుపున్ అబెకూన్
శ్రీలంక స్ప్రింటర్ యుపున్ అబెకూన్ 100 మీటర్ల పరుగును 9.96 సెకన్లలో పూర్తిచేసిన మొదటి దక్షిణాసియా స్ప్రింటర్‌గా రికార్డు సృష్టించాడు. జూలై 4న స్విట్జర్లాండ్‌లోని లా చాక్స్ డి ఫాండ్స్లో నిర్వహించిన రెసిస్ప్రింట్ ఇంటర్నేషనల్‌లో అబెకూన్ ఈ ఘనత సాధించాడు. జర్మనీలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో నమోదు చేసిన తన రికార్డు (10.05 సెకన్లు)ను తనే తిరగరాసుకున్నాడు.
సమాన వేతనం
న్యూజిలాండ్ క్రికెట్, ప్లేయర్స్ అసోసియేషన్ ఐదేండ్ల ఒప్పందంపై జూలై 5న సంతకం చేశాయి. దీని ప్రకారం పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు కూడా సమాన వేతనం పొందుతారు. ఈ ఒప్పందం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. పురుషులు, మహిళలు సమానంగా ఫీజు తీసుకోవడం ప్రపంచ క్రికెట్లో ఇదే తొలిసారి అని కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?