అమెరికా ఉపగ్రహాలు (అంతర్జాతీయం)
అమెరికా ఉపగ్రహాలు
అమెరికా రక్షణ శాఖ ఏడు కొత్త ఉపగ్రహాలను జూలై 2న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని మొజావే ఎడారిలోని మొజావే ఎయిర్ స్పేస్ పోర్ట్ నుంచి వర్జిన్ ఆర్బిట్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ రాకెట్‌ను ప్రత్యేక బోయింగ్ 747 విమానం ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
అమెరికాలో పౌరసత్వ జాబితా
ఈ ఏడాది జూన్ 15 నాటికి సుమారు 6,61,500 మంది కొత్తగా అమెరికా పౌరసత్వం పొందారు. ఈ మేరకు ది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) జూలై 3న పత్రికా ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో పౌరసత్వం పొందిన దేశాల్లో మొదటగా మెక్సికో నిలువగా.. రెండో స్థానంలో భారత దేశం నిలిచింది. మెక్సికో నుంచి 24,508 మంది అమెరికా పౌరసత్వం పొందగా.. భారత్‌కు చెందినవారు 12,928 మంది పౌరసత్వం పొందారు. ఆ తర్వాతి దేశాల్లో ఫిలిప్పీన్స్ (11,316), క్యూబా (10,689), డొమినిక్ రిపబ్లిక్ (7,046) ఉన్నాయి.
కిస్వాహిలి భాషా దినోత్సవం
ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవాన్ని జూన్ 7న యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించారు. కిస్వాహిలి ఆఫ్రికాలో, సబ్-సహారా ఆఫ్రికాలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో ఒకటి. ఆఫ్రికన్ యూనియన్ ఏకైక అధికార భాష కూడా ఇదే. 41వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ సాంస్కృతిక వైవిధ్యం, శాంతిని ప్రోత్సహించడంలో కిస్వాహిలి భాష పోషిస్తున్న పాత్రను గుర్తించి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది దీని థీమ్ ‘కిస్వాహిలి ఫర్ పీస్ అండ్ ప్రాస్పరిటీ’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?