ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2022 టైటిల్ విజేత సినీశెట్టి ( వార్తల్లో వ్యక్తులు)
తనూజ నేసరి
ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ తనూజా నేసరికి యూకే పార్లమెంంట్ ఆయుర్వేద రత్న అవార్డును జూలై 3న ప్రదానం చేసింది. దేశ, విదేశాల్లో ఆయుర్వేద వృద్ధిని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.
రాల్ నార్వేకర్
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. జూలై 3న నిర్వహించిన ఎన్నికల్లో నార్వేకర్‌కు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి 107 ఓట్లు లభించాయి. దేశంలోనే అతిపిన్న వయస్కుడైన స్పీకర్‌గా నార్వేకర్ నిలిచారు.
సినీశెట్టి
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2022 టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ఈ పోటీలను ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 3న నిర్వహించారు. రూబల్ షెఖావత్ (రాజస్థాన్) మొదటి రన్నరప్‌గా, షినాటా హాన్ (ఉత్తరప్రదేశ్) రెండో రన్నరప్‌గా నిలిచారు.
రాముడు
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన ఉందకోటి రాముడు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిభా పురస్కారం జూలై 4న అందుకున్నారు. రాముడు 1994లో ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2018 నుంచి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.
సురంజన్ దాస్
భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్-ఏఐయూ) అధ్యక్షుడిగా సురంజన్ దాస్ జూలై 4న నియమితులయ్యారు. ఆయన జాదవ్‌పూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. ఏఐయూని 1925లో ఇంటర్-యూనివర్సిటీ బోర్డుగా స్థాపించారు. ఏఐయూ సెక్రటరీ జనరల్‌గా పంకజ్ మిట్టల్ వ్యవహరిస్తున్నారు.
మోహన్ సుబ్రమణియన్
భారత లెఫ్టినెంట్ జనరల్ మోహన్ సుబ్రమణియన్ దక్షిణ సూడాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ (యూఎన్ఎంఐఎస్ఎస్) ఫోర్స్ కమాండర్‌గా జూలై 5న నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. భారత లెఫ్టినెంట్ జనరల్ శైలేష్ తినాయ్కర్ స్థానంలో సుబ్రమణియన్‌ను యూఎన్వో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నియమించారు.
మేరీనా వియాజోవ్స్కా
ఉక్రెయిన్‌కు చెందిన మేరీనా వియాజోవ్స్కా ప్రతిష్ఠాత్మక ఫీల్డ్ మెడల్‌కు జూలై 5న ఎంపికయ్యారు. ఈ అవార్డు అందుకున్న రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఫీల్డ్ మెడల్‌ను ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ ప్రతి నాలుగేండ్లకోసారి నలుగురికి అందజేస్తుంది. ఆమెతోపాటు హ్యూగో డుమినిల్-కోపిన్ (ఫ్రెంచ్), జూన్ హ్ (కొరియన్-అమెరికన్), జేమ్స్ మేనార్డ్ (యూకే) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?