01st March Current Affairs | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
రఘు
జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు ‘ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం-2023’ ఫిబ్రవరి 19న అందుకున్నారు. కరోనా సమయంలో రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ భాగస్వామిగా జర్మనీలోని 410 మంది భారతీయులు, విద్యార్థులకు ఆహారంతో పాటు ఆరోగ్య సేవలు అందించినందుకు ఈ పురస్కారం దక్కింది.
మేఘనా పండిట్
భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ మేఘనా పండిట్ ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈవోగా ఫిబ్రవరి 19న నియమితులయ్యారు. దీంతో మొదటి మహిళా సీఈవోగా ఆమె రికార్డులకెక్కారు. బ్రిటన్‌లోనే అతిపెద్ద టీచింగ్ హాస్పిటల్‌గా పేరొందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ (ఓయూహెచ్)లో ఆమె గతేడాది జూలై నుంచి తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈమె మార్చి 1న బాధ్యతలు చేపట్టనున్నారు.
లోకేశ్వరరావు సజ్జ
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో వాస్క్యులర్-థోరాసిక్ సర్జన్స్ (ఐఏసీటీఎస్) 54వ అధ్యక్షుడిగా లోకేశ్వరరావు సజ్జ ఫిబ్రవరి 19న ఎన్నికయ్యారు. ఈయన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియో థోరాసిక్ సర్జన్. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఐఏసీటీఎస్ అధ్యక్షుడిగా తెలుగు రాష్ర్టాల నుంచి ఎన్నికయిన వారిలో ఈయన నాలుగో వ్యక్తి.
రఘువంశీ
భారత ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా-డీసీజీఐ) నూతన డైరెక్టర్ జనరల్‌గా డా. రాజీవ్ సింగ్ రఘువంశీ ఫిబ్రవరి 22న నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 2025, ఫిబ్రవరి 28 వరకు ఉంటారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఔషధ ప్రమాణాలు, నాణ్యతను ధ్రువీకరించి వాటి వినియోగానికి అనుమతివ్వడంలో డీసీజీఐ కీలక పాత్ర పోషిస్తుంది.
షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. ఫిబ్రవరి 22న స్థానిక సివిక్ సెంటర్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 266 ఓట్లు పోలయ్యాయి. దీనిలో షెల్లీ ఒబెరాయ్‌కు 150, రేఖా గుప్తా (బీజేపీ)కు 116 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ గెలుపొందారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?