‘స్మార్ట్’గా చదువుకుందాం!
-
అందరికీ అందుబాటులో టీ-శాట్ పాఠాలు
-
టీ-శాట్ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి
గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉచితంగా డిజిటల్ గ్రూప్ -1 పాఠాలను టీ-శాట్ అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులకు టీ-శాట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ సందర్భంగా టీ-శాట్ అందిస్తున్న సేవల గురించి సంస్థ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి నమస్తే తెలంగాణ నిపుణకు తెలిపిన వివరాలు.
స్మార్ట్ పోన్ ఉంటే చాలు
#స్మార్ట్ పోన్ లో టీ-శాట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే గ్రూప్ -1 పోటీ పరీక్షల సమగ్ర సమాచారం మొత్తం అదుబాటులోకి తీసుకువస్తున్నాం. టీ-శాట్ ద్వారా అందించే ప్రత్యక్ష పాఠాలతో పాటు వీడియో రికార్డు పాఠాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. యూట్యూబ్ లో కూడా పాఠాలు అందుబాటులోకి తెచ్చాం. వీటితో పాటు ఇప్పటికే టీ-శాట్ ఆధ్వర్యంలో కొనసాగే నిపుణ, విద్య చానళ్ల ద్వారా గ్రూప్ -1, ఇతర ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన డిజిటల్ పాఠాలు ప్రసారం చేస్తున్నాం.
ప్రతి సబ్జెక్టుకు ముగ్గురు నిపుణులు
# గ్రూప్ -1 పరీక్షలకు డిజిటల్ పాఠాలు ప్రసారం చేయడంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి సబ్జెక్టుకు ముగ్గురు నిపుణులతో పాఠాలు తయారు చేస్తున్నాం. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం గురించి చెబితే తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, ఉద్యమ నేపథ్యం వంటి అంశాలపై వేర్వేరు నిపుణులతో వీడియోలు రూపొందించడంతో పాటు లైవ్ లో ప్రసారాలు చేస్తున్నాం. ఈ విధంగా అన్ని రకాల సబ్జెక్టులకు ముగ్గురు నిపుణులతో చెప్పిస్తున్నాం.
అవగాహన
n గ్రూప్ -1, గ్రూప్ -2, ఎస్ఐ, కానిస్టేబుల్ , టీచర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న అంశాలతో పాటు అన్ని పరీక్షల గురించి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి? అందుకోసం ఎలాంటి మెలకువలు పాటించాలి? ప్రిపరేషన్ లో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి? అన్న వివరాలను అందిస్తున్నాం. అలాగే అబ్జెక్టివ్ , వ్యాసరూప ప్రశ్నలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? సమాధానాలు రాసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి విషయాల కోసం విజేతల అనుభవాలను అందిస్తున్నాం. వీలైనంత త్వరలో గ్రూప్ -1 పరీక్షల లైవ్ పాఠాలను ప్రసారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
తెలుగు మీడియం
# రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, నిరుపేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగలంతా దాదాపు తెలుగు మీడియంలో చదువుకున్న వారే ఉంటారు. అందుకనుగుణంగానే తెలుగు మీడియంలోనే పాఠాలు బోధిస్తున్నాం. ఇంగ్లిష్ లో కూడా కొన్నిసార్లు పరీక్షలకు సంబంధించిన పాఠాలు ప్రసారం చేస్తున్నాం.
అందుబాటులో 2,462 వీడియోలు
# టీ-శాట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటు ప్రవేశ పరీక్షలు, స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన 10వ తరగతి వరకు అన్ని రకాలు కలిపి దాదాపు 2,462 వరకు డిజిటల్ వీడియో పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో ఎంసెట్ కోసం 500, గురుకుల పరీక్షల కోసం 294, గతంలో నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షల కోసం 213, టీచర్ రిక్రూట్ మెంట్ కోసం 613, ఫారెస్ట్ ఉద్యోగాల కోసం 113, ఇంగ్లిష్ ఫర్ ఆల్ కోసం 86, ఆర్ ఆర్ బీ రైల్వే ఉద్యోగాల కోసం 67, టీఎస్ఆర్ జేసీ కోసం 54, కరెంట్ అఫైర్స్ కోసం 264 ఉన్నాయి.
ప్రతి వారం కరెంట్ అఫైర్స్
# గ్రూప్ -1, గ్రూప్ -2తో పాటు పోలీస్, టీచర్ , వైద్యారోగ్య శాఖలో పోస్టులు ఇలా ఏ ఉద్యోగ పరీక్షలకయినా పనికొచ్చే కరెంట్ అఫైర్స్‌తో ప్రతి వారం లైవ్ పాఠాలు అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్‌ను జీకేగా కూడా ఉపయోగించుకునే విధంగా చూస్తున్నాం.
టెట్ పాఠాలు
# టీ-శాట్ ద్వారా ప్రస్తుతం టెట్ కు సంబంధించిన పాఠాలు అందిస్తున్నాం. పరీక్షకు ఐదు రోజుల ముందు వరకు టెట్ పాఠాలు ప్రసారం చేస్తాం. ఆ తర్వాత టీచర్ పోస్టుల కోసం లైవ్ పాఠాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
…సురేష్ బాబు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం