దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
ఆర్థిక మార్పిడిలలో ప్రవాహాలు
- దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు
- 20వ శతాబ్దం చివరలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల్లో ప్రపంచీకరణ ఒకటి
- సేవారంగంలో కాల్‌సెంటర్ ఉద్యోగావకాశాలు ఏర్పడటం ప్రపంచీకరణ ఫలితమే
- అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో మూడు రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు
- 1. శ్రమ ప్రవాహం – ఉపాధిని వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లడం
2. వస్తు సేవల ప్రవాహం – వస్తువులు, సేవలు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం
3. పెట్టుబడి ప్రవాహం – స్వల్పకాల, దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడం - ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలున్నాయి.
ఉదాహరణకు- అరబ్ వసంతం
- పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలోని ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాల్లో నియంతలను తొలగించడానికి జరిగిన విప్లవాలకే అరబ్ వసంతమని పేరు.
- ఈ ఉద్యమంలో ప్రసార మాధ్యమాలు ముఖ్యపాత్ర పోషించాయి. ఇతర దేశాల యాజమాన్యాలు నిర్వహించే టీవీ చానళ్లు ప్రజలకు మద్దతునిచ్చాయి.
- పౌర యుద్ధం, సునామీ వంటి అంశాలు జాతీయ సరిహద్దుకు లోబడి ఉన్నప్పటికీ వాటికి ప్రపంచ నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది.
- ప్రపంచీకరణ కేవలం మార్కెట్‌కే పరిమితం కాలేదు, ఆలోచనలు, భావాలు కూడా పంచుకోటానికి, వాటిని విస్తృతపరచటంలోనూ దీని ప్రభావం ఉంది.
పలు దేశాల్లో ఉత్పత్తి – బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ)
- 20వ శతాబ్దం వరకు ఉత్పత్తి ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవారు.
- ముడి సరుకులు, ఆహారధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులు దాటి వెళ్లేవి.
- ఉదాహరణకు భారతదేశం వంటి వలస దేశాలు ముడి సరుకు, ఆహార ధాన్యాలు ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి. దూర దేశాలను కలపటానికి వాణిజ్యం ప్రధాన మార్గంగా ఉండేది.
- బహుళజాతి సంస్థల (MNC) ప్రవేశంతో ఈ పరిస్థితి మారిపోయింది. ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే సంస్థలను బహుళ జాతి సంస్థలు అంటారు.
- ఇవి ఉత్పత్తి ఖర్చులను తగ్గించటానికి కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాల్లో ఉత్పత్తి కర్మాగారాలను, కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయి.
- బహుళజాతి సంస్థలు తమ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించటమే కాకుండా వస్తు సేవల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేస్తాయి.
- ఉత్పత్తి ప్రక్రియను అనేక చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పటుచోట్ల చేపడతాయి.
- పారిశ్రామిక వస్తువులను తయారు చేసే ఒక బహుళ జాతి కంపెనీ తన ఉత్పత్తిని కింది విధంగా వ్యవస్థీకరిస్తుంది.
- ఈ విధంగా ఉత్పత్తి విభజించి అనేక చోట్ల చేపట్టడం వల్ల బహుళ జాతి సంస్థలకు ఖర్చులో 50-60 శాతం ఆదా అవుతుంది.
దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయడం
- బహుళజాతి సంస్థలు ఉత్పత్తి ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు
1. మార్కెట్లకు దగ్గరగా ఉండటం
2. తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికులు లభించడం
3. ఇతర ఉత్పత్తికారకాలు లభించడం
4. తమ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వ విధానాలుండటం - భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల కోసం బహుళ జాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు.
- కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటినే జాయింట్ వెంచర్లు అంటారు.
- చాలా సందర్భాల్లో బహుళజాతి పెట్టుబడులు స్థానిక కంపెనీలను కొనుగోలు చేసి ఉత్పత్తిని విస్తరిస్తాయి.
- చిన్న ఉత్పిత్తిదారులకు చెల్లించే ధర, నాణ్యత, సరుకు అందించే సమయం, నాణ్యత, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం బహుళ జాతి సంస్థలకు ఉంది.
- విదేశీ వాణిజ్యం, మార్కెట్ల అనుసంధానం
- ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది.
- కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి.
- అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాల్లోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది
- చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేశారు. కొత్త డిజైన్లు తక్కువ ధర వల్ల ఇవి ఆదరణ పొందాయి.
- ఒక ఏడాదిలోనే భారతీయ దుకాణాల్లో 70-80 శాతం భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలు విక్రయించారు.
- దీనివల్ల భారతీయ బొమ్మల ఉత్పత్తిదారులు నష్టపోయారు.
బహుళజాతి కంపెనీలు, ప్రపంచీకరణ
- ఈస్టిండియా వంటి కంపెనీ భారతదేశానికి వాణిజ్య ప్రయోజనాల కోసం వచ్చింది.
- విదేశీ వాణిజ్యంలో అధిక భాగాన్ని బహుళ జాతి సంస్థలు నియంత్రిస్తున్నాయి.
- అధిక విదేశీ పెట్టుబడులు, అధిక విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది.
- వేగంగా పెరుగుతున్న ఈ దేశాల అనుసంధానం, అంతఃసంబంధాలే ప్రపంచీకరణ
- పెట్టుబడి, ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది.
- ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు.
ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలు
ఎ) సాంకేతిక పరిజ్ఞానం
- ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం
- టెలీ కమ్యూనికేషన్ సేవల (టెలిఫోన్, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్) వల్ల మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించవచ్చు. ఉపగ్రహాల ప్రసార సాధనాల వల్ల ఇవి సాధించవచ్చు.
- కంప్యూటర్, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా నామ మాత్రపు ఖర్చుతో ఎలక్ట్రానిక్ మెయిల్ పంపించవచ్చు.
- లండన్‌లో ప్రచురించే ఒక వార్తాపత్రిక అంశాలు ఇంటర్నెట్ ద్వారా ఢిల్లీలోని కార్యాలయానికి పంపితే వారు దాన్ని డిజైన్ చేసి ముద్రిస్తారు.
- ముద్రించిన పత్రికలను విమానం ద్వారా లండన్ పంపుతారు. దీనికి అయ్యే ఖర్చును లండన్‌లో బ్యాంక్ నుంచి ఢిల్లీలోని బ్యాంక్ ఇంటర్నెట్ (ఈ-బ్యాంకింగ్) ద్వారా తక్షణమే పంపుతారు.
బి) విదేశీ విణిజ్యం, విదేశీ పెట్టుబడుల
విధానాల సరళీకరణ
- వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి, నియంత్రించడానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాలు ఉపయోగించవచ్చు.
- ఎటువంటి దిగుమతులు అనుమతించాలి, ఎంత మొత్తంలో అనుమతించాలి వంటివి ప్రభుత్వం నిర్ణయించవచ్చు.
- ఉదాహరణకు భారతదేశం.. చైనా బొమ్మల దిగుమతులపై పన్ను విధిస్తే, పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాలి. దీని వల్ల చైనా నుంచి దిగుమతులు తగ్గి భారతీయ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు.
- దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీన్ని కోటాలు అంటారు.
- స్వాతంత్య్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించి దేశంలోని ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించింది.
- 1950-60ల్లో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే భారతీయ పరిశ్రమలు నిలదొక్కుకొని ఉండేవి కావు.
- అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
- అభివృద్ధి చెందిన దేశాలు అవి అభివృద్ధి చెందుతున్న దశలో తమ దేశ ఉత్పత్తిదారులకు ఏదో ఒకవిధంగా రక్షణ కల్పించాయి.
ప్రపంచీకరణ
- దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియ ప్రపంచీకరణ
- తమ సరిహద్దులు దాటి వస్తుసేవల అంతర్జాతీయ మూలధన ప్రవాహం సాంకేతిక వ్యాప్తి ద్వారా అంతర్గత సంబంధంతో అంతర్జాతీయ వ్యాపార పరిమాణాన్ని పెంపొందించుకునే విధానం ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థ నిర్వచించింది.
- అభివృద్ధి చెందిన దేశాల్లో అధికోత్పత్తి, అధిక స్థాపిత శక్తి మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలతో సంపూర్ణంగా వినియోగించుకున్న మార్కెట్లు బహుళ జాతి సంస్థలకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ
- ప్రపంచంలో అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను ప్రపంచ పరిపాలనా సంస్థలు తీసుకుంటున్నాయి.
- మొదట కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయాన్ని ఆయా దేశాలకు వదిలిపెట్టారు.
- కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒక దేశం ప్రయత్నిస్తే పరిశ్రమలు వేరే దేశానికి తరలిపోయాయి.
- ఇటువంటి అంశాలను అన్ని దేశాలు కలిసి పరిష్కరించుకోవాలి.
- అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఒకటి.
- ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా(స్విస్)లో ఉంది.
- అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంధించిన నియమాలను రూపొందించి, అవి పాటించేలా చూస్తుంది.
- ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 181 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి.
- ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి.
- కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్య అవరోధాలను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నది.
ఉదాహరణ- (బాక్స్‌లో)
- అమెరికాలో వ్యవసాయ ప్రాధాన్యత జీడీపీలో వ్యవసాయం వాటా – 1శాతం
- ఉపాధిలో వ్యవసాయం వాటా – 0.5 శాతం
- వ్యవసాయంలో ఉన్న కొద్దిమంది కోసం అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు సబ్సిడీల రూపంలో కేటాయిస్తుంది.
- ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో విక్రయిస్తున్నారు.
- ఇది ఆయా దేశాల రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈవిధంగా అమెరికా స్వేఛ్చా, న్యాయ వాణిజ్యానికి తూట్లు పొడుస్తుంది.
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
Previous article
కణ బాహ్య జీర్ణక్రియ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు