Career Guidance | సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్
కెరీర్ గైడెన్స్
దశాబ్దాలుగా క్రేజ్ తగ్గని పరీక్ష సివిల్ సర్వీసెస్. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎగ్జామ్‌గా పేరుగాంచింది. తీవ్రమైన పోటీగల ఈ పరీక్షలో విజేతలను వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా.. దేశంలో అత్యున్నతమైనవిగా భావించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మే 23న సివిల్స్ -2022 తుది ఫలితాలను యూపీఎస్సీవిడుదల చేసింది. పరీక్ష స్వభావం, ర్యాంకర్లు సాధించిన మార్కుల వివరాలు నిపుణ పాఠకుల కోసం….
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్
దేశంలో అత్యున్నత పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్ష ఇది. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. జాతీయ స్థాయిలో లక్షలమంది ఈ పోస్టులకు పోటీపడుతుంటారు.
- సివిల్స్-2022 ప్రత్యేకతలు పరిశీలిస్తే 933 పోస్టుల్లో 320 మంది మహిళా అభ్యర్థులు అంటే సుమారు 34.2 శాతం మంది సర్వీస్‌లను సాధించారు.
- గత 2021 సివిల్స్‌లో 23.9 శాతం మంది మహిళలు సర్వీస్ సాధించారు. 2020లో 23.8 శాతం, 2019లో 23.9 శాతం మహిళలు సర్వీస్‌లను సాధించడం విశేషం.
- ఈ ఏడాది టాప్ 25 మందిలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు.
ఏయే పోస్టుల కోసం ..?
- ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసెస్ పోస్టుల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తారు.
- సివిల్స్ -2022 ఎగ్జామ్ ద్వారా 1022 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. అయితే ప్రస్తుతం 933 అభ్యర్థుల ర్యాంకుల వివరాలను యూపీఎస్సీ విడుదల చేసింది.
- మొత్తం 933 మందిలో 345 మంది జనరల్ కోటాలో, 99 మంది ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-263, ఎస్సీ-154, ఎస్టీ-72 మంది ఎంపికయ్యారు.
యాభై శాతం వస్తే టాపరే !
అత్యంత క్లిష్టమైన పరీక్షగా పేరుగాంచిన ఈ పరీక్షలో ప్రిలిమ్స్ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మెయిన్స్ ఎగ్జామ్ 1750 మార్కులు. పర్సనాలిటీ టెస్ట్‌కు 275 మార్కులు. అంటే మెయిన్స్+ పర్సనాలిటీ టెస్ట్ మార్కులు 2025.
- ఈసారి యూపీఎస్సీ విడుదల చేసిన టాపర్ మార్కుల వివరాలను పరిశీలిస్తే 2025 మార్కులకు 1094 (మెయిన్స్‌లో 901+ ఇంటర్వ్యూ 193) మార్కులు సాధించిన ఇషితా కిషోర్ మొదటి ర్యాంక్ సాధించింది. అదేవిధంగా రెండో ర్యాంక్ సాధించిన గరిమా లోహియాకు 1063, మూడోర్యాంకర్ ఉమా హారతికి 1060, నాలుగో ర్యాంకర్‌కు 1055, ఐదోర్యాంకర్కు 1054 మార్కులు వచ్చాయి.
టాపర్స్ ఆప్షనల్స్ ఇవే !
- సివిల్స్ విజయంలో ప్రతి పేపర్ చాలా కీలకం. దీనిలో ఆప్షనల్ సబ్జెక్టు మరింత కీలకం. సరైన ఆప్షనల్ ఎంపిక చేసుకోకుంటే విజయం సాధించడం కష్టం. కేవలం ఆప్షనల్లో సరిగా మార్కులు రాక ఎంతోమంది సర్వీస్‌లు సాధించలేకపోయారు. కొన్ని సబ్జెక్టులు క్రేజీ ఆప్షనల్స్‌గా పేరుగాంచాయి. వీటిలో పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ. వీటిని సైన్స్, ఇంజినీరింగ్ ఇలా గ్రాడ్యుయేషన్‌లో తీసుకున్న బ్రాంచ్‌కు సంబంధం లేకుండా అందరూ తీసుకుంటారు. దీనికి ప్రధాన కారణం మెటీరియల్ అందుబాటులో ఉండటం, సులభంగా సిలబస్‌ను సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం, కోచింగ్/మెంటార్స్ అందుబాటులో ఉండటం తదితర కారణాలు ఉన్నాయి. మరికొంతమంది డిగ్రీ/పీజీలో తాము చదివిన ప్రధాన సబ్జెక్టులనే ఆప్షనల్‌గా తీసుకుని విజయం సాధిస్తున్నారు.
- గత కొన్నేండ్లుగా మ్యాథ్స్, ఆంత్రోపాలజీ ఆప్షనల్స్ తీసుకున్నవారు ఎక్కువ స్కోర్ చేస్తుండటం గమనార్హం.
- తెలుగు రాష్ర్టాలకు చెందిన అభ్యర్థులు తెలుగు ఆప్షనల్స్‌గా తీసుకుని గతంలో చాలామంది విజయం సాధించారు.
- ఈసారి సివిల్స్-2022లో టాప్ ర్యాంక్‌లు సాధించిన వారి ఆప్షనల్స్ పరిశీలిస్తే మొదటి ర్యాంకర్ పొలిటికల్ సైన్స్- ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్‌గా తీసుకుంది. రెండో ర్యాంకర్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ, మూడో ర్యాంకర్ ఆంత్రోపాలజీ, నాల్గో ర్యాంకర్ జువాలజీ.
- గతేడాది 2021 సివిల్స్‌లో టాప్ పది ర్యాంకర్ల ఆప్షనల్స్ పరిశీలిస్తే… హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (పీఎస్ఐఆర్), సోషియాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ తీసుకుని విజయాన్ని సాధించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం