Career Guidance for Civil Engineering | సివిల్ ఇంజనీరింగ్‌లో కెరీర్
సివిల్
- సివిల్ ఇంజినీరింగ్ అనేది ఇంజినీరింగ్‌లో మొదట ప్రారంభమైన విభాగం. తెలుగులో దీన్ని పూరావస్తుశాస్త్రం అంటారు. సమాజానికి ఉపయోగపడే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్, డిజైన్స్, మెటీరియల్స్, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, వాటర్ పైప్‌లైన్స్ వంటివన్నీ సివిల్ ఇంజినీరింగ్లోకే వస్తాయి.
ఏం ఉంటాయి?
- రోడ్ డిజైనింగ్, వాటర్ డ్యాం డిజైన్, రైల్వే ట్రాక్ డిజైన్, ఫ్యాక్టరీ డిజైన్, ఆకాశహర్మ్యాల నిర్మాణం వంటివి సివిల్ ఇంజినీరింగ్‌లో భాగాలే.
- అలాగే ఇందులో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇంజినీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజినీరింగ్, జియో టెక్నికల్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సివిల్ ఇంజినీరింగ్‌లో నేర్చుకునే అంశాలు.
మాస్టర్స్ - సివిల్‌లో మాస్టర్స్ చేయవచ్చు. ఎంటెక్‌లో (ట్రాన్స్‌పోర్టేషన్, స్ట్రక్చర్స్ మొదలైన వాటిలో) నచ్చిన స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్‌డిసిప్లినరీ సివిల్ విత్ మెకానికల్ వంటి విద్యలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి పూర్తి చేసుకున్నాక ఎంఏ, ఎంకాం కూడా చేయవచ్చు.
- జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ మొదలైనవాటిలో నచ్చిన సబ్జెక్ట్ పై పీజీ తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజీలో రాకుండా బీటెక్‌లో సివిల్ చేసినప్పటికీ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంటెక్‌లో సివిల్ మాత్రమే చేయాలని లేదు ఎంటెక్‌లో మెకానికల్, కంప్యూటర్స్, ఈసీఈ ఇలా నచ్చిన బ్రాంచీని ఎంటెక్‌లో తీసుకునే సౌలభ్యం ఉంది.
అవకాశాలు పుష్కలం - సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. టీసీఎస్, అల్ట్రా టెక్ సిమెంట్ వంటి ప్రైవేట్ సంస్థల్లో బీటెక్‌తోనే తీసుకుంటున్నారు. సివిల్ కూడా మెకానికల్ లాగా కోర్ సబ్జెక్ట్/కోర్ బ్రాంచీ. ఇది ఎప్పటికీ విలువ తగ్గనిది. ప్రస్తుతం మ్యాన్‌పవర్ మొత్తం ఐటీ రంగంలోకి వెళ్తున్నందున ఈ రంగంలో కొరత ఏర్పడుతుంది. సివిల్ ఇంజినీరింగ్ చేసిన వారు కాస్త ఓపికతో నైపుణ్యాన్ని, అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఆలస్యంగానయినా మంచి జీవితాన్ని పొందుతారు. ఎక్కువమంది ఈ విషయంలో అవగాహన పెంచుకోకుండా వెంటనే సంపాదించాలనే ఆలోచనతో ఈ ఫీల్డ్‌లో అవకాశం రాదని, ఎక్కువ శ్రమించినా ఫలితం ఉండదని అపోహపడుతుంటారు. కానీ కష్టపడి, ఓపికతో నేర్చుకున్నవారికి ఆ అనుభవం ఈ ఫీల్డ్‌లో ఉన్నంతవరకు ఉపయోగపడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం