Career Guidance for Mechanical Engineering | మెకానికల్ ఇంజనీరింగ్‌లో కెరీర్
మెకానికల్
- ఇది ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఎందుకంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటివి కోర్ బ్రాంచీలు. నేడు ఐటీ రంగం బూం ఉంది. ఒక సమయంలో దాని విలువ తగ్గింది. మళ్లీ పెరిగింది. కానీ మెకానికల్ వంటి బ్రాంచీల స్థాయి అలానే ఉంటుంది. ఉదాహరణకు రోబోటిక్స్ రంగం తీసుకుంటే రోబోను తయారుచేయాలంటే మెకానికల్ వారు తప్పనిసరి.
అంశాలు
- మూడు రకాల అంశాలుంటాయి.
1. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్, మెటల్స్ నుంచి వస్తువుల తయారీ, వాహనాల్లో ఉపయోగించే ఇంజిన్ తయారీ, కార్ షీట్ తయారీ, డ్రిల్లింగ్ నేర్చుకుంటారు.
2. థర్మల్ తయారుచేసిన ఇంజిన్ పెట్రోల్‌తో లేదంటే డీజిల్‌తో నడుస్తుందా? వంటి అంశాలను దీనిలో నేర్చుకుంటారు.
3. డిజైన్ ఇందులో కారు బాడీ తయారీలో ఎటువంటి డిజైన్ ఉండాలి, ఇంజిన్ బ్లాక్ డిజైనింగ్ వంటివి నేర్చుకుంటారు.
ఎవరు ఎంచుకోవాలి? - మెకానికల్ ఫీల్డ్ పై కనీస అవగాహన, నేర్చుకోవాలనే ఉత్సుకత ఉన్నవారు. ఫిజికల్‌గా, స్వయంగా ఫీల్డ్‌లో ఉండాల్సిన వృత్తి ఇది. కచ్చితంగా ఇండస్ట్రీకి వెళ్లి మెషిన్ పనితీరును గమనించాలి. కాబట్టి దానికి సిద్ధపడి ఉండాలి. అలాంటి వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
ఉన్నత విద్య? - బీటెక్ పూర్తయిన తర్వాత కొంతమంది ఎంఎస్ కోసం దేశంలోని ఉన్నత కళాశాలలకు, మరికొంతమంది విదేశాలకు వెళ్తుంటారు. అదేవిధంగా పీజీ సెట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలతో ఎంటెక్ కూడా చేయవచ్చు.
భవిష్యత్తు - ఎంటెక్ చేసినవారికి రీసెర్చ్ రంగంలో, డీఆర్డీవోలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవేకాకుండా క్యాడ్ వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఏదైనా ఒక మెషిన్‌ను, ఇంజిన్‌ను డిజిటల్‌గా రూపుదిద్దడం వంటి వాటికోసం చాలామంది సాఫ్ట్‌వేర్‌లో చేరుతున్నారు. అలాగే కోర్ జాబ్స్ అంటే బీహెచ్ఈఎల్, డీఆర్డీవో, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీస్, ఐవోసీఎల్, బీసీసీఎల్ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
- పబ్లిక్ సెక్టార్ వారు ఉద్యోగిని ఎంపిక చేసే క్రమంలో ప్రత్యేక టెస్ట్‌లను నిర్వహించకుండా ‘గేట్’నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి గేట్లో మంచి ర్యాంకును సంపాదించినవారికి తప్పక స్టేట్ కాని, సెంట్రల్ గవర్నమెంట్‌కు సంబంధించిన పెద్ద కంపెనీల్లో ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది.
- రాష్ట్రంలో ఆటోమొబైల్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్, కెమికల్ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
Previous article
Career Guidance for Civil Engineering | సివిల్ ఇంజనీరింగ్‌లో కెరీర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం