Career Guidance for EEE Engineering Course | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కెరీర్
ఈఈఈ
ఈఈఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. ఇది యూనివర్సల్ గ్రూప్‌గా పరిగణించాలి. పదేండ్లు గడిచినప్పటికీ అధునాతన కోర్సులతో పోటీపడుతూ ముందుకుసాగిపోతుంది. ఈఈఈలో బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత విభిన్న దారులను ఎంచుకొనే సౌలభ్యం ఉంది. ఎలక్ట్రికల్స్‌లో గాని, ఎలక్ట్రానిక్స్‌లో గాని స్థిరపడవచ్చు.
ఏ అంశాలు నేర్చుకుంటారు?
- రియల్‌టైం అప్లికేషన్స్ అయిన పవర్ సిస్టమ్స్‌కు సంబంధించి ప్రోగ్రామ్స్ రాయాలి. ఉదాహరణకు రామగుండం విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ద్వారా హైదరాబాద్ సబ్‌స్టేషన్‌కు తీసుకొస్తారు. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే సమస్య ఎక్కడ ఉంది? ఏ సబ్‌స్టేషన్‌లో ఎంత ఓల్టేజ్ ఉంది? వంటి వాటిని మానిటర్ చేసి, తగిన పరిష్కారానికి సాఫ్ట్‌వేర్స్‌ను స్కాడార్ సెంటర్స్‌లో తయారు చేస్తారు. ఎలక్ట్రికల్ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, మోటార్స్ వాటి పనితీరు, ఉపయోగాలు గుర్తించి తెలుసుకుంటారు. ఈ రంగానికి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అనేవి ప్రధానం. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పై మూడింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వీటితో పాటు కంట్రోల్స్ అనే అంశాన్ని నేర్చుకోవాలి. దీనివల్ల రియల్‌టైంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఏవిధంగా కంట్రోల్ చేయాలి? అనేదాని కోసం పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్టులను కూడా నేర్చుకోవాలి. ఒక మెషిన్ రియల్‌టైంలో ఏవిధంగా పనిచేస్తుందో దాని పనితీరును తెలుసుకోవడానికి ముందుగానే సాఫ్ట్‌వేర్‌లో సిమ్యులేట్ చేసి సర్క్యూట్స్‌తో టెస్ట్ చేయవచ్చు. దీనివల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. రెసిస్టెన్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ వంటి విభిన్న కాంపొనెంట్స్ గురించి నాలుగేండ్ల కోర్సులో నేర్చుకుంటారు.
ఉన్నత విద్య? - మెషిన్స్‌లో గాని, పవర్ సిస్టమ్స్‌లో గాని, కంట్రోల్స్‌లో గాని, లేటెస్ట్గా వచ్చిన నాన్ కన్వెన్షనల్ (సోలార్ విద్యుత్ వంటివి)లో గాని ఆసక్తిని బట్టి పీజీ చేయవచ్చు.
ఉద్యోగావకాశాలు? - రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులతో పాటు పవర్ జనరేషన్ సెక్టార్లో ఎన్నో అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉద్యోగ కొరత ఎప్పటికీ ఉండదు. జనాభా పెరిగేకొద్దీ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. తదనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కూడా పెరగాలి. అందుకు తగినట్టుగానే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తులో కన్వెన్షనల్ పవర్ సెక్టార్స్ కనుమరుగైనా సోలార్, విండ్ పవర్ సెక్టార్లో అయినా ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి.
Previous article
Career Guidance For Engineering | బ్రాంచీలు భళా.. ఎంపిక ఇలా!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం