IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
జామ్-2024
జాతీయస్థాయిలో పేరుగాంచిన పలు విద్యాసంస్థల్లో మాస్టర్స్ (పోస్టు గ్రాడ్యుయేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జామ్ ప్రకటన విడుదలైంది. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీల్లో మాస్టర్స్, ఎమ్మెస్సీ -పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ టెస్ట్ ద్వారా కల్పిస్తారు. జామ్-2024 నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా…
జామ్ (Joint Admission Test)
- జాయింట్ అడ్మిషన్ టెస్ట్. ఈ పరీక్షను ఐఐటీల్లో ఎమ్మెస్సీ, పీహెచ్డీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్షను 2004-05 నుంచి ఐఐటీలు జామ్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్ ద్వారా ఎమ్మెస్సీ (రెండేండ్లు), ఎమ్మెస్సీ (టెక్), ఎంఎస్ (రీసెర్చ్), ఎమ్మెస్సీ-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ ఇతర పోస్ట్-బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
- యూజీ లెవల్ సైన్స్ ఎడ్యుకేషన్‌కు జామ్ బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు.
- సీట్ల సంఖ్య: ఐఐటీల్లో సుమారు 3000 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు ఎన్ఐటీలు, ఐసర్, ఐఐఎస్ఈటీ తదితర సంస్థల్లో సుమారు 2000 వరకు సీట్లు ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జమ్మూ, జోధ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, మండి, పాలక్కడ్, పట్నా, రూర్కీ, రోపర్, తిరుపతి, వారణాసి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.
నోట్: పై విద్యా సంస్థలతో పాటు నిట్, శిబ్‌పూర్‌లోని ఐఐఈఎస్టీ, పంజాబ్‌లోని ఎస్‌ఎల్‌ఐఈటీ, ఐఐఎస్ఈఆర్ (ఐసర్)లు జామ్ స్కోర్ ఆధారంగా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ (టెక్) ప్రవేశాలు కల్పిస్తాయి. దీని కోసం సీసీఎంఎన్ ద్వారా కామన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
నోట్: జామ్ -2024ను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తుంది.
పరీక్ష విధానం
- ఏడు సబ్జెక్టుల్లో దీన్ని నిర్వహించనున్నారు. వీటిని టెస్ట్ పేపర్లుగా పిలుస్తారు. బయోటెక్నాలజీ (బీటీ), కెమిస్ట్రీ (సీవై), ఎకనామిక్స్ (ఈఎన్), జియాలజీ (జీజీ), మ్యాథమెటిక్స్ (ఎంఏ), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్), ఫిజిక్స్ (పీహెచ్).
- జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తారు.
- పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో మల్టిపుల్ చాయిస్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్
(ఎంఎస్క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. - పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు
- మొత్తం 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది
ఎవరు రాయవచ్చు ?
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా తత్సమానమైన సీజీపీఏ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
- ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
- వయస్సు: ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు
పరీక్ష విధానం
- మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
- అభ్యర్థులు ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్లను రాసుకోవచ్చు
- అయితే అవి పరీక్ష షెడ్యూల్లో అనుమతించిన విధంగా ఎంపిక చేసుకోవాలి.
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 13
అడ్మిట్ కార్డులు: 2024, జనవరి 8 నుంచి
అందుబాటులో ఉంటాయి
పరీక్షతేదీ: 2024 ఫిబ్రవరి 11
ఫలితాల వెల్లడి: 2024, మార్చి 22
వెబ్సైట్: https://jam.iitm.ac.in
పూర్తి వివరాల కోసం
కాంటాక్ట్ నంబర్: (044) 2257 8200
ఈ-మెయిల్ ఐడీ: jam@iitm.ac.in
చిరునామా
The Chairperson, JAM 2024
GATE – JAM Office,
IIT Madras, Chennai,
Tamil Nadu – 600036.
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?