Current Affairs – International | అంతర్జాతీయం
ఇంటర్నేషనల్ మిలిటరీ ఫోరం
రష్యాలోని మాస్కోలో 9వ ఇంటర్నేషనల్ మిలిటరీ-టెక్నికల్ ఫోరం ఆర్మీ-2023ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 14న ప్రారంభించారు. ఆగస్టు 20 వరకు నిర్వహించిన ఈ ఆర్మీ-2023లో 82 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం, చైనా, ఇరాన్ పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. భారత పెవిలియన్‌ను రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు సమక్షంలో రష్యాలోని భారత రాయబారి పవన్ కపూర్ ప్రారంభించారు.
చైనా లేజర్
చైనా సైంటిస్టులు లేజర్ ఆయుధాలు వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త కూలింగ్ వ్యవస్థను కనుగొన్నట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఆగస్టు 14న కథనాన్ని ప్రచురించింది. చైనా, చెంగ్డూలోని ‘నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ’ సైంటిస్టులు అభివృద్ధి చేసిన కొత్త కూలింగ్ వ్యవస్థతో లేజర్ ఆయుధాలు నిరవధికంగా కాల్పులు జరిపే సామర్థ్యం సొంతం చేసుకోనున్నాయి. రోదసీలో తిరిగే గ్రహాలను వీటితో కూల్చవచ్చు. సాధారణ లేజర్ వ్యవస్థ 5-10 కి.మీ. పరిధి ఉంటే చైనా కొత్త లేజర్ నిర్విరామంగా ఎంత దూరమైనా ప్రయాణిస్తుందని ఆ దేశ సైంటిస్టులు పేర్కొన్నారు. సాధారణ లేజర్ పవర్ 100 కిలోవాట్స్ ఉంటే, చైనా కొత్త లేజర్ పవర్ కనిష్ఠంగా 10,000 కిలోవాట్స్ ఉంటుంది.
చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్
ఇండో-పసిఫిక్ చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ (సీహెచ్‌వోడీ) కాన్ఫరెన్స్‌ను ఆగస్టు 14 నుంచి 16 వరకు ఫిజీలోని నడిలో నిర్వహించారు. ఇది 25వ వార్షిక సమావేశాన్ని ‘ప్రిజర్వింగ్ ది రూల్స్-బేస్డ్ ఆర్డర్ టు ఎనేబుల్ సావెర్నిటీ ఇన్ యాన్ ఎరా ఆఫ్ స్ట్రాటజిక్ కాంపిటీషన్’ థీమ్‌తో చేపట్టారు. ది రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ మిలిటరీ ఫోర్సెస్, యునైటెడ్ స్టేట్స్ ఇండో-పసిఫిక్ కమాండ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి 27 దేశాల డిఫెన్స్ చీఫ్‌లు హాజరయ్యారు. పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సైనిక దళాల చీఫ్‌లను ఒక చోట చేర్చి చర్చించేందుకు ఈ కాన్ఫరెన్స్‌ను 1998 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.
మైసీ గెలాక్సీ
గతేడాది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ)ను ఉపయోగించి కనుగొన్న ‘మైసీ గెలాక్సీ’ ఇప్పటి వరకు వెలుగు చూసిన గెలాక్సీల్లో కెల్లా పురాతనమైంది. ఇది 390 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఖగోళ శాస్త్రవేత్త ఫింకిల్స్టెయిన్ తన కూతురు పుట్టినరోజున కనుగొన్నందున, ఈ గెలాక్సీకి తన కూతురు పేరు మైసీ అని పేరు పెట్టారు. ఈ విషయాలు జర్నల్ నేచర్‌లో ఆగస్టు 16న ప్రచురితమయ్యాయి.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?