Current Affairs – Groups Special | వార్తల్లో వ్యక్తులు
అర్షియా గోస్వామి
హర్యానాకు చెందిన 8 ఏండ్ల అర్షియా గోస్వామి 62 కేజీల బరువెత్తి 30 సెకన్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి ఆగస్టు 12న గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. జూలైలో జరిగిన టీవీ కార్యక్రమం ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో ఈమె 62 కేజీల బరువును ఎత్తి ఈ రికార్డును సృష్టించింది. ఆమె తండ్రి అవినాష్‌కుమార్ జిమ్ సెంటర్ నడుపుతున్నారు. ఆశ్రియా మొదట్లో తండ్రి వద్ద వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ తీసుకునేది. ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్ గుర్మెల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటుంది.
హనీకట్
అమెరికాలోని మిచిగాన్కు చెందిన ఎరిన్ హనీకట్ (38) అత్యంత పొడవైన గడ్డం (11.8 అంగుళాలు) కలిగిన మహిళగా ఆగస్టు 12న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలిచింది. గతంలో అమెరికాకే చెందిన వివాన్ వీలర్ అనే మహిళ పేరిట ఉన్న రికార్డు (10.04 అంగుళాలు)ను హనీకట్ అధిగమించారు. ఆమెకు 13 ఏండ్ల నుంచే గడ్డం రావడం ప్రారంభమైంది. వీటిని తొలగించేందుకు లేపనాలు వాడినా ప్రయోజనం లేకపోయింది. కొన్నాళ్ల తర్వాత బీపీతో పాక్షికంగా దృష్టిని, బ్యాక్టీరియా సోకి ఓ కాలును కూడా కోల్పోయారు. దీంతో అప్పటి నుంచి షేవ్ చేయడం, లేపనాలు వాడటం మానేసింది.
పర్మిందర్ చోప్రా
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా పర్మిందర్ చోప్రాను కేంద్రం ఆగస్టు 14న నియమించింది. దీంతో ఆమె నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లలోని ఒక సంస్థకు సీఎండీగా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. పీఎఫ్‌సీలో ఆమె జూన్ 1 నుంచి అదనపు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. పవర్, ఫైనాన్షియల్ రంగాల్లో ఆమెకు 35 ఏండ్ల అనుభవం ఉంది.
దొరైస్వామి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామి ఆగస్టు 14న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఐపీ మినీ ఈ నెల చివర్లో పదవీ విరమణ పొందనున్నారు. దొరైస్వామి ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పని చేస్తున్నారు.
బిందేశ్వర్ పాఠక్
సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ఆగస్టు 15న ఢిల్లీలో మరణించారు. ఆయన 1943, ఏప్రిల్ 2న బీహార్‌లోని వైశాలి జిల్లా రాంపూర్ బఘేల్లో జన్మించారు. శానిటేషన్ శాంటాక్లజ్గా పేరొందిన ఆయన 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. సఫాయీ కర్మచారీల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పునకు, పర్యావరణ పరిశుభ్రత, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం వంటి అంశాల్లో చేసిన కృషికి ఆయనకు అనేక అవార్డులు లభించాయి. 1991లో పద్మ భూషణ్ లభించింది. 2009లో ది స్టాక్ హోం వాటర్ ప్రైజ్ దక్కింది. ఎనర్జీ గ్లోబ్ అవార్డ్, దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్, ది లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డులు లభించాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?