NITHM Hyderabad | అతిథి దేవోభవ!
NITHM Hyderabad | ఎవర్గ్రీన్ కెరీర్లో ఆతిథ్య రంగం ఒకటి. ప్రపంచం ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంతో ఆతిథ్య, టూరిజం రంగాలు కూడా వృద్ధి చెందుతుంటాయి. ఈ రంగంలో ఏటేటా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఆతిథ్య రంగానికి సంబంధించి జాతీయస్థాయిలో పేరుగాంచిన హైదరాబాద్‌లోని ‘నిథిమ్’ గురించి సంక్షిప్తంగా…
నిథిమ్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్)ను హైదరాబాద్‌లో 2004లో ప్రారంభించారు.
- ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
- 26 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో మూడు కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది
- జాతీయస్థాయిలో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్లకు పేరుగాంచిన ఐఐటీ, ఐఐఎం సంస్థల్లాగా టూరిజం, హాస్పిటాలిటీ కోర్సులకు పేరుగాంచినది
- అంతర్జాతీయ ప్రమాణాలతో మూడు కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది
- ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్టక్చర్, లైబ్రరీ ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి
- క్యాంపస్‌లో హాస్టల్ సౌకర్యం ఉంది.
కోర్సులు- అర్హతలు ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ) - కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు మ్యాట్ లేదా క్యాట్/ఐసెట్/ఏటీఎంఏ లేదా తత్సమాన పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. - ఎంపిక: గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
నోట్: ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు
బీబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ) - కాలవ్యవధి: నాలుగేండ్లు
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీఏటీ/ఏటీఎంఏ యూజీ, ఎంసెట్ లేదా ఎన్‌సీహెచ్‌ఎంటీ జేఈఈ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు: 22 ఏండ్లు మించరాదు. ఎస్సీ,/ఎస్టీలకు 25 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: జాతీయస్థాయిలో నిర్వహించే ఎన్‌సీహెచ్‌ఎంటీ జేఈఈ ద్వారా నిథిమ్ నిర్వహించే ఏడబ్ల్యూటీ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) - కాలవ్యవధి: మూడేండ్లు
- అర్హతలు: 10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక: ఈ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో ఎన్‌సీహెచ్‌ఎంటీ-2023 ప్రవేశ పరీక్ష జేఈఈలో అర్హత సాధించి ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎన్‌సీహెచ్‌ఎంటీ వెబ్సైట్లో చూడవచ్చు
- నోట్: ఎంబీఏ, బీబీఏ ప్రవేశాల కోసం దరఖాస్తులను నిథిమ్ వెబ్సైట్లో మార్చి నుంచి జూలై/ఆగస్టు మధ్య అందుబాటులో ఉంటాయి.
- బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ఎన్‌సీహెచ్‌ఎంటీ వెబ్సైట్ చూడవచ్చు.
ప్లేస్‌మెంట్స్
- నిథిమ్‌లో చదివిన సుమారు నాలుగువేలకు పైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు వచ్చాయి.
- ప్రధానంగా ట్రావెల్ అండ్ టూరిజం, ఎయిర్‌లైన్, ఎయిర్పోర్ట్, హోటల్, ఈవెంట్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
- క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే ప్రముఖ సంస్థలు కొన్ని.. ఎయిర్ ఏషియా, అమెజాన్, కోస్తా, సీటీఎస్, డెలాయిట్, 24 సిప్స్ సర్వీసెస్, ఎయిర్ ఇండియా, బామర్ లారీస్, ఎఫ్సీఎం ట్రావెల్స్, గూగుల్, ఐకియా, మేక్ మై ట్రిప్, మెరీడియన్, మెక్‌డొనాల్డ్, మైటీ, లియోనా, ఓయో, తాజ్ గ్రూప్, స్టార్‌బక్స్ కాఫీ, తెలంగాణ టూరిజం, టీసీఎస్, ఒబెరాయ్ గ్రూప్, ట్రెండెంట్, వరల్డ్ స్కిల్స్ తదితర సంస్థలు ఉన్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు
- చెఫ్ ట్రెయినింగ్, బేకరీ సర్వీస్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, టూర్ గైడ్స్, పంచకర్మ ఆయుర్వేద థెరపీ, ఎయిర్పోర్ట్ క్యాబిన్ క్య్రూ/గ్రౌండ్ స్టాఫ్ ట్రెయినింగ్‌ను కూడా ఈ సంస్థ అందిస్తుంది. ఈ కోర్సుల కాలవ్యవధి 3-6 నెలలు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: బీఎస్సీ కోర్సుకు ఆగస్టు 27,
బీబీఏ, ఎంబీఏ కోర్సులకు సెప్టెంబర్ 30
వెబ్సైట్: https://nithm.ac.in
కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
Previous article
Current Affairs – International | అంతర్జాతీయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు