Current Affairs TS | తెలంగాణ
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ జూన్ 22న ప్రారంభించారు. దీన్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ఏర్పాటు చేశారు. మేధా సర్వో డ్రైవల్స్, స్విస్ రైల్వే వెహికిల్స్ తయారీదారు స్టాడ్లర్ జాయింట్‌గా ఈ ఫ్యాక్టరీని స్థాపించారు.
ఆచార్య ఎన్ గోపి
ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత జూన్ 21న అందజేశారు. రూ.1,01,116 నగదుతో పాటు స్వర్ణ కంకణాన్ని తొడిగి సత్కరించారు. భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును గోపి అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 56 పుస్తకాలు రచించారు. అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాద గ్రంథాలు ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డుల పోటీల్లో ఫైనల్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నదని ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి జూన్ 22న వెల్లడించారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జూన్ 4 నుంచి 7 వరకు యూఐటీపీ గ్లోబల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎలివేటింగ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్, ఇండియాపై అందించిన నామినేషన్ ఫైనల్ లిస్ట్‌లో హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో రైల్ ఒకటిగా నిలిచింది. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ కేటగిరీ కింద వచ్చిన 500 నామినేషన్లలో షార్ట్ లిస్ట్ చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?