Telangana Staff Nurse Recruitment 2023 | టీచింగ్ దవాఖానల్లో కొత్తగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టులు.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టనున్న ఎంహెచ్ఆర్బీ
Telangana Staff Nurse Recruitment 2023 | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని టీచింగ్ దవాఖానల్లో వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు (MHRB) డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నది. ఇప్పటికే 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరికి ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో అత్యధిక శాతం డీఎంఈ పరిధిలోనే ఉన్నా యి. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నదని చెప్పారు.
పేదలకు స్పెషాలిటీ సేవలు చేరువ చేసే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని వేగంగా చేరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26 కు చేరిందని తెలిపారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?