Home
Career Guidance
Career Guidance for ECE Engineering | ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో కెరీర్
Career Guidance for ECE Engineering | ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో కెరీర్
ఈసీఈ
- ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్లు కల్పిస్తున్న విభాగం ఇది. దేశీయంగా చూస్తే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, రాడార్ కమ్యూనికేషన్లో, ఇస్రో, డీఆర్డీఎల్, ఆర్సీఐ సంస్థల్లోనే కాకుండా, మల్టీనేషన్ కంపెనీలు క్వాల్కం, ఇంటెల్ వంటి కంపెనీల్లో కూడా వీళ్లకు ఇంటర్న్‌షిప్, ఉద్యోగం రావడానికి పుష్కలమైన వనరులున్నాయి. BHEL వంటి పెద్ద కంపెనీలు ‘గేట్’ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి.
రీసెర్చ్ వైపు వెళ్లవచ్చు?
- పీజీలో నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకొని అందులో ప్రావీణ్యతను పొంది రీసెర్చింగ్వైపు కూడా వెళ్లవచ్చు. దేశంలో సాఫ్ట్వేర్ ముందంజలో ఉన్నపటికీ, హార్డ్‌వేర్ పరంగా కాస్త వెనుకంజలో ఉన్నాం. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ దేశంలో హార్డ్‌వేర్ రానున్న 5 సంవత్సరాల్లో ముందంజలోకి రావాలని ఎన్నో ప్రాజెక్టులను విద్యాసంస్థలకు, స్టార్టప్స్‌కు అందిస్తుంది. దీనివల్ల నేడు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.
దేంట్లోనైనా రాణించవచ్చు - ఈసీఈలో బీటెక్ పూర్తి చేసినవారు పూర్తిగా ఎలక్ట్రికల్ వైపే కాకుండా అలా అని పూర్తిగా కంపూటర్స్ వైపే కాకుండా మధ్యస్థంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా రాణించవచ్చు. అంటే పూర్తిగా ఐటీ రంగంలోకి వెళ్లేందుకు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఐటీ రంగంలో కాకుండా, అటు పరిశ్రమల్లో కాకుండా డివైజ్ డ్రైవ్స్ వంటి ప్రోగ్రామ్స్‌ను కేవలం ఎలక్ట్రానిక్స్ వారు మాత్రమే రాయగలరు. పూర్వం మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో ఉండేవి కావు. నేడు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలో ఎన్నో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం