SBI FLC Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 194 పోస్టులు
SBI FLC Recruitment 2023 | బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన వారికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) శుభవార్త చెప్పింది. ఎఫ్ఎల్సి కౌన్సెలర్(FLC Counsellor), ఎఫ్ఎల్సి డైరెక్టర్ (FLC Director) తదితర రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్లు, ఎస్బీఐ అసోసియేట్స్, ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులు 60 నుంచి 63 ఏండ్ల మధ్య ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 194 పోస్టులను భర్తీ చేయనుంది. షార్ట్‌లిస్టింగ్ (Shortlisting), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 194
పోస్టులు : ఎఫ్ఎల్సి కౌన్సెలర్(FLC Counsellor), ఎఫ్ఎల్సి డైరెక్టర్ (FLC Director)
అర్హతలు : ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్లు, ఎస్బీఐ అసోసియేట్స్, ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ (Smart Phone) కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్ (Shortlisting), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోట్ : ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : రూ.35000 నుంచి రూ.65000 వరకు
చివరితేదీ : జులై 06
వెబ్సైట్ : www.sbi.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?