News In Persons Current Affairs | వార్తల్లో వ్యక్తులు
రామచంద్ర గుహ
ఎలిజబెత్ లాంగ్‌ఫోర్డ్ ప్రైజ్‌ను చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ జూన్ 12న అందుకున్నారు. ఈ ప్రైజ్ రామచంద్ర గుహ రచించిన ‘రెబెల్స్ ఎగైనెస్ట్ ది రాజ్: వెస్టర్న్ ఫైటర్స్ ఫర్ ఇండియాస్ ఫ్రీడం’ పుస్తకానికి దక్కింది. ఈ ప్రైజ్ కింద ఐదు వేల పౌండ్లు (రూ.5 లక్షలు) అందుకున్నారు. ఈ పుస్తకంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఏడుగురు విదేశీయుల (నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒకరు ఐరిష్) గురించి రాశారు. వారు.. అనీ బీసెంట్, బీజీ హార్నిమన్, ఫిలిప్ స్ప్రాట్, రిచర్డ్ రాల్ఫ్ కీథన్, శామ్యూల్ స్టోక్స్, మేడ్లైన్ స్లేడ్, క్యాథరిన్ మేరీ హీల్మన్.
చక్రవర్తి
ఫోప్ (ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్‌ప్రెన్యూర్స్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన ఫార్మా అండ్ ప్యాకేజీప్రెన్యూర్ చక్రవర్తి ఏవీపీఎస్ జూన్ 12న నియమితులయ్యారు. ఇది దేశంలో రెండో అతిపెద్ద ఫార్మా డ్రగ్ తయారీదారుల రెండో అతిపెద్ద అసోసియేషన్.
దేబశ్రీ ముఖర్జీ
కేంద్ర జల్‌శక్తి శాఖ సెక్రటరీగా దేబశ్రీ ముఖర్జీ జూన్ 13న నియమితులయ్యారు. ఆమె 1991 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న పంకజ్ కుమార్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో దేబశ్రీని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
నితిన్ అగర్వాల్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డీజీ (డైరెక్టర్ జనరల్)గా నితిన్ అగర్వాల్ జూన్ 11న నియమితులయ్యారు. ఈయన 1989 బ్యాచ్ కేరళ ఐపీఎస్ అధికారి. ఈ పోస్టు 5 నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీగా పనిచేస్తున్నారు.
సిల్వియా బెర్లుస్కోని
ఇటలీ మాజీ ప్రధాని, మీడియా దిగ్గజం సిల్వియో బెర్లుస్కోని జూన్ 12న మరణించారని టెలివిజన్ నెట్వర్క్ వెల్లడించింది. ఆయన 1936లో ఇటలీలోని మిలాన్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1994లో ‘ఫోర్జా ఇటాలియా’ పార్టీని స్థాపించి, అదే ఏడాది మొదటిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 95 వరకు, 2001 నుంచి 2006 వరకు, 2008 నుంచి 2011 వరకు ఇటలీ ప్రధానిగా పనిచేశారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?