Current Affairs | ఏ రెండు దేశాల మధ్య అట్లాంటా ప్రకటన వెలువడింది?
1. బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? (3)
1) జూన్ 10 2) జూన్ 11
3) జూన్ 12 4) జూన్ 13
వివరణ: బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక రోజుగా జూన్ 12న నిర్వహిస్తారు. దీన్ని 2002లో తొలిసారి అంతర్జాతీయ కార్మిక సంస్థ తీసుకొచ్చింది. ఈ ఏడాది ఈ రోజు ఇతివృత్తం ‘అందరికీ సామాజిక న్యాయం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన’. ఈ వ్యవస్థతో వచ్చే నష్టాలను అందరికీ వివరిస్తారు. భారత రాజ్యాంగంలోని 24వ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థ అనేది వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని తెలుపుతుంది. గురుపాదస్వామి కమిటీ సూచనల మేరకు భారతదేశంలో 1986లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని చేశారు.
2. యునెస్కోలో చేరేందుకు ఇటీవల నిర్ణయించుకున్న దేశం? (4)
1) రష్యా 2) చైనా
3) ఇజ్రాయెల్ 4) అమెరికా
వివరణ: పారిస్ కేంద్రంగా యునెస్కో పనిచేస్తుంది. దీని విస్తరణ రూపం.. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, కల్చరల్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్. అంటే ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. ఇందులో అమెరికా తిరిగి చేరనుంది. పాలస్తీనా దేశానికి పరిశీలక హోదా కట్టబెట్టడాన్ని నిరసిస్తూ గతంలో ఈ సంస్థ నుంచి అమెరికా, అలాగే ఇజ్రాయెల్ కూడా 2017లో నిష్క్రమించాయి. ఇజ్రాయెల్ పట్ల వివక్ష చూపుతున్నారంటూ అప్పట్లో అమెరికా ఆరోపణలు కూడా చేసింది. యునెస్కోను 1945 నవంబర్ 16న ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ సంస్థలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో అడ్డుకొనేందుకు తిరిగి చేరాలని అమెరికా నిర్ణయించుకుంది.
3. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ‘అందరికీ ఆరోగ్యం’ అనే విభాగంలో అవార్డ్ పొందిన భారత చిత్రమేది? (3)
1) హాస్పిటల్
2) వాట్ ఇఫ్ టెంపరేచర్ రైజెస్
3) వెన్ ైక్లెమేట్ చేంజ్ టర్న్స్ వయలెంట్
4) హెల్త్ ఫర్ ఆల్
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగో సినీ ఉత్సవంలో భారత్‌కు చెందిన ‘వెన్ ైక్లెమేట్ చేంజ్ టర్న్స్ వయలెంట్’ అనే అనే సినిమా అవార్డును పొందింది. అందరికీ ఆరోగ్యం అనే కేటగిరీలో దీన్ని గెలుచుకుంది. దీనికి వందిత సహారియా దర్శకత్వం వహించారు. విజేతల్లో ఆమె ఒక్కరే భారత్‌కు చెందిన వ్యక్తి.
4. ఏ రాష్ర్టానికి 130 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది? (2)
1) గుజరాత్ 2) హిమాచల్ ప్రదేశ్
3) మణిపూర్ 4) అసోం
వివరణ: హిమాచల్ ప్రదేశ్ ఉద్యాన వన రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ 130 మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి జూన్ 8న సంతకాల ప్రక్రియ పూర్తయ్యింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు దీన్ని వినియోగిస్తారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఫిలిప్పీన్స్‌లోని మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రుణం ద్వారా వచ్చిన మొత్తంతో పంట వైవిధ్యాన్ని కూడా చేపట్టనున్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
5. మయోన్ అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? (1)
1) ఫిలిప్పీన్స్
2) ఇండోనేషియా
3) ఇటలీ
4) అమెరికా
వివరణ: మయోన్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్ దేశంలో ఉంది. ఇటీవల ఇది లావాను వెదజల్లుతుండటంతో సమీపంలోని 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ దేశపు ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం ఇది. అలాగే ఇండోనేషియాలోని అనక్ క్రాకటోవా అనే అగ్నిపర్వతం కూడా ఇటీవల బద్దలయ్యింది. ఇది మూడు కిలోమీటర్ల వరకు బూడిదను వెదజల్లింది. యూరప్‌లో అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం ఎట్నా కూడా ఇటీవల బద్దలై వార్తల్లో నిలిచింది.
6. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్-2023ని ఎవరు గెలుచుకున్నారు? (3)
1) భారత్ 2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా 4) న్యూజిలాండ్
వివరణ: 2023 ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా కొత్త రికార్డును నమోదు చేసింది. ఐసీసీ నిర్వహించే అన్ని రకాల ఫార్మాట్లలో విజేతగా నిలిచిన జట్టుగా ఆవిర్భవించింది. మొత్తం ఆస్ట్రేలియా 9 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది.
7. ఏ దేశంలో ఆహార సరఫరాను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తాత్కాలికంగా నిలిపివేసింది? (4)
1) అఫ్గానిస్థాన్ 2) యెమెన్
3) సిరియా 4) ఇథియోపియా
వివరణ: ఆఫ్రికా ఖండంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న దేశం ఇథియోపియా. 120 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశం కరువు, సంఘర్షణలతో సతమతమవుతుంది. దాదాపు 20 మిలియన్ల మందికి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆహార ధాన్యాలను అందించి సాయం చేస్తుంది. అర్హులకు ఈ ధాన్యం చేరడం లేదని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు ఇథియోపియా ప్రభుత్వ యంత్రాంగానికి తెలిపినా పట్టించుకోకపోవడంతో తాత్కాలికంగా ఆహార ధాన్యాల సరఫరాను నిలిపివేశారు.
8. భారత్‌కు చెందిన అంకుర సంస్థ ‘ఫార్మర్స్ ఫ్రెష్ జోన్’ యూఎన్వో గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఏ రాష్ర్టానికి చెందింది? (2)
1) మధ్యప్రదేశ్ 2) కేరళ
3) జార్ఖండ్ 4) ఛత్తీస్‌గఢ్
వివరణ: ‘యాక్సిలరేటేడ్ ప్రోగ్రాం’ అనే పేరుతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా 12 సంస్థలను గుర్తించింది. ఇందులో కేరళకు చెందిన ఫార్మర్స్ ఫ్రెష్ జోన్ కూడా ఉంది. కొచ్చి కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ ఇది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. కేరళ స్టార్టప్ మిషన్ అనే కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, పట్టణాల్లోని వినియోగదారులకు మధ్య వారధిగా ఈ అంకుర సంస్థ పనిచేస్తుంది. తాజాగా యూఎన్ ఎంపికయిన నేపథ్యంలో ఈ ఏడాది జూలై 24 నుంచి 26 వరకు రోమ్‌లోని ప్రపంచ ఆహార సంస్థ నిర్వహించే కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. యూఎన్ ఫుడ్ సిస్టమ్స్ సమ్మిట్ స్టాక్ టేకింగ్ మూమెంట్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరగనుంది.
9. బిపర్జాయ్ తుఫానుకు ఆ పేరు పెట్టిన దేశం? (3)
1) నేపాల్ 2) సౌదీఅరేబియా
3) బంగ్లాదేశ్ 4) యెమెన్
వివరణ: అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉష్ణ మండల తుఫాన్ బిపర్జాయ్. దీనికి ఆ పేరు పెట్టిన దేశం బంగ్లాదేశ్. బెంగాలీ భాషలో విపత్తు అని అర్థం. భారత్‌లోని గుజరాత్ తీరాన్ని ఇది తాకింది. ఇప్పటికే ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి.
10. ఏ రెండు దేశాల మధ్య ఇటీవల అట్లాంటా ప్రకటన వెలువడింది? (4)
1) అమెరికా-రష్యా
2) అమెరికా-జపాన్
3) జపాన్-యూకే
4) అమెరికా-యూకే
వివరణ: ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య తదితర రంగాల్లో భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని అమెరికా, యూకే నిర్ణయించాయి. ఈ మేరకు అట్లాంటా ప్రకటనలో ఇరుదేశాలు సంతకం చేశాయి. రెండు దేశాల మధ్య ఇన్ని అంశాలతో కూడిన తొలి ఒప్పందం ఇదే. ఆధునిక సాంకేతికతల మధ్య పరస్పర సహకారం కూడా ఉంటుంది. యూకే ప్రధాని రిషి సునాక్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంలో ఈ ఒప్పందం కుదిరింది. సమ్మిళిత, బాధ్యతాయుతమైన డిజిటల్ పరివర్తన కూడా ఇందులో భాగం.
11. ఇషాద్ మామిడి ఏ రాష్ర్టానికి చెందినది? (2)
1) మేఘాలయ 2) కర్ణాటక
3) హర్యానా 4) త్రిపుర
వివరణ: కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలో పండించే మామిడికే ఇషాద్ అని పేరు. ఇటీవల దీనికి భౌగోళిక గుర్తింపు దక్కింది. అంకోలా అనే పట్టణంలో దీన్ని ఎక్కువగా పండిస్తారు. 400 సంవత్సరాల నుంచి ఈ మామిడిని సాగు చేస్తున్నారు. ఇందులో కరి ఇషాద్, బిలి ఇషాద్ అనే రెండు రకాలున్నాయి. కరి ఇషాద్ సువాసన ప్రత్యేకమైంది. మామిడిపళ్లలో నాణ్యతతో కూడుకుంది.
12. ఇటీవల మైక్రోసాఫ్ట్, ఎయిర్జల్ది అనే సంస్థలు ఏ అంశానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి? (1)
1) గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ
2) సైబర్ భద్రత
3) పాఠశాలల్లో కంప్యూటర్ పాఠాలు
4) సాఫ్ట్వేర్ అభివృద్ధి
వివరణ: ‘కంటెంట్ ఫుల్ కనెక్టివిటీ’ అనే పేరుతో మైక్రోసాఫ్ట్, ఎయిర్జల్ది నెట్వర్క్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అనుసంధానాన్ని విస్తరిస్తారు. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు స్వచ్ఛంద, లాభాపేక్షలేని సంస్థలతో కూడా త్వరలో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ పరివర్తన తదితర సాంకేతిక అంశాలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నారు.
13. ప్రపంచ మహా సముద్రాల రోజు ఎప్పుడు నిర్వహిస్తారు? (2)
1) జూన్ 7 2) జూన్ 8
3) జూన్ 9 4) జూన్ 10
వివరణ: ఏటా జూన్ 8న ప్రపంచ మహా సముద్రాల రోజు నిర్వహిస్తారు. వీటి వల్ల ప్రయోజనాలు, జీవ వైవిధ్యం తదితర అంశాలను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేస్తారు. ఈ ఏడాది ఈ రోజు ఇతివృత్తం ‘ప్లానెట్ ఓషియన్: ది టైడ్స్ ఆర్ చేంజింగ్’ అంటే మహా సముద్రపు గ్రహం: అలల్లో మార్పులు వస్తున్నాయి’. పెరుగుతున్న భూతాపంతో మహా సముద్రాల మట్టం పెరుగుతుంది. అలాగే అక్కడి జీవ రాశిలో కూడా మార్పు వస్తుంది. మహా సముద్రాల మట్టం పెరిగితే కలిగే ఉపద్రవాలు తెలియజేసేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
14. ముడి ఉక్కు ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానం లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? (4)
1) 5 2) 4
3) 3 4) 2
వివరణ: ముడి ఉక్కు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరిందని కేంద్ర పౌర విమానయాన-ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గతంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం చైనా అగ్రస్థానంలో ఉంది. 2014-15లో భారతదేశంలో 88.98 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అయ్యేది. 2022-23 నాటికి 126.26 మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే 42% పెరుగుదల ఉంది. ఈ రంగంలోని సంస్థలు భారత ప్రభుత్వానికి చెల్లించిన డివిడెండ్ విలువ రూ. 21,204.18 కోట్లు ఉంది.
15) ఇంటర్నెట్ను హక్కుగా ప్రకటించిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది? (3)
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్
3) కేరళ 4) కర్ణాటక
వివరణ: ఇంటర్నెట్ను కనీసపు హక్కుగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఇదే. ఇందుకు కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్‌వర్క్‌ను జూన్ 5న ప్రారంభించింది. అందరికీ ఇంటర్నెట్ను సమానంగా అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. డిజిటల్ సౌకర్యాల మధ్య ఉన్న అంతరాలను ఇది తగ్గిస్తుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?