Current Affairs May 24 | క్రీడలు
క్రీడలు
ప్రణీత్
చెస్‌లో భారత 82వ గ్రాండ్ మాస్టర్ (జీఎం) హోదా ఉప్పల ప్రణీత్‌కు మే 14న లభించింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన ప్రణీత్ స్పెయిన్‌లో జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో మూడో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. బాకు ఓపెన్ తొమ్మిదో రౌండ్లో టాప్ సీడ్ అమెరికాకు చెందిన గ్రాండ్ మాస్టర్ హన్స్ నేమాన్పై గెలిచి 2500.5 ప్రత్యక్ష రేటింగ్‌కు చేరుకున్నాడు. గ్రాండ్ మాస్టర్ కావాలంటే మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్ ఉండాలి. ఆ అర్హత ప్రమాణాలను ప్రణీత్ సాధించాడు.
శుభ్‌మన్ గిల్
గిల్ ఒకే ఏడాది టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్లో సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా మే 16న రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు. అదే జట్టుపై అహ్మదాబాద్ వన్డేలో 128 పరుగులు తీశాడు. అహ్మదాబాద్‌లోనే మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో సెంచరీ సాధించాడు. ఇలా ఒకే ఏడాది నాలుగు విభాగాల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?