May 24 Current Affairs | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
ప్రతిమ
అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ శాఖ (ఎన్‌వైపీడీ)లో భారత సంతతి మహిళ ప్రతిమా భుల్లార్ మల్డోనాడో రికార్డు సృష్టించారు. ఆ శాఖలో అత్యున్నత ర్యాంకు పొందిన దక్షిణాసియా మహిళగా మే 18న గుర్తింపు పొందారు. ఆమె క్వీన్స్‌లోని దక్షిణ రిచ్మండ్ హిల్‌లోని 102వ పోలీస్ ప్రాంగణ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్‌లో జన్మించిన ఆమె చిన్నప్పుడే న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు వెళ్లారు.
ప్రవీణ్ సూద్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను కేంద్రం మే 14న ఎంపిక చేసింది. ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. 1986 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు.
బుచ్చిరెడ్డి
ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అనుబంధ సంస్థ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) డైరెక్టర్ (పర్సనల్)గా పల్లె బుచ్చిరెడ్డి మే 15న నియమితులయ్యారు. ఈయన తెలంగాణలోని హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందినవారు. నాగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎంపిక కావడం గమనార్హం.
రాబర్ట్ ఈ లూకాస్
ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త రాబర్ట్ ఈ లూకాస్ మే 15న మరణించారు. ఈయన చికాగో యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈయనకు 1995లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ లభించింది. స్థూల ఆర్థికశాస్త్రం, స్థూల ఆర్థికాంశాల అభివృద్ధిపై అత్యంత ప్రభావం చూపిన ఆర్థికవేత్త రాబర్ట్ లూకాస్.
చంద్రశేఖరన్
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువాలె డి లా లీజియన్ దోనర్’ను మే 17న ప్రకటించారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. ఫ్రాన్స్ అధ్యక్షుడి తరఫున ఐరోపా, ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాథరీన్ కోలోన్నా ఈ పురస్కారాన్ని అందజేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?