May Current Affairs | జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ పథకం ఏది?
1. ఏ సముద్రాన్ని ‘హరిత విద్యుత్ ప్లాంట్’గా మార్చాలని తొమ్మిది యూరోపియన్ దేశాలు నిర్ణయించాయి? (2)
1) మధ్యధరా సముద్రం
2) ఉత్తర సముద్రం
3) దక్షిణ సముద్రం
4) కాస్పియన్ సముద్రం
వివరణ: ఉత్తర సముద్రాన్ని హరిత విద్యుత్ ప్లాంట్‌గా మార్చాలని తొమ్మిది యూరోపియన్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. బెల్జియంలోని ఓస్టెండ్ అనే నగరంలో బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, యూకే దేశాలు సమావేశమయ్యాయి. విండ్ టర్బైన్లను ఏర్పాటు చేయడం ద్వారా యూరప్‌లోనే ఉత్తర సముద్రాన్ని అతిపెద్ద హరిత శక్తి కేంద్రంగా చేయాలనే లక్ష్యంగా ఆ దేశాలు నిర్ణయించాయి. 2030 నాటికి 120 గిగావాట్ల విద్యుత్ సృష్టించాలని కూడా నిర్ణయించాయి.
2. ఓరియన్ అనే సైనిక విన్యాసం ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? (4)
1) యూకే
2) ఘనా
3) స్పెయిన్
4) ఫ్రాన్స్
వివరణ: ఓరియన్ అనే పేరుతో వైమానిక దళ విన్యాసాలను ఫ్రాన్స్ దేశంలో ఏప్రిల్ 19 నుంచి మే 5 వరకు నిర్వహించారు. శివాంగి సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. భారత వైమానిక దళంలోని రాఫెల్ ఫైటర్ జెట్లకు పైలట్‌గా ఉన్న తొలి మహిళ ఆమె. ఆమె భారత వైమానిక దళంలో 2017లో చేరారు. రాఫెల్‌కు ముందు ఆమె ఎంఐజీ-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా నడిపారు. ఆమె వారణాసికి చెందినవారు.
3. దేశంలో తొలి సౌరనగరం ఏది? (3)
1) నామ్సాయ్ 2) సూరత్
3) సాంచీ 4) జైసల్మేర్
వివరణ: భారతదేశ తొలి సౌరనగరంగా సాంచీ నిలవనుంది. సౌరశక్తికి సంబంధించిన పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. సాంచీ మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఉంది. సాంచీ ప్రసిద్ధ బౌద్ధ పుణ్య క్షేత్రం. ఇది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. ప్రస్తుతం ఇంకా ఉన్న బౌద్ధ మత స్థూపాల్లో ఇదే అన్నింటి కంటే పురాతనమైంది. దీన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడు.
4. ఇటీవల ఏ సంస్థకు నవరత్న హోదాను కల్పించారు? (1)
1) రైల్ వికాస్ నిగమ్ 2) హెచ్‌సీఎల్
3) బీఈఎంఎల్ 4) ఏదీకాదు
వివరణ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు నవరత్న హోదాను కేంద్రం అందించింది. గతంలో ఇది మినీరత్నగా ఉంది. నవరత్నగా ఏప్రిల్ 26న హోదా పొందింది. 2021-22 సంవత్సరానికి ఆర్వీఎన్ఎల్ రూ.19,381 కోట్ల టర్నోవర్‌ను, రూ.1087 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది దేశంలో 13వ నవరత్న సంస్థగా మారనుంది. నవరత్న అనే అంశాన్ని 1997లో తెరపైకి తెచ్చారు.
5. ఏ దేశానికి చెందిన ముగ్గురు మహిళలకు ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అవార్డును ఇచ్చారు? (4)
1) రష్యా 2) పాకిస్థాన్
3) బెలారస్ 4) ఇరాన్
వివరణ: ఇరాన్ దేశానికి చెందిన నిలోఫర్ హమేదీ, ఎలెహ్ మహ్మది, నర్గీస్ మహ్మది అనే ముగ్గురు మహిళలకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అవార్డ్ దక్కింది. వీరు ఇరాన్‌కు చెందిన పాత్రికేయులు. ఇరాన్లో మానవ హక్కుల ఉల్లంఘన, జవాబుదారీతనం లేమికి సంబంధించి పలు అంశాలపై నివేదికలు ఇస్తున్నారు. ఏటా మే 3న ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ అవార్డులను పారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో ప్రకటిస్తుంది. భారతదేశంలో జాతీయ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం నవంబర్ 16న నిర్వహిస్తారు.
6. ఫిట్ ఫర్ 55 ఏ వ్యవస్థకు సంబంధించింది? (3)
1) షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్
2) బ్రిక్స్
3) యూరోపియన్ యూనియన్
4) నాటో
వివరణ: ఫిట్ ఫర్ 55 అనేది యూరోపియన్ యూనియన్‌కు సంబంధించింది. 2030 నాటికి హరిత వాయు ఉద్గారాలను కనీసం 55% తగ్గించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా ఇటీవల విధానాల్లో పలు మార్పులను చేశారు. అవి.. జల రవాణాలో ఉద్గారాలు లేకుండా చూడటం, అంతర్జాతీయ విమానయానానికి సంబంధించి ఉద్గారాలు లేకుండా జాగ్రత్త వహించడం,
7. ‘లౌండ్రోమేట్’ అనే పదం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) కర్బన ఉద్గారాలు
2) ఐదు దేశాలను సూచించే పదం
3) ప్రపంచంలోని అన్ని కూటముల
సముదాయం
4) పైవేవీ కాదు
వివరణ: లౌండ్రోమేట్ అనే పదంతో ఐదు దేశాలను సూచిస్తున్నారు. అవి.. భారత్, చైనా, టర్కీ, యూఏఈ, సింగపూర్. యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ పదాన్ని విరివిగా వినియోగిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా పైన యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ ఐదు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాని ద్వారా ఇతర వస్తువులను రూపొందించి, యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయని ఆరోపణ. ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని ఆయా దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
8. ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (1)
1) 161 2) 150
3) 152 4) 135
వివరణ: రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం పత్రిక స్వేచ్ఛా సూచీలో భారత్ 161వ స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకింగ్‌ను ప్రకటించారు. గతేడాది భారత్ 150వ స్థానంలో ఉంది. తాజా ర్యాంకింగ్‌లో మాత్రం 11 స్థానాలు దిగజారింది. ఈ సూచీలో పాకిస్థాన్ 150, అఫ్గానిస్థాన్ 152, శ్రీలంక 135, నేపాల్ 95వ స్థానా ల్లో ఉండగా, బంగ్లాదేశ్ 163, చైనా 179వ స్థానాల్లో ఉన్నాయి. తొలి మూడు స్థానాలను నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్ దేశాలు సొంతం చేసుకున్నాయి.
9. ఏ కూటమితో భారత్ నావిక విన్యాసాలను మే 2న ప్రారంభించింది? (3)
1) సార్క్ 2) బిమ్స్టెక్
3) ఏషియన్ 4) పైవేవీ కాదు
వివరణ: ఆగ్నేయ ఆసియా దేశాల కూటమితో భారత్ నావికా దళ విన్యాసాలను మే 2న ప్రారంభించింది. దక్షిణ చైనా సముద్రంలో వీటిని నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ ఢిల్లీ నౌకలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. సముద్రపు దశ, తీర దశగా చెప్పొచ్చు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెక్ చెప్పే ఉద్దేశంతో ఈ విన్యాసాలను చేపట్టారు. ఆగ్నేయ ఆసియా కూటమిలోని వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతో చైనాకు పలు దీవులకు సంబంధించి వివాదాలు ఉన్నాయి.
10. స్మార్ట్ సిటీస్ పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారు? (4)
1) 2026 2) 2027
3) 2025 4) 2024
వివరణ: నగరాల్లో ఆధునిక సౌకర్యాలను అందించేందుకు కేంద్రం 2015లో స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2024 వరకు పొడిగించారు. దేశ వ్యాప్తంగా 100 నగరాలను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలన్నది స్మార్ట్ సిటీస్ ముఖ్య లక్ష్యం. తెలంగాణ నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 7870 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఇందుకు రూ.1,81, 045 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. 2243 ప్రాజెక్టులను మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేశారు.
11. జాతీయ స్థాయిలో అమలవుతున్న సామాజిక అంశాల జాబితాలో తెలంగాణ నుంచి గుర్తింపు పొందింది ఏది? (2)
1) దళిత బంధు 2) ప్రకృతి వనం
3) రైతుబంధు 4) ఏదీకాదు
వివరణ: ప్రధాన సామాజిక విభాగాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. 14 రాష్ర్టాల్లో అమలవుతున్న వాటిని పరిశీలించి, 75 అంశాలతో జాబితాను రూపొందించింది. ఇందులో తెలంగాణ నుంచి రెండింటికి చోటు దక్కింది. అవి ప్రకృతి వనం, విద్యుత్ సంరక్షణ బిల్డింగ్ కోడ్. ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాలకు కూడా ప్రశంసలు దక్కాయి.
12. తెలంగాణలో నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏ ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకం చేశారు? (4)
1) కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 2) దళిత బంధు రెండో విడత
3) పోడు భూముల పంపిణీ 4) పైవన్నీ
వివరణ: ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఈ భవనానికి పెట్టారు. తొలి రోజునే కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. 10 శాఖల్లో 40 విభాగాల్లో పనిచేస్తున్న 5544 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. అలాగే 118 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో పథకం అమలు పూర్తయింది. అలాగే జిల్లాల వారీగా పోడు భూముల పట్టాలను మే నెలలో ఇవ్వనున్నారు. ఈ ఫైలుకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి సంబంధించి కూడా తొలి రోజునే సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
13. ఏ రాష్ర్టానికి సంబంధించి దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది? (4)
1) నాగాలాండ్ 2) మణిపూర్
3) మిజోరం 4) అసోం
వివరణ: అసోం రాష్ట్రంలో తిరుగుబాటు సంస్థ గా దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీకి (డీఎన్ఎల్ఏ) పేరు ఉంది. ఇటీవల ఈ వ్యవస్థ అసోం రాష్ట్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. 2019లో డీఎన్ఎల్ఏను ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం దిమాసా సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వారి సామాజిక, సాంస్కృతిక, భాషలను పరిరక్షిస్తారు. అలాగే ఉత్తర కాచర్ కొండల్లోని మరికొన్ని గ్రామాలను ఆరో షెడ్యూల్లోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు డీఎన్ఎల్ఏలకు చెరో రూ.500 కోట్లు కేటాయిస్తారు. వారిని అభివృద్ధి దిశగా తీసుకెళతారు.
14. జాఫ్రీ హింటన్ అనే వ్యక్తి ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? (1)
1) కృత్రిమ మేధ 2) రోబోటిక్స్
3) నానో టెక్నాలజీ 4) ఏదీకాదు
వివరణ: జాఫ్రీ హింటన్ కృత్రిమ మేధకు సంబంధించిన వ్యక్తి. ఆయనను ‘కృత్రిమ మేధ పిత’గా అభివర్ణిస్తారు. ఈ విధానంతో ఇబ్బందులు తప్పవంటూ స్వయంగా వెల్లడించారు. గూగుల్ సంస్థల నుంచి ఆయన వైదొలిగారు. గతంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఆఫ్ కంప్యూటింగ్ కూడా దక్కింది.
15. మేడిన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? (3)
1) సుమన్ బేరి
2) బీవీఆర్ సుబ్రమణ్యం
3) అమితాబ్ కాంత్
4) పరమేశ్వరన్ అయ్యర్
వివరణ: మేడిన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే పుస్తకాన్ని అమితాబ్ కాంత్ రచించారు. ప్రస్తుతం ఆయన జీ-20 షెర్పాగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన నీతి ఆయోగ్ సీఈవోగా పనిచేశారు. గడిచిన 75 సంవత్సరాల్లో దేశంలో వ్యాపార తీరుతెన్నులు, విధానాపరమైన అంశాలు, తొలి, మలి దశ సంస్కరణలు తదితర అంశాలను వివరించారు. సుమన్ బేరి ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుత సీఈవోగా బీవీఆర్ సుబ్రమణియం వ్యవహరిస్తున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?