Telangana History & Culture | భేటింగ్, తూమ్, దర్బారు ఏ జాతరకు సంబంధించినవి?
గతవారం తరువాయి..
242. కింది వివరాలను పరిశీలించండి.
1. హైదరాబాద్ విలీనం సమయంలో భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్
2. ‘ఆపరేషన్ పోలో’ సమయంలో హైదరాబాద్ సైన్యాధిపతి కాశీం రజ్వీ
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 d) రెండూ సరైనవి కావు
జవాబు: (d)
వివరణ: హైదరాబాద్ విలీనం సమయంలో భారత గవర్నర్ జనరల్‌గా రాజాజీ ఉన్నారు. ఇక ‘ఆపరేషన్ పోలో’ సమయంలో హైదరాబాద్ సైన్యాధిపతి జనరల్ ఎల్. ఎడ్రూస్.
243. 1947 సెప్టెంబర్ 18న నిజాం పాలన ముగిసిపోయిన తర్వాత హైదరాబాద్ రాజ్య ముఖ్య పౌర అధికారిగా ఎవరిని నియమించారు?
a) జనరల్ జయంత్ నాథ్ చౌధురి
b) జనరల్ ఎల్. ఎడ్రూస్
c) డి.ఎస్. జాక్ d) ఎం.కె. వెల్లోడి
జవాబు: (c)
వివరణ: హైదరాబాద్ విలీనం తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వాధినేత అయ్యారు. జనరల్ జె.ఎన్. చౌధురి రాష్ట్ర మిలిటరీ గవర్నర్‌గా వ్యవహరించారు.
244. మిలిటరీ పాలన తర్వాత ఎం.కె. వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది?
a) 1950 జనవరి
b) 1952 ఎన్నికల తర్వాత
c) 1949 నవంబర్ 26
d) 1950 ఆగస్టు 15 జవాబు: (a)
వివరణ: 1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది. దాంతో నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా (గవర్నర్‌కు సమానం) నియమించారు.
245. వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు ఏ శాఖలను చేపట్టారు?
a) రెవెన్యూ, హోం b) విద్య, రెవెన్యూ
c) విద్య, రెవెన్యూ, హోం
d) రెవెన్యూ, ఆర్థిక జవాబు: (b)
246. సైనిక చర్యకు ముందు నిజాం తరఫున ఆయుధ సేకరణ కోసం ఐరోపాలో ఎవరు పర్యటించారు?
a) కాశీం రజ్వీ b) సిడ్నీ కాటన్
c) ఎల్. ఎడ్రూస్
d) కొత్వాల్ వెంకటరామారెడ్డి
జవాబు: (c)
247. తెలుగు వారి తొలి పండుగ ‘ఉగాది’ ఏ నెలలో వస్తుంది?
a) వైశాఖం b) జ్యేష్ఠం
c) చైత్రం d) ఆషాఢం
జవాబు: (c)
248. కింది పండుగల్లో హిందూ కాలమానం ప్రకారం సరైన కాలక్రమాన్ని గుర్తించండి?
a) ఉగాది, వినాయక చవితి, కృష్ణాష్టమి, రక్షా బంధన్
b) ఉగాది, కృష్ణాష్టమి, రక్షాబంధన్, వినాయక చవితి
c) ఉగాది, రక్షా బంధన్, వినాయక చవితి, కృష్ణాష్టమి
d) ఉగాది, రక్షా బంధన్, కృష్ణాష్టమి, వినాయక చవితి జవాబు: (d)
వివరణ: ఉగాది (చైత్రం శుక్ల పాఢ్యమి 1వ నెల), రక్షా బంధన్ (5వ నెల అయిన శ్రావణ పౌర్ణమి), కృష్ణాష్టమి (శ్రావణ బహుళ అష్టమి), వినాయక చవితి (6వ నెల భాద్రపద శుక్ల చవితి) వస్తాయి. కాబట్టి జవాబు (d) అవుతుంది.
249. తెలంగాణ జానపదులు అత్యంత కోలాహలంగా జరుపుకొనే ‘బోనాలు’ ఏ నెలలో వస్తాయి?
a) జ్యేష్ఠం b) ఆషాఢం
c) శ్రావణం d) భాద్రపదం
జవాబు: (b)
250. హైదరాబాద్‌లో జరుపుకొనే బోనాల వేడుకలు ఎక్కడ ప్రారంభమవుతాయి?
a) గోల్కొండ జగదాంబిక ఆలయం
b) సికింద్రాబాద్ మహంకాళి ఆలయం
c) లాల్ దర్వాజ అక్కన్న మాదన్న ఆలయం
d) జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
జవాబు: (a)
వివరణ: బోనాల పండుగ: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఆషాఢ మాసం అంతా కోలాహలంగా జరుపుకొనే అమ్మతల్లుల ఆరాధనే బోనాల పండుగ. వర్షాకాలం మొదలై పరిసరాలు చిత్తడిగా మారిపోతాయి. ఇలాంటి సమయంలో అంటువ్యాధుల నుంచి రక్షించుకునేందుకు క్రిమి సంహారక గుణాలు కలిగిన పసుపు ప్రధానంగా సాగే జానపదుల వేడుక ఇది. గోల్కొండ కోటలోని జగదాంబికా ఆలయం నుంచి బోనాల వేడుక మొదలవుతుంది. ఘటం ఎదుర్కోళ్లతో బోనాలు మొదలవుతాయి. మొక్కుల్ని అనుసరించి స్త్రీలు బోనాలను తీసుకుని అమ్మవారి గుళ్లకు తరలి వస్తారు. బోనాన్ని అమ్మకు సమర్పిస్తారు. దీనిని ‘సాకబెట్టడం’ అంటారు. ఫలహారాన్ని బండ్లలో ఆలయానికి తీసుకెళ్లే ఘట్టం కూడా ప్రధానమైందే. పోతరాజులు, భవిష్యవాణి వినిపించే రంగం, ‘గావుపట్టడం’ లాంటివి బోనాల్లో ప్రత్యేక ఆకర్షణలు. గోల్కొండలో మొదలయ్యే బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల నాటికి ఊపందుకుంటాయి. ఇలా ఆషాఢంలో ప్రతి ఆదివారం నగరంలో గ్రామదేవతలకు (శక్తి ఆలయాల్లో) బోనాలు కోలాహలంగా జరుగుతుంటాయి.
251. బోనాల వేడుకలో చివరిదైన అమ్మవారిని ‘సాగనంపు’ కార్యక్రమం ఏ ఆలయంలో జరుగుతుంది?
a) జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
b) సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి గుడి
c) గోల్కొండ జగదంబిక గుడి
d) లాల్‌దర్వాజ అక్కన్న మాదన్న సింహవాహిని గుడి జవాబు: (d)
252. బతుకమ్మ పండుగ ప్రధానంగా ఏ నెలలో జరుగుతుంది?
a) భాద్రపదం b) ఆశ్వయుజం
c) కార్తికం d) శ్రావణం
జవాబు: (b)
వివరణ: బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకమైన పూల పండుగ. బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య (మహాలయ అమావాస్య) నాడు ప్రారంభమవుతుంది. మరునాడు ఆశ్వయుజం వస్తుంది. అలా తొలి రోజైన పాడ్యమి నుంచి నవమి వరకు సాయంత్రం వేళల్లో తెలంగాణ వీధులు బతుకమ్మ పాటల కోలాహలంతో సందడిగా ఉంటాయి.
253. గోండు తెగవారు జరుపుకొనే ‘నాగోబా’ జాతర ఏ రోజు మొదలవుతుంది?
a) పుష్య అమావాస్య
b) మార్గశిర అమావాస్య
c) మాఘ అమావాస్య
d) చైత్ర పౌర్ణమి జవాబు: (a)
వివరణ: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామం నాగోబా జాతరకు వేదిక. ఈ జాతరలో మెస్రం గోండు వంశీయులు ముఖ్యపాత్ర పోషిస్తారు. పుష్య అమావాస్య నాడు మొదలయ్యే ఈ జాతర ఐదు రోజులు (మాఘంలో కూడా) సాగుతుంది. ఇది నాగుపాము ఆరాధనకు సంబంధించింది.
254. భేటింగ్, తూమ్, దర్బారు ఏ జాతరకు సంబంధించినవి?
a) మేడారం b) ఐనవోలు మల్లన్న
c) నాగోబా d) లింగమంతుల
జవాబు: (c)
వివరణ: కొత్తగా పెళ్లయిన గోండు దంపతులను ఒక దగ్గర కూర్చోబెట్టి నిర్వహించే వేడుక ‘భేటింగ్’. పితృదేవతల ఆత్మశాంతికి దీపాలు వెలిగించే కార్యక్రమం ‘తూమ్’. గోండుల మంచిచెడ్డలను తెలుసుకునేందుకు అధికారులు నిర్వహించే సమావేశం ‘దర్బారు’. ‘దర్బారు’కు మానవ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ శ్రీకారం చుట్టారు.
255. తెలంగాణలో పుష్కరాలు నిర్వహించే నదులను సరిగ్గా గుర్తించండి?
a) గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మంజీర
b) గోదావరి, కృష్ణా, మంజీర, ఇంద్రావతి
c) గోదావరి, కృష్ణా, తుంగభద్ర, శబరి
d) గోదావరి, కృష్ణా, తుంగభద్ర, ప్రాణహిత
జవాబు: (d)
256. గోదావరి నదీ తీరంలో వెలసిన పుణ్యక్షేత్రాల పశ్చిమం నుంచి తూర్పునకు సరైన క్రమాన్ని గుర్తించండి?
a) బాసర, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి
b) బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం
c) ధర్మపురి, కాళేశ్వరం, బాసర, భద్రాచలం
d) భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, బాసర
జవాబు: (b)
257. నవ బ్రహ్మ ఆలయాలు ఏ క్షేత్రంలో ఉన్నాయి?
a) ఉమామహేశ్వరం b) శ్రీరంగాపురం
c) బీచుపల్లి d) అలంపురం
జవాబు: (d)
258. అలంపురం ఆలయాలు ప్రధానంగా ఏ శైలికి చెందినవి?
a) రేఖాంగ నాగర b) ద్రావిడ
c) వేసర d) సర్వతోభద్ర
జవాబు: (a)
259. అలంపురంలో ఉన్న ఆలయాలు ప్రధానంగా ఏ కాలానికి చెందినవి?
a) శాతవాహనులు b) విష్ణుకుండినులు
c) బాదామి చాళుక్యులు
d) వేంగీ చాళుక్యులు జవాబు: (c)
260. ఆలయాలు, అవి నెలకొన్న నదులను సరిగ్గా జతపరచండి?
A. అలంపురం 1. కృష్ణా
B. ఏడుపాయల 2. తుంగభద్ర
C. ధర్మపురి 3. గోదావరి
D. బీచుపల్లి 4. మంజీర
a) A-1, B-2, C-3, D-4
b) A-2, B-4, C-3, D-1
c) A-2, B-1, C-4, D-3
d) A-1, B-4, C-3, D-2
జవాబు: (b)
261. తెలంగాణలో హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా జరుపుకొనే పీర్ల పండుగ ఇస్లామిక్ పంచాంగం ప్రకారం ఏ నెలలో వస్తుంది?
a) రంజాన్ b) షాబాన్
c) మొహర్రం d) జమాదిలవ్వల్
జవాబు: (c)
262. సూఫీ సంప్రదాయానికి సంబంధించి ‘ఉర్సు’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) సూఫీ సాధువుల వర్ధంతి స్మరణ ఉత్సవాలు
b) రంజాన్ మాసం ఉపవాసాలు
c) సూఫీ సాధువులు భక్తులకు ఇచ్చే దీక్ష
d) ఈద్ సందర్భంగా చేసే సామూహిక ప్రార్థనలు
జవాబు: (a)
263. తీజ్, శీత్లాభవాని పండుగలు ఎవరికి సంబంధించినవి?
a) రాజ్ గోండులు b) బంజారాలు
c) కోలాములు d) పర్దాన్లు
జవాబు: (b)
264. శ్రావణ మాసం చివర్లో, భాద్రపద మాసం మొదట్లో రైతులు జరుపుకొనే వ్యవసాయ వేడుక ఏది?
a) కనుమ పండుగ b) తీజ్
c) పొలాల అమావాస్య
d) హరితాళికా వ్రతం జవాబు: (c)
వివరణ: పాడిపంటలు పుష్కలంగా ఉండాలని దీన్ని జరుపుకొంటారు.
265. కింది వాటిలో లంబాడీల పండుగ కానిది ఏది?
a) సంత్ సేవాలాల్ జయంతి
b) అకిపెన్ పండుగ
c) శీత్లాభవాని పండుగ d) తీజ్ పండుగ
జవాబు: (b)
వివరణ: అకిపెన్ గోండుల గ్రామదేవత. ఏటా జంతుబలిని ఇచ్చి అకిపెన్ను ఆరాధిస్తారు. అకిపెన్ ఉత్సవాన్ని గోండు భాషలో ‘నో వోంగ్’ అని పిలుస్తారు.
266. బతుకమ్మ పండుగ జరుపుకొనే రోజుల విశేషాలను జతపరచండి?
A. ఎంగిలిపూల బతుకమ్మ 1. మూడో రోజు
B. ముద్దపప్పు బతుకమ్మ 2. రెండో రోజు
C. అటుకుల బతుకమ్మ 3. ఒకటో రోజు
D. వెన్నముద్దల బతుకమ్మ 4. ఎనిమిదో రోజు
a) A-1, B-2, C-3, D-4
b) A-3, B-1, C-2, D-4
c) A-3, B-2, C-4, D-1
d) A-2, B-1, C-3, D-4
జవాబు: (b)
267. బతుకమ్మ పండుగకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. బతుకమ్మ పండుగ చివరిరోజున సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు
2. బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వం 2015 జూన్ 16న రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది
పై వాటిల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2
d) రెండూ సరైనవి కావు జవాబు: (a)
వివరణ: తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాల పండుగలను 2014 జూన్ 16న రాష్ట్ర ఉత్సవాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
268. కిందివారిలో బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసింది ఎవరు?
a) తిరునగరి దేవకీదేవి
b) ముదిగంటి సుజాతారెడ్డి
c) బండారు సుజాతాశేఖర్
d) పాకాల యశోదారెడ్డి జవాబు: (c)
269. దేవరి, కటోడా, భత్కల్ అనే పదాలు ఏ గిరిజన తెగ మతపరమైన విధులకు సంబంధించినవి?
a) చెంచులు b) కోయలు
c) కొండ రెడ్లు d) గోండులు
జవాబు: (d)
వివరణ: ‘దేవరి’ గోండుల గ్రామదేవత పూజచేస్తాడు. ‘కటోడా’ తెగ దేవతను శాంతింపచేస్తాడు. ‘భత్కల్’ గ్రామస్థుల సంక్షేమాన్ని ఊహిస్తాడు.
270. పీర్ల పండుగ సందర్భంగా నిప్పుల గుండం చుట్టూ లయబద్ధంగా తిరగడాన్ని ఏమని పిలుస్తారు?
a) ఈద్ b) ఉర్సు
c) ఘదీర్ d) అలావ్
జవాబు: (d)
271. కింది వాటిలో ఏది మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని (జయంతి) సూచిస్తుంది?
a) ఈదుల్ ఫిత్ b) మిలాద్ ఉన్ నబీ
c) ఈదుల్ జుహా d) ఈద్ మిలాద్ ఎ అలీ
జవాబు: (b)
272. పెర్సిపెన్ దేవుడి ఆరాధన ఎవరికి సంబంధించింది?
a) లంబాడీలు b) కోయలు
c) గోండులు d) చెంచులు
జవాబు: (c)
వివరణ: గోండులు తమ తెగ దైవం పెర్సిపెన్ పూజను ఏడాదిలో ఏప్రిల్-మే నెలల్లో ఒకసారి, డిసెంబర్-జనవరి నెలల్లో మరోసారి జరుపుకొంటారు.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు