IIIT Hyderabad | ఆర్ట్స్ విద్యార్థులకూ.. ఐఐఐటీలో ప్రవేశాలు
ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎంఎస్ కోర్సులు
IIIT Hyderabad Courses Admission 2023 | ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులు వారి అభిరుచి మేరకు ఆయా ప్రవేశ పరీక్షలను రాస్తున్నారు. వాటిలో వచ్చిన ర్యాంక్/స్కోర్ ఆధారంగా ఆయా కోర్సుల్లో/కాలేజీల్లో ప్రవేశాలు పొందుతారు. అయితే ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం ఆయా రాష్ట్ర బోర్డుల్లో టాప్ స్కోర్ సాధించిన వారికి ఐఐఐటీ హైదరాబాద్ నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంది. దీనికోసం ఇంటర్లో 90 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఆ వివరాలతోపాటు మరో ప్రముఖ ఐఐఐటీ బెంగళూరు ప్రవేశాల గురించి సంక్షిప్తంగా….
ఐఐఐటీ హైదరాబాద్
- హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని 1998లో నాట్ ఫర్ ప్రాఫిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (ఎన్-పీపీపీ) ప్రాతిపదికన ప్రారంభించారు. దేశంలో ఈ పద్ధతిలో ప్రారంభించిన మొదటి సంస్థ ఇదే. సుమారు 1896 మంది విద్యార్థులు, 101 మంది ఫ్యాకల్టీలు ఉన్నారు.
- బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌ను ఈ సంస్థ ఆఫర్ చేస్తుంది.
- అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను జేఈఈ మెయిన్ స్కోర్, స్పెషల్ చానెల్, డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్, అండర్గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్, లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఒలింపియాడ్ విన్నర్స్, బోర్డు స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తారు.
బోర్డు స్కోర్‌తో.. - ఇంటర్/10+2 స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లో కనీసం 90 శాతం స్కోర్ సాధించిన వారు అర్హులు.
ఆఫర్ చేస్తున్న కోర్సులు
ఇంటిగ్రేటెడ్ బీటెక్ – ఎంఎస్ (కంప్యూటేషనల్ నేచురల్ సైన్సెస్- సీఎన్డీ)
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
ఇంటిగ్రేటేడ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్- ఎంఎస్ (కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్) - అర్హతలు: కనీసం 85 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథ్స్‌తోపాటు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్ ఎలక్టివ్, సోషియాలజీ.
- ఎంపిక: పై రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారిని మొదట షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 6
- ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 19, 20
- వెబ్సైట్: https:// ugadmissions.iiit.ac.in/boards/
- పూర్తి వివరాల కోసం
UG Admissions
IIIT Hyderabad, Gachibowli
Hyderabad – 500 032 - Email: ugadmissions@iiit.ac.in
- Phone: +91 (40) 6653 1250లో సంప్రదించవచ్చు.
ఐఐఐటీ బెంగళూరు
- బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ బెంగళూరు) ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
- ప్రోగ్రామ్: ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (ఐదేండ్లు)
- విభాగాలు: ఏఐ ఎంఎల్ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్), టీఎస్సీడీ (థియరీ అండ్ సిస్టమ్స్ ఫర్ కంప్యూటింగ్ అండ్ డేటా), ఎన్సీ (నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్), వీఎల్ఎస్ఐ
(వీఎల్ఎస్ఐ సిస్టమ్స్), సైబర్ సెక్యూరిటీ, డీటీ (డిజిటల్ సొసైటీ). - అర్హతలు: ప్రథమ శ్రేణిలో మ్యాథ్స్ సబ్జెక్టుగా 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక: జేఈఈ మెయిన్-2023 ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 12
- వెబ్సైట్: https://www.iiitb.ac.in/courses/integrated-mtech
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?