Current Affairs April 25 | వార్తల్లో వ్యక్తులు
నందిని గుప్తా
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2023గా రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందిని గుప్తా (19) ఎంపికయ్యారు. ఈ పోటీలను మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఏప్రిల్ 16న నిర్వహించారు. ఫైనల్ పోటీకి 30 మంది ఎంపికయ్యారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
రుమేసా గెల్గీ
ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా రుమేసా గెల్గీ (26) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఏప్రిల్ 16న చోటు సంపాదించింది. తుర్కియేలోని సఫ్రన్బోలు జిల్లాలో జన్మించిన ఆమె నాలుగు నెలల వయస్సులోనే ‘వీవర్స్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు. ఆమె ఎత్తు ఏడు అడుగులకు పైనే. ఎత్తయిన మహిళగానే కాకుండా పెద్ద చేతులు, పొడవైన వేళ్లు, వెన్నెముక కలిగిన మహిళగా ఆమెపై మొత్తం 5 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ప్రపంచంలో ఈ వ్యాధి బారినపడినవారు 50 మంది మాత్రమే ఉన్నారు.
దీపికా మిశ్రా
వింగ్ కమాండర్ దీపికా మిశ్రా భారత వాయుసేన శౌర్య (గ్యాలంట్రీ) అవార్డును ఏప్రిల్ 20న అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. మధ్యప్రదేశ్ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. రాజస్థాన్‌కు చెందిన ఆమె హెలికాప్టర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ఈ అవార్డును అందజేశారు.
నైనా జైస్వాల్
ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 22 ఏండ్ల వయస్సులో పీహెచ్డీ పట్టా ఏప్రిల్ 20న అందుకున్నారు. భారతదేశంలో అతిచిన్న వయస్సులో డాక్టరేట్ పొందిన మొదటి అమ్మాయిగా నిలిచారు. ఏపీ, రాజమహేంద్ర వరంలోని నన్నయ యూనివర్సిటీ నుంచి ఆమె పీహెచ్డీ పూర్తి చేశారు. ‘మహబూబ్‌నగర్ జిల్లా మహిళల సాధికారతలో సూక్ష్మరుణాల పాత్ర’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ఆమె లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎనిమిదేండ్ల వయస్సులో 10వ తరగతి పూర్తి చేసి ఆసియాలోనే అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. పదేండ్లకే ఇంటర్, 13 ఏండ్లకే డిగ్రీ చేశారు. తరువాత ఎంఏ పూర్తి చేసి ఆసియాలోనే పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?