Current Affairs April 25 | అంతర్జాతీయం
నీటి బ్యాటరీ
నీటి ఆధారిత బ్యాటరీలను అభివృద్ధి చేసినట్లు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన జోడి లుట్కెన్హాస్ ఏప్రిల్ 16న వెల్లడించారు. నీటి ఆధారిత ఎలక్ట్రోడ్స్తో ఈ బ్యాటరీని తయారు చేశారు. ఇవి లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే వెయ్యి శాతం మెరుగైనవి. ఈ నీటి బ్యాటరీల వల్ల లిథియం-అయాన్, కోబాల్ట్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
వరల్డ్ హెరిటేజ్ డే
ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్ డే)ను ఏప్రిల్ 18న నిర్వహించారు. చారిత్రక, వారసత్వం, సాంస్కృతిక స్మారక చిహ్నాల ప్రాముఖ్యతను భవిష్యత్తరాలకు అందించడానికి, వాటిని రక్షించడానికి అవసరమైన చర్యల గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వారసత్వ భావనను 1982లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మూమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీవోఎంవోఎస్) ప్రవేశ పెట్టింది. దీన్ని 1983లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘హెరిటేజ్ చేంజెస్’. వాతావరణ మార్పుల వల్ల వారసత్వ ప్రదేశాలు ఎలా ప్రభావితమవుతున్నాయో, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ థీమ్ లక్ష్యం.
లివర్ డే
వరల్డ్ లివర్ డే (ప్రపంచ కాలేయ దినోత్సవం)ని ఏప్రిల్ 19న నిర్వహించారు. లివర్ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటి లివర్ డేని 2012లో నిర్వహించారు. కాలేయం మానవ శరీరంలో రెండో అత్యంత ముఖ్యమైన అవయవం. ఈ ఏడాది దీని థీమ్ ‘బీ విజిలెంట్, డు ఏ రెగ్యులర్ లివర్ చెకప్, ఫ్యాటీ లివర్ కెన్ ఎఫెక్ట్ ఎనీవన్ (అప్రమత్తంగా ఉండండి, రెగ్యులర్గా లివర్ చెకప్ చేయించుకోండి, ఫ్యాటీ లివర్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది)’.
భారత్ నంబర్ 1
యునైటెడ్ నేషనల్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) రూపొందించిన ప్రపంచ జనాభా నివేదిక (స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-ఎస్డబ్ల్యూవోపీ)-2023ను ఏప్రిల్ 19న విడుదల చేశారు. దీని ప్రకారం.. 142.86 కోట్ల జనాభాతో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉంది. 1950 నుంచి ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల్ని ప్రచురిస్తుంది. అప్పటి నుంచి చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది. తొలిసారిగా ఈ ఏడాది భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు