April 25 Sports Current Affairs | క్రీడలు
క్రీడలు
ప్రియాంక
ఫ్రాన్స్‌లో ఏప్రిల్ 16న జరిగిన టోర్నియో ఎంఐఎఫ్ ఇకామ్ లియోన్-2023 ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో నూతక్కి ప్రియాంక (ఏపీ) విజేతగా నిలిచింది. తొమ్మిది రౌండ్ల టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగి ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సాధించింది.
గుకేశ్
భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మెనోర్కా ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో వరుగా రెండోసారి టైటిల్‌ను గెలిచాడు. స్పెయిన్‌లో ఏప్రిల్ 16న జరిగిన ఈ పోటీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తరువాత గుకేశ్‌తో పాటు మరో తొమ్మిది మంది ఏడు పాయింట్లతో సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా గుకేశ్, ప్రణవ్‌లకు తొలి రెండు ర్యాంకులు లభించాయి. విజేతను నిర్ణయించేందుకు గుకేశ్, ప్రణవ్ మధ్య రెండు బ్లిట్జ్ టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. గుకేశ్ 1.5-0.5 పాయింట్లతో ప్రణవ్ను ఓడించాడు. గుకేశ్‌కు 3000 యూరోలు (రూ.2.69 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఆండ్రీ రుబ్లెవ్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నీలో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ విజయం సాధించాడు. మొనాకో (ఫ్రాన్స్)లో ఏప్రిల్ 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచాడు. రుబ్లెవ్ కెరీర్లో ఇదే తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతకు 8,92,590 యూరోలు (రూ.8 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది.
పారా బ్యాడ్మింటన్
బ్రెజిల్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ నిత్యశ్రీ, నితీశ్‌లకు స్వర్ణ పతకాలు లభించాయి. ఏప్రిల్ 17న నిర్వహించిన చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్-6 కేటగిరీలో నిత్యశ్రీ గిలియానా పొవెడ ఫ్లోరెస్ (పెరూ)ను ఓడించి స్వర్ణం సాధించిది. అదేవిధంగా డబుల్స్‌లో శివరాజన్ సలైమలైతో కలిసి చుమాన్-చోయ్ వింగ్ (హాంకాంగ్)పై గెలిచి మరో స్వర్ణం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఎస్ఎల్-3 ఫైనల్లో కుమార్ నితీశ్ ప్రమోద్ భగత్‌ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో నితీశ్-తులసీమతి హిక్మత్-లీనీ (ఇండోనేషియా)పై గెలిచారు. ఈ టోర్నీలో భారత్ 6 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్యాలతో మొత్తం 24 పతకాలు సాధించింది.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?