Current Affairs April 25 | జాతీయం
గ్లోబల్ బయోగ్యాస్ సదస్సు
కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ)పై గ్లోబల్ సదస్సును ఏప్రిల్, 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించారు. దీన్ని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఎఫ్జీఈ (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ)-సీబీజీ ప్రొడ్యూసర్స్ ఫోరం నిర్వహించింది. సీబీజీ పరిశ్రమ అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల గురించి పరిశ్రమలకు అవగాహన కల్పించడంతో పాటు విధాన సవరణలు, అవసరమైన ప్రాంతాలను గుర్తించడం ఈ సదస్సు లక్ష్యం. ‘టువర్డ్స్ ప్రోగ్రెసివ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఏ రోబస్ట్ సీబీజీ ఫౌండేషన్ అండ్ గ్రోత్’ అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు.
పీఎస్ఎల్వీ సీ55
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని షార్ నుంచి ఏప్రిల్ 22న చేపట్టిన పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్-2, 16 కిలోల ల్యూమ్లైట్-4 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. టెలీయోస్-2లో సింథటిక్ అపెర్చర్ రాడార్ పేలోడ్‌ను ఉంచారు. ఇది భూ పరిశీలన శాటిలైట్. ల్యూమ్లైట్-4 సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చుతుంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?